Heroes Remuneration: టాలీవుడ్‌లో ఎవరు ఎక్కువ పారితోషికం తీసుకుంటారో తెలుసా?
టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూరేషన్ తీసుకుంటోన్న హీరోల్లో పవన్ కల్యాణ్ రెండో స్థానంలో నిలిచాడు. ఆయన ఒక్కో సినిమాకు రూ.60 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటున్నారు.
దేశంలో తెలుగు సినిమాల ఆధిపత్యం కొనసాగుతోంది. బాహుబలితో యావత్ దేశాన్ని ఉర్రూతలూగించి తెలుగువారి స్టామినా ఏంటో విశ్వవ్యాప్తం చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. దీంతో అందులో హీరోగా చేసిన ప్రభాస్ పాన్ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అనంతరం మన సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే వసూళ్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాయి. ఇదే అదునుగా మన హీరోలు తమ రెమ్యూనరేషన్‌ను కూడా అమాంతం పెంచేశారు. ఈ పరంగా చూసుకుంటే టాలీవుడ్ అందరికంటే అత్యధిక పారితోషికం తీసుకుంటూ ప్రభాస్ అగ్రస్థానంలో ఉన్నారు.
బాహుబలి, సాహో, రాధేశ్యామ్ లాంటి పాన్ఇండియా సినిమాలతో తన క్రేజ్‌ను అమాంతం పంచేసుకున్న ఈ స్టార్.. ఒక్కో చిత్రానికి రూ.100 కోట్ల వరకు పుచ్చుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రభాస్ ఇంత భారీ మొత్తంలో పారితోషికాన్ని పెంచినప్పటికీ అంత మొత్తం ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు దర్శక, నిర్మాతలు. ఆయనతో సినిమా చేస్తే వందల కోట్లలో వసూళ్లు గ్యారెంటీ అనేట్లుగా సినిమాలు పక్కా దుమ్మురేపుతున్నాయి. ప్రభాస్‌తో పాటు మహేశ్ బాబు, అల్లు అర్జున్ కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్‌ను అడుగుతున్నారట. వీరిద్దరూ ఒక్కో చిత్రానికి 50 నుంచి 50 కోట్లు డిమాండ్ చేస్తున్నారని మసమాచారం.
పాన్ఇండియా స్థాయిలో కాకుండా తెలుగు సినిమాల వరకే చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ జాబితాలో ముందున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న ఆయన.. ఒక్కో చిత్రానికి రూ.60 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. ఆయన సినిమాలు తెలుగుకు మాత్రమే పరిమితమైనప్పటికీ కలెక్షన్ల మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ కారణంగా రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో తీసుకుంటున్నారు పవన్.
త్వరలో పవర్ స్టార్ తమిళంలో మంచి హిట్ అయిన వినోదాయ సీతమ్ రీమేక్‌లో నటించనున్నారు. ఈ సినిమాకు రూ,60 కోట్లకుపైనే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో తెలుగులో అత్యధిక రెమ్యూనేరషన్ తీసుకుంటున్న రెండో హీరోగా నిలిచారు.
సంబంధిత కథనం
టాపిక్