Lal Salaam OTT: లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్‍పై సందిగ్ధత.. ప్లాట్‍ఫామ్ మారిందా!
Lal Salaam OTT Release: లాల్ సలామ్ సినిమా ఓటీటీలోకి రాలడం ఆలస్యమవుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రాలేదు. అయితే, ఈ మూవీ ఓటీటీ ప్లాట్‍ఫామ్ మారిందనే బజ్ బయటికి వచ్చింది. ఆ వివరాలివే..
Lal Salaam OTT: భారీ అంచనాల మధ్య వచ్చిన లాల్ సలామ్ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టుకోలేకపోయింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రజినీ కూతురు ఐశ్వర్య తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్ అయింది. లాల్ సలామ్ మూవీని థియేటర్లలో చూడని వారు ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని వేచిచూస్తున్నారు. అయితే, అది మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది.
లాల్ సలామ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి అంచనాలు చాలాసార్లు వచ్చాయి. తొలుత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలిసింది. మార్చి 8వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందని ప్రచారం జరిగింది. అయితే, ఆరోజున లాల్ సలామ్ స్ట్రీమింగ్‍కు రాలేదు.
మార్చి 21న లాల్ సలామ్ చిత్రం ఓటీటీలోకి వస్తుందని బజ్ నడిచింది. అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. ఆయితే, తాజాగా ఈ చిత్రం స్ట్రీమింగ్‍పై ఓ సమాచారం బయటికి వచ్చింది.
ప్లాట్‍ఫామ్ మార్పు.. ఆరోజే స్ట్రీమింగ్?
లాల్ సలామ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్‍ఫ్లిక్స్ నుంచి ‘సన్ నెక్స్ట్’ ప్లాట్‍ఫామ్‍కు మారినట్టు తాజా బజ్ బయటికి వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీన సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఇదైనా ఫిక్స్ అవుతుందో.. మళ్లీ ఏదైనా ట్విస్ట్ ఉంటుందో చూడాలి.
లాల్ సలామ్ గురించి..
లాల్ సలామ్ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍లో మతకలహాల అంశం కూడా ఈ చిత్రంలో ప్రధానంగా ఉంది. చాలాకాలం విరామం తర్వాత మళ్లీ ఈ చిత్రంతో దర్శకురాలిగా రీఎంట్రీ ఇచ్చారు ఐశ్వర్య. అయితే, ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. కొంత ఫుటేజ్ మిస్ అవడం, కథలో మార్పులు చేయడం వల్ల సినిమాపై ప్రభావం పడిందని కొన్ని ఇంటర్వ్యూల్లో ఐశ్వర్య తెలిపారు. మొత్తంగా జైలర్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రజినీ.. లాల్ సలామ్ రూపంలో ప్లాఫ్ ఎదురైంది.
లాల్ సలామ్ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. లివింగ్‍స్టన్, సెంథిల్, విఘ్నేష్, జీవిత రాజశేఖర్, కేఎస్ రవికుమార్, తంబి రామయ్య, నిరోశ, అనంతిక ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో మోయిద్దీన్ భాయ్ పాత్ర చేశారు రజినీ.
లాల్ సలామ్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. సుమారు రూ.80కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీని రూపొందించారు. అయితే, ఓవరాల్‍గా కలెక్షన్లు రూ.40 కోట్లు కూడా దాటలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్ అయింది. తెలుగులో కూడా డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక, ప్రస్తుతం రజినీకాంత్ వెట్టాయిన్ చిత్రం చేస్తున్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు.
టాపిక్