Krishna mukunda murari march 20th: ఆట మొదలైంది, కొత్త ముకుంద వచ్చేసింది.. కృష్ణకి దూరంగా ఉండాలనుకున్న మురారి-krishna mukunda murari serial march 20th episode murari worries after mukunda threatens him to stay away from krishna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari March 20th: ఆట మొదలైంది, కొత్త ముకుంద వచ్చేసింది.. కృష్ణకి దూరంగా ఉండాలనుకున్న మురారి

Krishna mukunda murari march 20th: ఆట మొదలైంది, కొత్త ముకుంద వచ్చేసింది.. కృష్ణకి దూరంగా ఉండాలనుకున్న మురారి

Gunti Soundarya HT Telugu
Mar 20, 2024 07:16 AM IST

Krishna mukunda murari serial march 20th episode: తన ప్రేమ, పగ సాధించుకోవడం కోసం ముకుంద రూపం మార్చుకుంటుంది. ఇక ముకుంద నిజంగా ఆత్మ రూపంలో వచ్చి తనని సాధిస్తుందని మురారి నమ్మేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 20వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 20వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial march 20th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కొత్త ముకుంద ఎంట్రీ ఇచ్చింది. రూపం మార్చుకుని తన ప్రేమని దక్కించుకోవాలని ఆట మొదలుపెట్టింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..

తృటిలో కృష్ణకి పెద్ద ప్రమాదం తప్పిపోతుంది. కిందపడిపోయిన కృష్ణని మురారి జాగ్రత్తగా పైకి లేపుతాడు. అప్పుడే కారులో అటుగా వెళ్తున్న ముకుందని చూసి షాక్ అవుతాడు. దెబ్బలు తగల్లేదు కదా అని కృష్ణ మురారిని అడుగుతుంది. లేదని చెప్పి నీకు ఎలా ఉందని అంటాడు. అంటే జస్ట్ మిస్ కొంచెం ఉంటే తలకి ఆ రాయి తగిలేదని అంటుంది. ముకుంద మురారి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. 

ముకుంద ఆత్మ అని నమ్మిన మురారి 

నేను చీర బాగానే పట్టుకున్నాను బైక్ లో ఎలా పడిందో అర్థం కావడం లేదని కృష్ణ చెప్తుంది. నాకు అర్థం అయ్యింది కృష్ణ ముకుంద కనిపించడం మాట్లాడటం భ్రమ కాదు నిజమే. తన ఆత్మ మన ఇంట్లోనే తిరుగుతుంది. మనల్ని విడదీయాలని చూస్తుంది. నిన్ను ఓపెనింగ్ తీసుకెళ్తే ఊరుకొనని చెప్పింది అన్నట్టుగానే ప్రమాదం జరిగేలా చేసింది. ముకుందని చాలా తక్కువ అంచనా వేశాను చచ్చి కూడా సాధిస్తుందని మురారి అనుకుంటాడు. 

హాస్పిటల్ కి వెళ్దామా అంటే వద్దు నా మనసు ఏదో కీడు సంకిస్తుంది ఇంటికి వెళ్లిపోదామని మురారి చెప్తాడు. ప్రోగ్రామ్ కి రావడం లేదని మురారి హాస్పిటల్ కి ఫోన్ చేసి చెప్తానని కాల్ చేస్తాడు అక్కడ ముకుంద ఫోన్ లిఫ్ట్ చేసింది. కృష్ణని తీసుకెళ్లవద్దని చెప్పాను వినలేదు అది చచ్చింది ఏం చేస్తుందని అనుకున్నావ్ కానీ రిజల్ట్ చూశావ్ గా. నన్ను సీరియస్ గా తీసుకో మురారి నేను లేకపోయినా నిన్ను ప్రతిక్షణం కనిపెడుతూనే ఉంటాను. 

నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి అంత ఈజిగా ఎలా వదిలేస్తాను అనుకున్నావ్ వదలను. మళ్ళీ చెప్తున్నా నువ్వు కృష్ణకి అంత దూరంగా ఉంటే తను అంత సేఫ్ గా ఉంటుంది. ఈసారి చిన్న ప్రమాదంతో తప్పించుకుంది ఈసారి ఇలాగే చేస్తే ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేను. బుద్ధిగా ఇంటికి పోయి నేను చెప్పినట్టు చెయ్యి అనేసి ఫోన్ పెట్టేస్తుంది. 

ప్లాన్ బి స్టార్ట్ చేసిన ముకుంద 

మురారి కాల్ కట్ చేసి మళ్ళీ చేస్తాడు. ఇంతకముందు ఫోన్ ఎవరు లిట్ చేశారని అంటే ఎవరూ లేరు మీరు ఇప్పుడే కదా ఫోన్ చేసిందని అవతలి వ్యక్తి అబద్ధం చెప్తాడు. ముకుంద అతడికి డబ్బులు ఇస్తుంది. హాస్పిటల్ ఓపెనింగ్ కి రావడం లేదని చెప్తాడు. నేను ఆత్మని అని మురారి పూర్తిగా నమ్మేశాడు. కృష్ణని షికారుకి తీసుకువెళ్లడం కాదు కదా పక్కన కూర్చోవడానికి కూడా భయపడతాడు. ప్లాన్ ఏ సక్సెస్. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి కృష్ణ వాళ్ళు దూరంగా ఉంటారు. పక్కనే ఉండి కాపాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్లాన్ బి అమలు చేస్తాను. ఎక్కడ ప్రేమ పోగొట్టుకొన్నానో అక్కడే గెలుచుకుంటాను. ఈసారి నన్ను ఎవరూ అపలేరని అనుకుంటుంది. 

కృష్ణ వాళ్ళు వెంటనే ఇంటికి వచ్చేసరికి రేవతి హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్లలేదా అని అడుగుతుంది. లేదు దారిలో చిన్న ప్రమాదం జరిగి కృష్ణ కిందపడిపోయిందని చెప్తాడు. రేవతి కంగారుగా దెబ్బలు ఏమి తగల్లేదు కదా అంటే తగులుతాయి అలా చేసే వాళ్ళకి ఇలాగే తగులుతాయని ఆదర్శ్ ఎంట్రీ ఇస్తాడు. మనం ఒకరికి అన్యాయం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చేసిన ఖర్మకి శిక్ష అనుభవించేలా చేస్తాడని కోపంగా అంటాడు. ఎంత చెప్పినా నీకు అర్థం కాదా మారవా అని రేవతి అడుగుతుంది. మంచిగా ఉండే వాడిని అందరూ కలిసి నన్ను ఇలా చేశారు. అసలు ఇలాంటి వాళ్ళతో ఇలా ఉండటమే కరెక్ట్ అని అంటాడు. కృష్ణని  ఏమైనా అంటే ఊరుకొనని మధు వార్నింగ్ ఇస్తాడు. కృష్ణ ఆపుతుంది. 

ఆదర్శ్ నోరు మూయించిన కృష్ణ 

మేము స్పీడుగా వెళ్తున్న మాకు ఎలాంటి దెబ్బలు తగల్లేదు. మేము ఎలాంటి వాళ్ళం అనేది దేవుడికి తెలుసు అందుకే క్షేమంగా బయట పడేలా చేశాడు. మేము ఏ తప్పు చేయలేదని అనడానికి ఇంతకన్నా రుజువు ఏం కావాలి. ఒక్కోసారి మనం వేరే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటాం ఆ విషయం మనకి కూడా తెలుసు కానీ ఏదో అడ్డు వస్తుంది. అది తెలుసుకో ఆదర్శ్ ఆ అడ్డు తొలగించి చూడు అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారని కృష్ణ అంటుంది. అర్థం చేసుకునే వాళ్ళకి ఏదైనా చెప్పొచ్చు కానీ మొండిపట్టు పట్టిన వాళ్ళకి ఎంత చెప్పినా ఇలాగే ఉంటారని మురారి కోపంగా వెళ్ళిపోతాడు. ఆదర్శ్ మాటలు పట్టించుకోవద్దని రేవతి సర్ది చెప్తుంది. 

ఓపెనింగ్ కి వెళ్ళకుండా వెనక్కి తీసుకొచ్చారు ఎందుకు ఇంత సడెన్ గా నిర్ణయం మార్చుకున్నారో అర్థం కావడం లేదని కృష్ణ డౌట్ పడుతుంది. ముకుంద డాక్టర్ ని కలిసి మాట్లాడుతుంది. మురారి నాకు ఈ ఐడియా వచ్చిందంటే అదంతా నీ వల్లే వస్తున్నా మళ్ళీ నీకోసమని అనుకుంటుంది. ఫేస్ సర్జరీ చేసేందుకు డాక్టర్ కి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తుంది. మురారి ముకుంద కనిపించింది గుర్తు చేసుకుంటాడు. నేను కృష్ణతో క్లోజ్ గా ఉంటే తన ప్రాణాలు తీసేస్తుంది. ఈ ప్రమాదం జరగకపోయి ఉంటే నేను ఇదంతా భ్రమ అనుకునే వాడిని. ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉంది నేను ఎవరికో ఫోన్ చేస్తే అక్కడ ఉంది. తను లేకపోయినా ఆత్మగా మారి నా వెంటే ఉంది. ఈ ఆత్మలు కథల్లో మాత్రమే ఉంటాయని అనుకున్నాను కానీ నిజ జీవితంలో కూడా ఉంటాయా?

కృష్ణకి దూరంగా 

తను ప్రేమ గురించి ఆలోచిస్తే నేను కుటుంబం గురించి ఆలోచించాను. తన మనసు ఎలా మార్చాలి ప్రాణాలతో ఉన్నప్పుడే నా మాట వినలేదు పిశాచిగా మారినప్పుడు ఏం వింటుంది. కృష్ణకి దూరంగా ఉండటం ఒక్కటే మార్గమా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం రావాలంటే శాంతి పూజ చేయిద్దామని రేవతి వాళ్ళు డిసైడ్ అవుతారు. 

ఇంట్లో పూజ ఏర్పాట్లు చూసి ఏం జరుగుతుందని ఆదర్శ్ అడుగుతాడు. ఇంటి క్షేమం కోసం శాంతి పూజ చేయిస్తున్నాం. పూజ చేస్తే ఇంటికి పట్టిన పీడ వదులుతుందని పూజలో కూర్చోమని రేవతి అడుగుతుంది. ఇంటికి పట్టిన పీడ ఏంటో అందరికీ తెలుసు వాళ్ళని వదిలిస్తే చాలని కృష్ణని మళ్ళీ నిందిస్తాడు. 

కొత్త ముకుంద వచ్చేసింది 

రేవతి ఎన్ని చెప్పినా కూడా ఆదర్శ్ పూజలో కూర్చోవడానికి ఇష్టం చూపించడు. ఎందుకు మమ్మల్ని ద్వేషిస్తున్నావని కృష్ణ కన్నీళ్ళతో అడుగుతుంది. నువ్వు మమ్మల్ని ద్వేషిస్తుంది ముకుంద కోసమే కదా తన మీద నీకు అభిమానం ఉంది కదా అయితే తనకోసమైన హోమంలో కూర్చోమని చెప్తుంది. ముకుంద ఆత్మ శాంతి కోసం కూడా పూజ చేస్తున్నామని అంటుంది. 

తన మాటలకు కన్వీన్స్ అయిన ఆదర్శ్ హోమంలో కూర్చుంటాడు. అటు ముకుందకి డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ చేసి రూపం మార్చేస్తుంది. పూజలో కూర్చున్న వాడు ముకుంద మాటలు తలుచుకుని పైకి లేస్తాడు. తనకి ఇష్టం లేదని చెప్పేస్తాడు. ముకుంద కొత్త మొహం రివీల్ అవుతుంది. ఆదర్శ్ హోమంలో నుంచి వెళ్ళిపోయాడు నా మనసు ఏదో కీడు సంకిస్తుందని కృష్ణ కంగారుపడుతుంది. ఇక తర్వాత కృష్ణ, మురారి పూజలో కూర్చుంటారు. ముకుంద తన కొత్త మొహాన్ని అద్దంలో చూసుకుంటుంది.