Goddess lakshmi devi: రంగ్‌భరీ ఏకాదశి రోజు తులసిని ఇలా పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారు
Goddess lakshmi devi: ఏకాదశికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశిని రంగ్బరీ లేదా అమలకి ఏకాదశి అంటారు. ఆరోజు తులసి మాతని ఇలా పూజించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.
Goddess lakshmi devi: ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. దీనినే అమలకి ఏకాదశి లేదా రంగ్‌భరీ ఏకాదశి అంటారు. ఈ ఏడాది మార్చి 20వ తేదీ బుధవారం అమలకి ఏకాదశి వచ్చింది.
పంచాంగం ప్రకారం మార్చి 20 అర్థరాత్రి 12.21 గంటలకు(తెల్లవారితే గురువారం) ప్రారంభమై మార్చి 21 తెల్లవారుజామున 2.22 గంటలకు ఏకాదశి తిథి ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం అమలకి ఏకాదశి ఉపవాసం మార్చి 20వ తేదీన ఆచరిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఆరోజు ఉపవాసం పాటించే భక్తులు 12 నెలల ఏకాదశి ఫలితాలను పొందుతారని చెబుతారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల భక్తులకు ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. పేదలకు దానాలు చేయడం పుణ్య స్నానం ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
శివపార్వతుల వివాహం జరిగిన తర్వాత సతీసమేతంగా శివుడు కాశీ వెళ్లిన రోజును రంగ్‌భరీ ఏకాదశి అంటారు. శివపార్వతుల రాకకు సంతోషంగా అక్కడ అందరూ భస్మంతో హోలీ వేడుకలు జరుపుకుంటారు. అలాగే ఈరోజు విష్ణువు, మహాలక్ష్మిని అన్ని ఆచారాలు అనుసరించి పూజిస్తారు.
రంగ్‌భరీ ఏకాదశి నాడు తులసిని తప్పనిసరిగా పూజించాలి. విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. అందుకే ఏకాదశి నాడు తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు అమలకి ఏకాదశి రోజు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది.
రంగ్‌భరీ ఏకాదశి రోజున ఇలా చేయండి
రంగ్‌భరీ ఏకాదశి నాడు తులసిని పూజించేటప్పుడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. విష్ణువుని ఆచారాల ప్రకారం విశ్వాసంతో పూజించాలి. మంత్రాలని పఠించాలి. స్వామి వారికి సమర్పించే నైవేద్యాలలో తులసి ఆకులు తప్పనిసరిగా చేర్చాలి. ఎందుకంటే విష్ణువుకి తులసి అంటే మహా ప్రీతి.
ఏకాదశి నాడు తులసిని సరైన రీతిలో పూజిస్తే విష్ణు అనుగ్రహంతో మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అలాగే తులసి మాతని పూజించేటప్పుడు 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిలో మార్పులు చోటు చేసుకుంటాయి. శారీరిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవాళ్లు అమలకి ఏకాదశి నాడు తులసీదేవికి ఎరుపు రంగు చునారీ కట్టి పూజించాలి. ఇది వైవాహిక జీవితంలో సంతోషాన్ని తీసుకొస్తుంది. భాగస్వాముల మధ్య ప్రేమ, అవగాహన పెంచుతుంది.
ఆనందం, శ్రేయస్సు కోసం
రంగ్బరీ ఏకాదశి రోజున ఉసిరి చెట్టును తప్పనిసరిగా పూజించాలి. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు, అదృష్టం మీ సొంతం అవుతాయి.
ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు
రంగ్బరీ ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి. తర్వాత చందనం, బిల్వ పత్రాలు సమర్పించాలి. అన్ని సమస్యలు తొలగించమని ఐశ్వర్యం ప్రసాదించమని శివుడిని వేడుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.
రంగ్బరీ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పార్వతీ సమేతంగా శివుడిని, విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేయడం వల్ల వివాహానికి ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి.