Ka Theatrical Rights: కిరణ్ అబ్బవరం ‘క’ థియేట్రికల్ రైట్స్ కొన్న స్టార్ హీరో.. హిట్ కొట్టినట్లే అంటున్న నెటిజన్స్-kiran abbavaram ka movie malayalam theatrical rights sold to dulquer salmaan production company wayfarer films ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ka Theatrical Rights: కిరణ్ అబ్బవరం ‘క’ థియేట్రికల్ రైట్స్ కొన్న స్టార్ హీరో.. హిట్ కొట్టినట్లే అంటున్న నెటిజన్స్

Ka Theatrical Rights: కిరణ్ అబ్బవరం ‘క’ థియేట్రికల్ రైట్స్ కొన్న స్టార్ హీరో.. హిట్ కొట్టినట్లే అంటున్న నెటిజన్స్

Sanjiv Kumar HT Telugu
Sep 09, 2024 03:09 PM IST

Dulquer Salmaan Bought Ka Theatrical Rights: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క. ఈ క సినిమా మలయాళ థియేట్రికల్ రైట్స్‌ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిలీంస్ సొంతం చేసుకుంది. కిరణ్ అబ్బవరం హిట్ కొట్టినట్లే అని నెటిజన్స్ అంటున్నారు.

కిరణ్ అబ్బవరం ‘క’ థియేట్రికల్ రైట్స్ కొన్న స్టార్ హీరో.. హిట్ కొట్టినట్లే అంటున్న నెటిజన్స్
కిరణ్ అబ్బవరం ‘క’ థియేట్రికల్ రైట్స్ కొన్న స్టార్ హీరో.. హిట్ కొట్టినట్లే అంటున్న నెటిజన్స్

Kiran Abbavaram Ka Theatrical Rights: యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ "క". ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌తో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

స్టార్ హీరో కంపెనీ

"క" సినిమా గురించి వస్తున్న పాజిటివ్ టాక్ ఇతర చిత్ర పరిశ్రమల దృష్టినీ ఆకర్షిస్తోంది. తాజాగా "క" సినిమా సినిమా మలయాళ థియేట్రికల్ రైట్స్‌ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది. మలయాళంలో "క" సినిమాను వరల్డ్ వైడ్‌గా సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ సంస్థ థియేట్రికల్ రిలీజ్ చేయనుంది.

"క" సినిమా ఫస్ట్ లుక్, టీజర్ చూసిన దుల్కర్ సల్మాన్ ఇంప్రెస్ అయి మలయాళ వెర్షన్‌ను తమ వేఫేరర్ ఫిలింస్ సంస్థలో విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. స్ట్రాంగ్ కంటెంట్‌తో "క" సినిమా ఈ క్రేజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రైట్స్‌ను నిర్మాత వంశీ నందిపాటి తీసుకున్నారు. ఇదే క్రమంలో త్వరలోనే తమిళ, కన్నడతో పాటు ఇతర భాషల బిజినెస్ క్లోజ్ కానుంది అని తెలుస్తోంది.

మంచి కంటెంట్ ఉంటేనే

అయితే, "క" సినిమా థియేట్రికల్ హక్కులను తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కొనుగోలు చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తెలిసిన నెటిజన్స్ కిరణ్ అబ్బవరం ఇక హిట్ కొట్టినట్లే అని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో మంచి కంటెంట్ లేకపోతే దుల్కార్ సల్మాన్ వంటి న్యూ ఏజ్ హీరో మలయాళ థియేట్రికల్ రైట్స్ కొనరు కదా అని "క" మూవీపై పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే, "క" సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

అన్ని ప్లాప్ సినిమాలు

"క" సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ చేయనున్నారు. కాగా కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి గారు సినిమాతో పరిచయమై మంచి హిట్ కొట్టాడు. తర్వాత ఎస్ఆర్ కల్యాణ మండపం మూవీతో మరో హిట్ అందుకున్నాడు. కానీ, ఆ తర్వాత వచ్చిన కిరణ్ అబ్బవరం సినిమాలు ఏవి అంతగా మెప్పించలేకపోయాయి.

హిట్ కోసం పరితపిస్తున్న కిరణ్ అబ్బవరంకు "క" మూవీ మంచి సక్సెస్ అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, రాజా వారు రాణి గారు హీరోయిన్, తన ప్రేయసి అయిన రహస్య గోరక్‌ను ఇటీవల పెళ్లి చేసుకుని ఇంటివాడు అయ్యాడు కిరణ్ అబ్బవరం.