OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott crime thriller web series goli soda rising to stream on disney plus hotstar from september 13th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller Web Series: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి ఓ తమిళ వెబ్ సిరీస్ తెలుగులోనూ రాబోతోంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయడంతోపాటు స్ట్రీమింగ్ తేదీని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఓ హిట్ మూవీ సిరీస్ లో భాగంగా ఈ కొత్త వెబ్ సిరీస్ తెరకెక్కింది.

ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తోంది. తమిళంలో హిట్ అయిన గోలీ సోడా మూవీ ఫ్రాంఛైజీ నుంచి ఈ సిరీస్ వస్తుండటం విశేషం. విజయ్ మిల్టన్ డైరెక్ట్ చేసిన గోలీ సోడా మూవీ 2014లో రిలీజ్ కాగా.. తర్వాత 2018లో గోలీ సోడా 2 వచ్చింది. ఇప్పుడు గోలీ సోడా రైజింగ్ పేరుతో వెబ్ సిరీస్ రానుండగా.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది.

గోలీ సోడా రైజింగ్ స్ట్రీమింగ్ డేట్

గోలీ సోడా రైజింగ్ ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఈ సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి హాట్‌స్టార్ లో తమిళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. నలుగురు వ్యక్తుల చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఈ సిరీస్ లో షామ్, అభిరామి, పుగళ్, రమ్య నంబీషన్, అవంతికా మిశ్రా, చేరన్, ఆర్కే విజయ్ మురుగన్, భరత్ శ్రీని లాంటి వాళ్లు నటించారు.

గోలీ సోడా రైజింగ్ వెబ్ సిరీస్ మొత్తం ఏడు భాషల్లో రానుంది. తమిళం, తెలుగుతోపాటు కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. గోలీ సోడా ఫ్రాంఛైజీ నుంచి వస్తున్న ఈ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతోంది.

హిట్ ఫ్రాంఛైజీ గోలీ సోడా

పాపులర్ డైరెక్టర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన గోలీ సోడా చిత్రానికి ఐఎమ్‌డీబీలో పదికి 7.7 రేటింగ్ ఉండగా.. రెండో పార్ట్ గోలీ సోడా 2 సినిమాకు 7 రేటింగ్ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ రెండు సినిమాలు తమిళనాట ఎంత పెద్ద హిట్ సాధించాయో.

ఇప్పుడు సినిమా రూపంలో కాకుండా సిరీస్ రూపంలో మూడో పార్ట్ తీసుకురాబోతున్నారు. వారం కిందట టీజర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ తోపాటు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.

గోలీ సోడా రైజింగ్ వెబ్ సిరీస్‌ను గోలీ సోడా 1కి సీక్వెల్‌గా, రెండో భాగమైన గోలీ సోడా 2కి ప్రీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. అంటే గోలీ సోడాకు తర్వాత, గోలీ సోడా 2కి ముందు అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్ డైరెక్టర్ ఇటీవల విజయ్ ఆంటోనీ హీరోగా చేసిన మజై పిడిక్కత మనిథన్‌ (తెలుగులో తుఫాన్) మూవీని తెరకెక్కించారు.