Karthika deepam november 20th episode: శివనారాయణను రెచ్చగొట్టాలని చూసిన జ్యోత్స్న- శౌర్య గురించి కార్తీక్ నిజం చెప్తాడా?
Karthika deepam 2 serial today november 20th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 20వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీపను ఎలాగైనా పంపించేందుకు శివనారాయణను రెచ్చగొట్టాలని జ్యోత్స్న అనుకుంటుంది. అయితే పెద్దాయన మాత్రం పగతో కాదు ఏదైనా ఆలోచనతో చేయాలని కౌంటర్ వేస్తాడు.
Karthika deepam 2 serial today november 20th episode: శివనారాయణ రెస్టారెంట్ లో రచ్చ చేసి వెళతాడు. శౌర్య వచ్చి ముద్దుల తాత ఎందుకు తిడుతున్నాడని అడుగుతుంది. ఏం లేదని కార్తీక్ కవర్ చేస్తాడు. జరిగిన దానికి దీప కన్నీళ్ళు పెట్టుకుంటుంది.
రెచ్చగొట్టిన జ్యోత్స్న
తన తాతకు జ్యోత్స్న దీప గురించి మరింతగా ఎక్కిస్తుంది. మన రెస్టారెంట్ లో మనకు ఇంత అవమానం జరిగితే ఏం చేయలేమా అని అంటుంది. ఈరోజు నిన్ను దీప ఎదిరించి మాట్లాడింది. ఏం చేయకుండా మౌనంగా ఉంటే దాని ముందు నువ్వు ఒడిపోయినట్టేనని రెచ్చగొట్టడానికి చూస్తుంది.
కానీ శివనారాయణ మాత్రం ఆలోచనతో చేయాలి, పగతో కాదని చెప్తాడు. రెస్టారెంట్ లో జరిగిన విషయాన్ని కాంచన వాళ్ళతో చెప్పొద్దని దీప అంటుంది. అక్కడ జరిగిన విషయం తెలిస్తే కాంచన వాళ్ళు బాధపడతారని దీప అనుకుంటుంది. రెస్టారెంట్ లో ఏం జరిగిందో చెప్పమని కాంచన శౌర్యకు చాక్లెట్స్ ఆశ చూపి అడుగుతుంది.
నాకు నచ్చలేదు దీప
ముద్దుల తాత, జ్యో వచ్చారని చెప్పి దీప రావడం చూసి పారిపోతుంది. రెస్టారెంట్ లో ఏం జరిగిందని కొడుకును అడుగుతుంది. కానీ ఎవరూ ఏం చెప్పకుండా ఉండిపోతారు. కార్తీక్ దీప దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. నేను ఆయన మనవడిని కాబట్టి కొట్టే హక్కు ఉంది. నువ్వు ఆయన్ని అడ్డుకోవడం నచ్చలేదని అంటాడు.
మీ విషయంలో ఏదైనా తప్పు జరిగి మీ కారణంగా మిమ్మల్ని కొట్టి ఉంటే అడ్డుపడేదాన్ని కాదు. కానీ నా కారణంగా మీరేందుకు దెబ్బలు తినాలి. అందుకే అడ్డుపడ్డాను. నా కారణంగా మిమ్మల్ని ఎవరు ఏమన్నా నేను ఊరుకొనని చెప్తుంది.
జ్యోత్స్నతో చెప్పింది నిజమేనా?
మా బావ నీ మొగుడు అయ్యాడు కాబట్టి కొడితే ఊరుకొను అంటావా అని జ్యోత్స్న అడిగిన మాట గుర్తు చేసుకుని అడుగుతాడు. నువ్వు జ్యోత్స్నతో చెప్పిన మాట నచ్చింది, నేను అలాగే అనుకొనా అంటాడు.
ఆ మాట మనస్పూర్తిగా అన్నానని చెప్తుంది. కార్తీక్ సంతోషపడతాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందని కాంచన టెన్షన్ గా అడుగుతుంది. నా బావ ఇప్పుడు నీ మొగుడు అయ్యాడనా మాట కూడా పడనివ్వడం లేదని జ్యోత్స్న అంటే అదే అనుకో అంది దీప అని సంతోషంగా చెప్తాడు.
స్పృహ కోల్పోయిన శౌర్య
కాంచన, అనసూయ చాలా సంతోషపడతారు. దీప మనసు పూర్తిగా కార్తీక్ బాబు వైపు వెళ్ళేలా చేయాలని అనసూయ అంటుంది. చంటి దాన్ని అడ్డుపెట్టుకుని దేవుడు ఆ మనుషులను కలిపాడు. దాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళ మనసులు కూడా కలుపుదామని అనుకుంటారు.
శివనారాయణగారు రెస్టారెంట్ లో జరిగిన విషయాన్ని అంత తేలికగా మర్చిపోరు. సుమిత్రమ్మకు తెలిస్తే చాలా బాధపడతారని దీప అనుకుంటుంది. శౌర్య అప్పుడే గదిలోకి వచ్చి ఆడుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. దీప పరధ్యానంగా ఉండి పట్టించుకోదు.
నా కూతురికి ఏమైంది?
కాసేపటికి కార్తీక్ వచ్చి చూసి కంగారుగా శౌర్యను లేపుతాడు. ట్యాబ్లెట్స్ ఇవ్వలేదని దీప చెప్పేసరికి టైమ్ కి ఎందుకు ఇవ్వలేదని కోప్పడతాడు. కూతురి పరిస్థితి చూసి దీప చాలా కంగారుపడుతుంది. కాంచన వాళ్ళు ఏమైందని అడుగుతారు. ట్యాబ్లెట్స్ వేయలేదని చెప్తాడు.
నా కూతురికి ఏమైంది. మందులు వేసుకోకపోతే ఇలా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోతుంది. దానికి ఇప్పుడు జ్వరం కూడా లేదు కదా. మందులు ఎందుకు వేస్తున్నారని దీప కంగారుగా అడుగుతుంది. డాక్టర్ చెప్పిన మాటలు కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. రిపోర్ట్స్ లో ఏం వస్తుందోనని టెన్షన్ పడతాడు.
నిజం చెప్తాడా?
కార్తీక్ నిజం చెప్పలేడు, చెప్తే కానీ దీప అర్థం చేసుకోలేదు. శౌర్యకు ఏమౌవుతుందోనని కాంచన కంగారుపడుతుంది. తనకేం కాదని శౌర్య ధైర్యంగా మాట్లాడుతుంది. నా కూతురికి ఏమైందని దీప కార్తీక్ ని నిలదీస్తుంది. నీకు మాత్రమే కూతురా అని అంటే మీరు అనుకున్నట్టు తాను ఉండలేనని చెప్తుంది.
నన్ను భర్తగా ఎందుకు చూడలేకపోతున్నావని అడుగుతాడు. చూడకుండానే ఉంటున్నానా అంటుంది. దానికి భయం పోలేదు అందుకే కొన్నాళ్ళు మందులు వాడాలని డాక్టర్ చెప్పాడని అబద్ధం చెప్తాడు. అయితే అదే మాట తన మీద ఒట్టేసి చెప్పమని దీప కార్తీక్ ని అడుగుతుంది.
టాపిక్