Karthika deepam november 19th episode: తాత, మనవడి మాటల యుద్ధం- 'నా కార్తీక్ బాబు మీద చెయ్యి ఎత్తితే ఊరుకోను' దీప
Karthika deepam 2 november 19th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. పేపర్ లో పెళ్లి ఫోటో వేయించి దాని కింద సుమిత్ర పేరు కూడా వేయించినందుకు శివనారాయణ కార్తీక్ తో గొడవ పడేందుకు రెస్టారెంట్ కు వస్తాడు. ఆవేశంలో కార్తీక్ మీద పెద్దాయన చెయ్యి చేసుకోబోతే దీప అడ్డుకుంటుంది.
Karthika deepam 2 serial today november 19th episode: దీపతో తన రెస్టారెంట్ లో ఉప్మా బిర్యానీ చేయించేందుకు కార్తీక్ నచ్చజెప్తాడు. వంట చేస్తూ కార్తీక్ నే చూస్తూ ఉంటుంది. రెస్టారెంట్ లో పని చేస్తున్న ఒకతను కార్తీక్ గొప్పదనం గురించి చెప్తూ ఉంటాడు. రెస్టారెంట్ లో స్టాఫ్ పిల్లలను కూడా సార్ చదివిస్తున్నారని చెప్తాడు. కాసేపటికి కార్తీక్ దీప దగ్గరకు వెళతాడు. తాను మంచి పనులు చేయడానికి కారణం నువ్వే దీప అంటాడు.
రెస్టారెంట్ కి జ్యోత్స్న
మీలా ఏ కుటుంబం బాధపడకూడదని తన దగ్గర పని చేసే అందరికీ ఇన్స్యూరెన్స్ చేయించానని చెప్తాడు. పిల్లలను చదివించాలనే ఆలోచన శౌర్య వల్ల వచ్చిందని అంటాడు. మీ మంచితనం గురించి తెలుస్తున్న కొద్దీ మీరు ఆకాశమంత ఎత్తులో కనిపిస్తున్నారని దీప అనుకుంటుంది.
దీప ఆవేశంగా జ్యోత్స్న రెస్టారెంట్ కు వస్తుంది. బోర్డు మీద ఉప్మా బిర్యానీ చూసి ఎవరు రాశారని అడుగుతుంది. కార్తీక్ సర్ వైఫ్, పాప వచ్చారు. మేడమ్ స్వయంగా వంట చేస్తున్నారని మేనేజర్ చెప్తాడు. దీప మేడమ్ కిచెన్ లో ఉప్మా బిర్యానీ చేస్తున్నాడని అనేసరికి జ్యోత్స్న లాగిపెట్టి కొడుతుంది.
దీపను ఎందుకు తెచ్చావ్
నీకు మేడమ్ నేనే దీప కాదని అంటుంది. జ్యోత్స్నకు దీప ఎదురుపడుతుంది. మా రెస్టారెంట్ లో జాయిన్ అయిన వంట మనిషివి నువ్వేనా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. కార్తీక్ వచ్చి జ్యోత్స్నను ఆపుతాడు. దీపను ఎందుకు రెస్టారెంట్ కు ఎందుకు తీసుకొచ్చావని అడుగుతుంది.
నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అంటాడు. అప్పుడే శివనారాయణ కూడ వస్తాడు. నీతో తేల్చుకోవడం కోసం వచ్చాను అని పెద్దాయన పేపర్ లో ఫోటో చూపించి సమాధానం చెప్పమని అడుగుతాడు. ఇది ప్రశ్న కాదు సమాధానం. నా పెళ్లి గురించి అందరికీ తెలియాలని అనుకున్నాను. అందుకే పేపర్ లో వేయించానని చెప్తాడు.
మీరు అవకాశవాదులు
మా పరువు ఎందుకు తీశావని నిలదీస్తాడు. నీ పేరు పక్కన జ్యోత్స్న గ్రూప్స్ ఆఫ్ సీఈవో అని ఎందుకు రాశావని కోపంగా అడుగుతాడు. అది తన పోస్ట్ అని అంటాడు. పక్కకి వెళ్ళి మాట్లాడదామని అంటే పెళ్ళాం ముందు పరువు పోతుందా? నీది మీ నాన్న బుద్ధి.
మీరంతా అవకాశవాదులు. అవకాశానికి తగినట్టు వాడుకుంటారని అంటుంటే దీప ఆపబోతుంది. నువ్వు మాట్లాడకు నిన్ను చూస్తుంటే కంపరంగా ఉంది. మొదట నా ఇంట్లో చేరావ్, ఇప్పుడు నా కూతురు ఇంట్లో చేరావు. ఇప్పుడు రెస్టారెంట్ లో చేరావని తిడతాడు.
పరువు రోడ్డున పెట్టావ్
పేపర్ లో ప్రకటన వస్తే నీ పరువు పోయిందని అనుకుంటే మాకు నీకు ఏ సంబంధం లేదని ప్రకటన ఇచ్చుకో తాత. మా అమ్మతో పుట్టింటి బంధాన్ని దూరం చేశారు. ఇప్పుడు మాట్లాడకపోతే పేర్లతో ఉన్న బంధం కూడా దూరం చేసేలా ఉన్నారని కార్తీక్ అంటాడు.
దీప మెడలో తాళి కట్టినప్పుడు గుర్తు రాని పేర్లు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? పేపర్ లో మీ నాన్న పేరు వేయించకోలేదు ఎందుకు పరువు పోతుందని కదా. విలువలు లేని మనిషి కోసం అందరినీ కాదని మా పరువు రోడ్డున పెట్టావని శివనారాయణ కోపంగా అంటాడు.
నువ్వే వేయించుకో
దీపను ఏమి అనొద్దని చెప్తాడు. మర్యాదగా నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పమని అడుగుతాడు. శివనారాయణ కుటుంబానికి నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళ పేర్లు వేయించి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా చేశానని క్షమించమని ప్రకటన వేయించమని పెద్దాయన చెప్తాడు.
మీరు కావాలంటే నా ఫోటో వేయించి వీడికి మాకు ఏ సంబంధం లేదని వేయించుకోమని కార్తీక్ ఎదురు సమాధానం చెప్తాడు. మీరే మీ పరువును తగలబెట్టుకుంటున్నారు. వయసులో చిన్నవాడిని అయినా నాకున్న బుద్ధి కూడా మీకు లేదని కార్తీక్ అనేసరికి శివనారాయణ కోపంగా మనవడి మీదకు చెయ్యి ఎత్తుతాడు.
పెద్దాయనను అడ్డుకున్న దీప
కానీ దీప పెద్దాయన చేతిని ఆపుతుంది. కార్తీక్ బాబు ఒంటి మీద చేయి పడటానికి వీల్లేదు అది ఎవరి చెయ్యి అయినా సరే అని దీప అనేసరికి శివనారాయణ చేయి దించుతాడు. క్షమించండి తాతగారు మిమ్మల్ని అవమానించడానికి అడ్డుకోలేదు. నా కార్తీక్ బాబు ఆత్మాభిమానం కాపాడుకోవడానికని దీప చెప్తుంది.
జ్యోత్స్న కల్పించుకుని మా బావ నీ మొగుడు అయ్యాడు కాబట్టి చెయ్యి ఎత్తితే ఊరుకొను అంటావ్ అంతేనా అంటే అంతే అనుకో దీప ఎదురు మాట్లాడుతుంది. శివనారాయణ దీపను ఇష్టం వచ్చినట్టు తిడతాడు. మీకోపం నామీద నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతానని దీప కన్నీళ్లతో అడుగుతుంది.
నీ కుటుంబానికి మాకు ఏ సంబంధం లేదు. నువ్వు నా పేరు, నా ఇంటి పేరు, నా ఇంట్లో పేర్లు వాడుకోవడానికి వీల్లేదని శివనారాయణ చెప్తాడు. మీ తాత పేరు ఏంటని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలని కార్తీక్ బాధగా అడుగుతాడు. నాకు తాత లేడు చచ్చాడు అని చెప్పమని పెద్దాయన కోపంగా అంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్