Karthika deepam november 16th episode: శివనారాయణకు బ్యాడ్ న్యూస్- అందరికీ షాకిచ్చిన కార్తీక్, జ్యోత్స్న మైండ్ బ్లాక్-karthika deepam 2 serial today november 16th episode shivanarayan recives bad news from vishwanatham ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam November 16th Episode: శివనారాయణకు బ్యాడ్ న్యూస్- అందరికీ షాకిచ్చిన కార్తీక్, జ్యోత్స్న మైండ్ బ్లాక్

Karthika deepam november 16th episode: శివనారాయణకు బ్యాడ్ న్యూస్- అందరికీ షాకిచ్చిన కార్తీక్, జ్యోత్స్న మైండ్ బ్లాక్

Gunti Soundarya HT Telugu
Nov 16, 2024 07:15 AM IST

Karthika deepam 2 serial today november 16th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 16 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శివనారాయణ జ్యోత్స్నకు తన ఫ్రెండ్ మనవడితో పెళ్లి చేద్దామని అనుకుంటాడు. అప్పుడే అతను ఫోన్ చేసి పరువు లేని ఇంటితో తాను వియ్యం అందలేనని చెప్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 16 ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 16 ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today november 16th episode: డబ్బు తీసుకుని వెళ్లిపొమ్మని జీవితంలో కనిపించకూడదని జ్యోత్స్న దీపతో డీల్ చేసుకుంటుంది. ఈ డీల్ ఒకే అని దీప అనేసరికి జ్యోత్స్న చాలా సంతోషిస్తుంది. ఇంత త్వరగా ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని అంటుంది. ఎంత కావాలని అంటే అంత ఇస్తానని చెప్తుంది.

చెప్పుతో కొడతా

ఐదోతనం ఎంతకు అమ్ముకోవాలో నాకు తెలియదు. ఇంటికి వెళ్ళి మీ నానమ్మను నీ ఐదోతనం ఎంతకు అమ్ముతావని అడుగు. అప్పుడు నేను కూడా చెప్తానని దీప అంటుంది. జ్యోత్స్న కోపంగా దీప అంటే చెప్పు తీసుకుని కొడతాను ఇంకోమాట నోట్లో నుంచి బయటకు వచ్చిందంటే.

తాళి బొట్టు అంటే ఏమనుకుంటున్నావ్. ఐదోతనం అంటే బంగారం కొట్టులో తాళి కొనడం అనుకుంటున్నావా? లాగిపెట్టి కొడితే ఒకవైపు బుర్ర పని చేయదు. మీ నానమ్మ, అమ్మ తాళికి ఎలాంటి విలువ ఇస్తారో నేను అలాంటి విలువ ఇస్తాను. నా కూతురికి నువ్వు తల్లివి అవుతావా?

కార్తీక్ బాబే తండ్రి

ముందు నువ్వు మీ అమ్మకు కూతురిలా ఉండు. డబ్బు ఉందని ఏది పడితే అది కొనాలని అనుకోకు. అమ్మడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. నా కూతురికి తండ్రులు మారారు అన్నావ్ కదా తనకు తండ్రులు మారలేదు. కార్తీక్ బాబు దానికి తండ్రి.

కార్తీక్ బాబు తండ్రిగా మారకముందు దానికి తల్లి, తండ్రి నేనే. అప్పుడు కూడా అది ఎవరిని నాన్న అని పిలవలేదు. అది మొదటిసారి నాన్న అని పిలిచింది కార్తీక్ బాబును. కాబట్టి దానికి తండ్రి కార్తీక్ బాబు. నేను బతికున్నంత వరకు దానికి మరొక అమ్మ అవసరం లేదు.

కోపంలో కాశీ

ఇలాంటి పిల్ల వేషాలు వేయకు. మరోసారి ఇలా ఫోన్ చేసి రమ్మని మాట్లాడితే ఇంటికి కాదు డైరెక్ట్ గా హాస్పిటల్ కి పంపిస్తానని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. శ్రీధర్ పారిజాతం చేసిన అవమానం తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు. కావేరి వచ్చి చురకలు వేస్తుంది.

ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. కాశీ కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దాసు వచ్చి ఏమైందని అంటాడు. ఇప్పటి వరకు పారిజాతం నానమ్మ అంటే చిరాకు ఉండేది కానీ ఇప్పుడు జ్యోత్స్న అక్క అంటే కూడా చిరాకు వచ్చింది. తప్పు నాదే రిసెప్షన్ చేయకుండా ఉండాల్సిందని అంటాడు.

జ్యోత్స్న నీకు అక్క

దీపక్క వాళ్ళకు వెళ్ళి సారీ చెప్తానని అంటాడు. ఈ గొడవలు ఆగాలంటే శివనారాయణ దగ్గరకు వెళ్ళి జ్యోత్స్న అక్కకు త్వరగా కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటానని అంటాడు. జ్యోత్స్న నీకు అక్క, దీప పరాయిది అని దాసు నోరు జారతాడు. దీపక్క చాలా మంచిదని కాశీ అంటాడు.

జ్యోత్స్న దీపక్క జోలికి రాకుండా ఉండాలంటే తనకు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని స్వప్న కూడా అంటుంది. గొడవలు వద్దని దాసు సర్ది చెప్పేందుకు చూస్తాడు. కాసేపటికి స్వప్న, కాశీ గిల్లిగజ్జాలు ఆడుకుంటారు. శివనారాయణ దశరథ జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

పెళ్లి క్యాన్సిల్

జ్యోత్స్న విషయంలో విశ్వనాథంతో మాట్లాడతానని అంటాడు. అప్పుడే విశ్వనాథం శివనారాయణకు ఫోన్ చేస్తాడు. ఈరోజు పేపర్ చూశావా? జ్యోత్స్న రెస్టారెంట్ ఓనర్ కార్తీక్ అంటే నీ మనవడే కదా. ఆ అబ్బాయే కదా నీ మనవరాలిని పెళ్లి చేసుకోవాల్సింది. కానీ నువ్వు నిజాలు దాచావు.

నీ మనవడు పెళ్లి చేసుకుంది దీపను కదా. ఆమెకిది రెండో పెళ్లి పైగా కూతురు కూడా ఉందట కదా. అల్లుడు విషయం అంటే చూసి చూడనట్టు వదిలేశాను కానీ నీ మనవడికి నీ ఇంటితో బంధుత్వం ఉంది. చూసి చూసి నీ ఇంటికి నా మనవడిని ఎలా అల్లుడిని చేయమంటావ్.

సారీ శివనారాయణ ఏమి అనుకోకు. ఫ్రెండ్ అయినా సరే పరువు లేని ఇంటి నుంచి వియ్యం అందలేను. నీ మనవరాలికి వేరే ఏదైనా సంబంధం చూసుకోమని చెప్పేస్తాడు. న్యూస్ పేపర్ లో కార్తీక్ వేయించిన యాడ్ ను శివనారాయణ చూస్తాడు. అందులో దీప, కార్తీక్ రిసెప్షన్ ఫోటో ఉంటుంది.

Whats_app_banner