Karthika deepam november 13th episode: నిజం తెలిసి పారిజాతానికి చీవాట్లు పెట్టిన శివనారాయణ- దీప అనసూయకు మాట ఇస్తుందా?
Karthika deepam 2 serial today november 13th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. రిసెప్షన్ లో గొడవ చేస్తున్న జ్యోత్స్నను సరోజిని ఆపుతుంది. తనని నాలుగు తిడుతుంది. పారిజాతం వాళ్ళు కార్తీక్ రిసెప్షన్ కు వెళ్ళినట్టు శివనారాయణకు తెలుస్తుంది.
Karthika deepam 2 serial today november 13th episode: జ్యోత్స్న నోటికొచ్చినట్టు వాగడంతో దీప తన చెంప పగలగొడుతుంది. మొగుడు వదిలేసి వచ్చిన దానివి నీకు నా మనవడు కావాల్సి వచ్చాడా అని పారిజాతం అనేసరికి అక్కడే ఉన్న సరోజిని కోపంగా ఆపండి అని అరుస్తుంది. నీ వెనుక ఎవరు ఉన్నారో నాకు తెలియదు కానీ అన్యాయం అయిన దీప వెనుక మాత్రం ఈ సరోజిని ఉంటుందని చెప్తుంది.
నీకేం అన్యాయం జరిగింది?
తప్పు చేసిన వాళ్ళను వెనకేసుకొస్తున్నారా అని జ్యోత్స్న అడుగుతుంది. ఆపవమ్మా నీ సుప్రభాతం జరిగింది అంతా చూస్తూనే ఉన్నాను. తప్పు జరిగింది మోసం జరిగిందని గింజుకుంటున్నావ్. ఏం తప్పు జరిగింది. మగాడి చేతిలో అన్యాయం అయిన ఆమెను ఆదుకున్నాడు.
నిన్ను చేసుకోవాలని అనుకున్నవాడు తనని చేసుకున్నాడు. ఇష్టపడే చేసుకున్నానని మీ బావ చెప్తున్నాడు కదా ఇందులో నువ్వు మోసపోయింది ఏముంది. నీకేం అన్యాయం జరిగింది. దీపలా ఒంటరిగా మిగిలిపోయిన ఆడదానికి జీవితం ఇచ్చిన మీ బావను మెచ్చుకోవాలి.
కార్తీక్ గొప్పవాడు
ఐదారు సంవత్సరాలు ఉన్న కూతురు ఉందని తెలిసి కూడా పెళ్లి చేసుకున్న కార్తీక్ గొప్పవాడు. అలాగే తన కూతురికి మంచి తండ్రిని ఇచ్చిన దీప ఉత్తమురాలు. మీకు మనసు ఉంటే దీవించండి లేదంటే ఇక్కడ నుంచి వెళ్లిపోండని అంటుంది. చూస్తుంటే మీరు ఆపేలా లేరు మర్యాదగా పోండి అని సున్నితంగా వార్నింగ్ ఇస్తుంది.
మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో అందరికీ క్లారిటీ వచ్చింది. వెళ్లకపోతే అందరూ కలిసి గెంటేయాల్సి వస్తుందని సరోజిని గట్టిగా చెప్తుంది. దీంతో పారిజాతం జ్యోత్స్నను బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతుంది. జ్యోత్స్న అన్న మాటలు పట్టించుకోవద్దు.
ఫ్యామిలీ ఫోటో
దీప నాకు ముందే తెలుసు. కానీ అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తన గురించి మొత్తం తెలుసు. తన పరిస్థితి తెలుసుకుని తనకు సాయం చేయాలని అనుకున్నాను. అంతకుమించి ఏం లేదని కార్తీక్ తల్లికి సంజాయిషీ ఇస్తాడు. నీ మీద నాకు నమ్మకం ఉందని కాంచన సర్ది చెప్తుంది.
దీప నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వేమి తప్పు చేయలేదని సరోజిని దీపకు సర్ది చెప్తుంది. కార్తీక్ ఆదర్శ వివాహానికి అందరూ చప్పట్లతో అభినందలు తెలుపుతారు. తర్వాత అందరూ కలిసి ఫ్యామిలీ ఫోటో దిగుతారు. శివనారాయణ ఇంట్లో ఉన్నాడని పారిజాతం డ్రామాలు ఆడుతూ ఇంటికి వస్తుంది.
పారిజాతానికి చీవాట్లు
ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లారు అని శివనారాయణ గుచ్చి గుచ్చి అడుగుతాడు. మీరు కలిసింది డాక్టర్ కార్తీక్, డాక్టర్ దీపనా లేదంటే డాక్టర్ కాంచననా అని ఫైర్ అవుతాడు. హాస్పిటల్ కి అని అబద్దం చెప్పి మనవరాలిని ఎక్కడికి తీసుకెళ్లావో తెలియదని అనుకున్నావా అని తిడతాడు.
మనవడి మీద మమకారం చావక వెళ్ళిందని తిడుతుంది. నన్ను బలవంతంగా ఏం తీసుకెళ్లలేదని జ్యోత్స్న అంటే శివనారాయణ తిడతాడు. పెళ్లి గురించి మాట్లాడితే ఎవరిని తీసుకొచ్చినా పెళ్లి చేసుకునేది లేదని జ్యోత్స్న తెగేసి చెప్తుంది. బావను కాదని వేరొకరిని పెళ్లి చేసుకోవడం అంటే చావుతో సమానమని అంటుంది.
బాధలో మునిగిపోయిన దీప
మనవరాలి పద్ధతి బాగోలేదని శివనారాయణ అంటాడు. జ్యోత్స్న ఊహల్లో బతుకుతుంది, వాస్తవంలోకి తీసుకురమ్మని సుమిత్రకు చెప్తాడు. దీప నా కూతురిని కొట్టినందుకు బాధగా ఉంది కానీ జ్యోత్స్న చేసిన అవమానానికి దీప ఎంత బాధపడుతుందోనని సుమిత్ర ఆలోచిస్తుంది.
దీప జరిగిన అవమానం తలుచుకుని బాధపడుతుంది. కార్తీక్ తలలో పెట్టిన పువ్వును కోపంగా విసిరికొడుతుంది. అనసూయ వచ్చి బాధపడాల్సిన అవసరం లేదని అంటుంది. నువ్వు జీవితాన్ని నాశనం చేశావు. కానీ నాది కాదు కార్తీక్ బాబుది. శౌర్యను తీసుకెళ్లబోతుంటే కార్తీక్ బాబు నా మెడలో తాళి కట్టారు.
నలుగురిలో పరువు పోయింది
కట్టకపోయి ఉంటే నేను దీపగానే ఉండిపోయే దాన్ని. సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టించారు అయిన వాళ్ళు అవమానించారు. ఇప్పుడు రిసెప్షన్ పెట్టించారు నాలుగు గోడల మధ్య కాదు నలుగురిలో పరువు పోయింది. నా కారణంగా అందరికీ సంజాయిషీ చెప్పుకోవాలి.
ఆరోజు నేను పోతాను అన్నప్పుడు మీరు ఆపకుండా ఉంటే ఈరోజు కార్తీక్ బాబుకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సుమిత్రమ్మ కూతురిని నేను కొట్టాల్సి వచ్చేది కాదని బాధపడుతుంది. మరి ఎందుకు కొట్టావని అనసూయ అడుగుతుంది. కార్తీక్ బాబును అంటుంటే చూస్తూ ఊరుకోమంటావా?అంటుంది.
అవమానం జరిగితే నీకెందుకు
అతన్ని భర్తగా అనుకొనప్పుడు ఎవరు తిడితే నీకు ఎందుకు? నలుగురిలో అవమానం జరుగుతుంటే నువ్వు ఎలా ఊరుకోలేకపోయావో అతను అలాగే శౌర్య కోసం చేశాడు. అతని సొంత మరదలు ఒక మాట అంటే మధ్యలో నీకేంటి అని అడుగుతుంది.
అలా అనొద్దు శౌర్య కోసం అంటూ నన్ను ఇంటి గడప దాటకుండా చేశారు. ఆయన పక్కన నేను నిలబడితే నా విలువ ఆకాశానికి పెరిగితే ఆయన విలువ మాత్రం పాతాళానికి పడిపోతుంది. ఆదర్శ పురుషుడు అని ఒకరు మెచ్చుకున్నా ఈ మచ్చ జీవితాంతం ఉంటుందని అంటుంది.
రుణం తీర్చుకో
నీదంతా ప్రేమ కాదు నాటకం అని అనసూయ కోపంగా అంటుంది. అందరూ అనే మాటల కంటే నీ చేతలకు కార్తీక్ బాబు ఎక్కువ బాధపడుతున్నాడు. నీ మెడలో మూడు ముళ్ళు వేసిన మనిషి కోసం ఏమైనా ఆలోచిస్తున్నావా? నీకు ఏం అన్యాయం జరిగిందని ఇంత బాధపడుతున్నావ్.
నిన్ను, నీ బిడ్డను కాపాడిన మనిషి రుణం తీర్చుకోవా? నీ మీద జాలితో కేవలం శౌర్య కోసం తాళి కట్టలేదు. తన పక్కన భార్యగా నిలబడే అర్హత ఉందని తాళి కట్టాడు. నువ్వు నీ కూతురికి తండ్రిగా ఉండాలని అనుకుంటున్నావ్. కానీ అతడు నిన్ను భార్యగా దగ్గరకు తీసుకోవాలని అనుకుంటున్నాడు.
భార్యగా ఉంటానని మాట ఇవ్వు
మీ అమ్మ మీ నాన్నతో ఉన్నట్టు నువ్వు కార్తీక్ బాబుతో ఉండాలని అనసూయ హితబోధ చేస్తుంది. నువ్వు మారాలి లేదంటే నీకు భవిష్యత్ దూరం అవుతుంది. నువ్వు మారి కార్తీక్ బాబుతో భార్యగా నడుచుకుంటానని మాట ఇవ్వమని అనసూయ దీపను అడుగుతుంది.
ఎలా ఉన్నా భార్యనే కదా అంటుంది. పెళ్ళాం మొగుడితో ఎలా ఉండాలో ఉంటున్నావా అని నిలదీస్తుంది. అన్నీ మర్చిపోయి భార్యగా ఉంటావా లేదా అంటే తనని ఇబ్బంది పెట్టొద్దని అంటుంది. సరే నీకు నచ్చినట్టే నువ్వు ఉండు నా దారి నేను చూసుకుంటానని అనసూయ అనేస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్