Karthika deepam november 15th episode: కార్తీక్ ఇంట్లో పారిజాతం, గెంటేయమన్న కాంచన- జ్యోత్స్న డీల్ కి ఒకే చెప్పిన దీప
Karthika deepam 2 serial today november 15th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 15వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. పారిజాతం కార్తీక్ ఇంటికి వచ్చి రచ్చ చేస్తుంది. కాంచన, దీప గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దీంతో కార్తీక్ పారుకు గట్టిగా బుద్ధి చెప్తాడు.
Karthika deepam 2 serial today november 15th episode: దీప మంచం మీద కాకుండా కింద పడుకుందని శౌర్య కాంచన వాళ్ళకు చెప్తుంది. అప్పుడే దీప వస్తుంది. చాప ఇవ్వమని అనసూయ కావాలని అడుగుతుంది. దీంతో దీప శౌర్య వైపు కోపంగా చూస్తుంది. పారిజాతం కాంచన ఇంటికి వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతుంది.
అవకాశవాదిగా మారిపోయావా?
నిన్న రిసెప్షన్ లో చేసింది చాలు ఇప్పుడు ఎవరినైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదని కాంచన తిడుతుంది. పారిజాతం వెటకారంగా మాట్లాడుతుంది. నా మనవరాలు ఇంటి కోడలిగా ఉండాల్సిన ఇంట్లో నువ్వు నీ కూతురు ఉంటున్నారని నోరు పారేసుకుంటుంది.
తన కోడలిని ఏమి అనొద్దని కాంచన అంటుంది. రెండో పెళ్లి దాన్ని కోడలు అనడానికి సిగ్గు లేదా? నీ మేనకోడలిని ఈ వంట మనిషి కొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావ్. నీ కుటుంబానికి నీ కొడుక్కి మీ అన్నయ్య ఎంత సహాయంగా ఉన్నాడు. అది మర్చిపోయావా నువ్వు అవకాశవాదిగా ఉండిపోయావా?
కార్తీక్ వార్నింగ్
ఈ పెళ్లి ఒక దరిద్రం అనుకుంటే దీన్ని నలుగురికి పరిచయం చేయాలని అనుకోవడం ఇంకొక దరిద్రం. నీకు కాళ్ళతో పాటు బుర్ర కూడా పని చేయడం మానేసినట్టు ఉందని అనేసరికి కార్తీక్ కోపంగా పారు అని అరుస్తాడు. ఇంకొక్క మాట మా అమ్మ గురించి తప్పుగా వస్తే ఊరుకొనని అంటాడు.
ఏడేళ్ళ కొడుకు ఉన్న నీ మెడలో తాతయ్య తాళి కట్టినప్పుడు ఆరేళ్ళ కూతురు ఉన్న దీప మెడలో నేను తాళి కట్టడం తప్పు ఎలా అవుతుంది. నీకు రెండో జీవితం ఉన్నట్టు దీపకు ఉండకూడదా? నీకు జరిగింది మరొక ఆడదానికి జరిగితే ఎందుకు ఊరుకోలేకపోతున్నావని నిలదీస్తాడు.
దీపను నమ్మి మోసపోతున్నారు
మీ తాత నాకు దొంగచాటుగా తాళి కట్టలేదు. నా మెడలో తాళి చట్టబద్ధంగా పడింది. మరి దీప మెడలో తాళి ఎలా పడింది. ఇది నా పెళ్ళాం, నా కూతురు అని నువ్వు చెప్పుకుంటే సరిపోదు. జనాలు చెప్పాలి. నువ్వు ఆదర్శ పురుషుడు అవుతావని ఫీలవుతున్నావ్ ఏమో అది అందరూ అనుకోరు.
ఏ గుర్తింపు ఏ గౌరవం లేని పెళ్ళిని ఎవరు మెచ్చుకుంటారు. దీపను నమ్మి నువ్వు మీ అమ్మ మోసపోతున్నారు. ఏదో ఒక రోజు దాని అసలు రంగు బయటపడుతుందని పారిజాతం అంటుంది. దీంతో కాంచన ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని కోపంగా చెప్తుంది.
పిన్నిని గెంటేయ్
ఇన్ని గొడవలు జరుగుతున్నా ఈ మనిషి పట్టనట్టు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదని పారిజాతం దీప గురించి నీచంగా మాట్లాడుతుంది. అనసూయ పిన్నిని బయటకు గెంటేయ్ అని కాంచన అంటుంది. పోయి నీ మనవరాలికి చెప్పు కార్తీక్, దీప భార్యాభర్తలు బతికినంత కాలం కలిసే బతుకుతారు అని అంటాడు.
దీప ఒకసారి తన మాట వినమని అడిగితే నువ్వు నా మాట వింటున్నావా అని కార్తీక్ అడుగుతాడు. పారు వచ్చి ఏదో అన్నదని అదే ఆలోచిస్తూ కూర్చోవద్దు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసని దీపకు సర్ది చెప్తాడు. కట్ చేస్తే దీప జ్యోత్స్నను కలుస్తుంది.
దీపకు బ్లాంక్ చెక్
జ్యోత్స్న తిక్క తిక్కగా మాట్లాడుతుంది. ఇలా తింగరిగా మాట్లాడే నా చేతులో తన్నులు తింటున్నావని దీప కౌంటర్ ఇస్తుంది. నా మెడలో కట్టుకోవడానికి ఒక తాళి కావాలి. అది నాకు నీ మెడలో తాళి కావాలి. ఎంతకిస్తావ్ ఫ్రీగా వద్దు అని బ్లాంక్ చెక్ ఇస్తుంది.
ఇందులో నీకు నచ్చిన అమౌంట్ రాసుకో. నీలాంటి వాళ్ళు మా బావను డబ్బు కోసమే ట్రాప్ చేస్తారు. నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను. నీ మెడలో తాళి నాకు ఇచ్చేయ్. నువ్వు పెళ్లి చేసుకుంది మా బావను ఇష్టపడలేదు కాబట్టి నువ్వు వెళ్లిపో. శౌర్యను నాకు ఇచ్చేయి తల్లిగా నేను చూసుకుంటాను.
డబ్బు తీసుకుని ఎక్కడికి పోతావో పో మళ్ళీ జీవితంలో కనిపించకూడదని అంటుంది. డీల్ ఒకే కదా అంటే ఒకే అని దీప అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీ అని తెగ సంతోషపడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్