Karthika deepam november 18th episode: దీపను తన రెస్టారెంట్ కు తీసుకెళ్లిన కార్తీక్- పేపర్ లో ఫోటో చూసి మురిసిన కాంచన-karthika deepam 2 serial today november 18th episode karthik suggest deepa teach his restaurant chef her special dish ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam November 18th Episode: దీపను తన రెస్టారెంట్ కు తీసుకెళ్లిన కార్తీక్- పేపర్ లో ఫోటో చూసి మురిసిన కాంచన

Karthika deepam november 18th episode: దీపను తన రెస్టారెంట్ కు తీసుకెళ్లిన కార్తీక్- పేపర్ లో ఫోటో చూసి మురిసిన కాంచన

Gunti Soundarya HT Telugu
Nov 18, 2024 07:10 AM IST

Karthika deepam 2 serial today november 18th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 18వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీపను తీసుకుని కార్తీక్ తన రెస్టారెంట్ కు వెళతాడు. అక్కడ దీప చేసే స్పెషల్ వంటకం చేయించాలని ఫిక్స్ అవుతాడు. అటు జ్యోత్స్న కార్తీక్ తో గొడవ పడేందుకు రెస్టారెంట్ కు బయల్దేరుతుంది.

కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 18 ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 18 ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today november 18th episode: కార్తీక్ పేపర్ లో వేయించిన ప్రకటన చూసి శివనారాయణ ఆగ్రహిస్తాడు. ఫోటో కింద అందరి పేర్లు వేయించాడని చెప్తాడు. జ్యోత్స్న రెస్టారెంట్ సీఈవో అని ఎందుకు రాయాలి. పరువే ముఖ్యంగా బతికే నాకు మీ ఇంటి నుంచి సంబంధం తెచ్చుకోలేను మీ మనవరాలికి వేరే సంబంధం చూసుకోమని తన ఫ్రెండ్ చెప్పాడని రగిలిపోతాడు.

రగిలిపోయిన జ్యోత్స్న

ఫోటో చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. ఇది నా అహం మీద దెబ్బకొట్టడానికి దీప చేయించిన పని ఇదనీ జ్యోత్స్న అనుకుంటుంది. ఈ విషయం గురించి ముందు బావతో మాట్లాడాలని అనుకుంటుంది. మీ పెళ్లి గురించి ఎవరికీ తెలియదని నేనేదో సరదాగా అంటే నా సరదా తీర్చేశావ్ కదరా అని పారిజాతం భయపడుతుంది.

కార్తీక్ న్యూస్ పేపర్ పట్టుకుని దీప దగ్గరకు వస్తాడు. అందులో ఉన్న ఫోటో చూపించడానికి కార్తీక్ ఇబ్బంది పడతాడు. చూపించలేక వెనక్కి వచ్చేస్తాడు. కనీసం పేపర్ లో వేయించిన ఫోటో తల్లికి చూపించాలని అనుకుంటే కాంచన కూడా ఇంట్రెస్ట్ చూపించదు.

మురిసిన కాంచన

ఫోటో వేయించిన సంగతి ఎవరూ గుర్తించడం లేదని తెగ బాధపడిపోతాడు. అప్పుడే స్వప్న, కాశీ ఇంటికి వస్తాడు. మార్నింగ్ భలే సర్ ప్రైజ్ ఇచ్చావని స్వప్న అన్నని మెచ్చుకుంటుంది. కాసేపు కాశీ వాళ్ళు హడావుడి చేసి పేపర్ లో కార్తీక్ వేయించిన ఫోటో చూపిస్తాడు.

అది చూసి కాంచన వాళ్ళు సంతోషపడతారు. దీప మాత్రం కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది. ఈపాటికి మా నానమ్మ ఫోటో చూపించి గుండె పట్టుకుని ఉంటుందని కాశీ కౌంటర్ వేస్తాడు. పేపర్ లో ఎందుకు వేయించారని అంటే పెళ్లి గురించి అందరికీ తెలియాలి కదా అందుకే వేయించానని చెప్తాడు.

కొడుకుని సపోర్ట్ చేసిన కాంచన

దీని వల్ల మళ్ళీ గొడవలు జరుగుతాయని దీప భయపడుతుంది. ఎవరో ఏదో అనుకుంటారని ఎందుకు భయపడాలి పెద్ద మనసు ఉన్న ఆశీర్వదిస్తారు. చిన్న మనసు ఉన్న వాళ్ళు తిట్టుకుంటారని కార్తీక్ అంటాడు. ఇక నుంచి దీపను తీసుకుని బయటకు వెళ్తే ఆమె ఎవరు అని ఎవరూ అడగరని కాంచన కూడా సపోర్ట్ చేస్తుంది.

జరిగింది మంచి పని అయినప్పుడు పది మందితో పంచుకోవడంలో తప్పు లేదని స్వప్న అంటుంది. ఫోటోను తన ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తానని శౌర్య ముచ్చటపడుతుంది. కార్తీక్ రెస్టారెంట్ కు వెళ్తున్నానని అంటే శౌర్య తాను కూడా వస్తానని అంటుంది.

కార్తీక్ తో రెస్టారెంట్ కు దీప

దీపను కూడా రమ్మని శౌర్య ఒత్తిడి చేస్తుంది. పెళ్లి అయిన తర్వాత ఎక్కడికీ వెళ్లలేదు కదా వెళ్ళమని కాంచన కూడా చెప్తుంది. అక్కడకి వెళ్తే జ్యోత్స్న ఎక్కడ గొడవ చేస్తుందోనని దీప భయపడుతుంది. కానీ శౌర్యతో పాటు అందరూ బలవంతం చేయడంతో ఒప్పుకుంటుంది.

దీపను తీసుకుని కార్తీక్ రెస్టారెంట్ కు వస్తాడు. దీప స్పెషల్ వంటకాలు అందరికీ రుచి చూపించాలని అనుకుంటాడు. రెస్టారెంట్ లో మెన్యూ కింద దీప వంటకం ఉప్మా బిర్యానీ పెట్టిస్తాడు. రెస్టారెంట్ కు వచ్చిన వాళ్ళు ఉప్మా బిర్యానీ ఆర్డర్ పెడతారు. దీంతో దీపను తీసుకుని కిచెన్ లోకి వెళతాడు.

ఉప్మా బిర్యానీ ఎలా చేయాలో రెస్టారెంట్ లో ఉన్న చెఫ్ కు నేర్పించమని చెప్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner