Kalki 2898 AD: కల్కి షూటింగ్ ఇప్పుడు ఫినిష్ అయిందట.. ట్రైలర్ ఎప్పుడు రావొచ్చంటే!-kalki 2898 ad movie reportedly completed shooting and trailer may release in june first week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad: కల్కి షూటింగ్ ఇప్పుడు ఫినిష్ అయిందట.. ట్రైలర్ ఎప్పుడు రావొచ్చంటే!

Kalki 2898 AD: కల్కి షూటింగ్ ఇప్పుడు ఫినిష్ అయిందట.. ట్రైలర్ ఎప్పుడు రావొచ్చంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
May 26, 2024 07:00 PM IST

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి పని చేసిన కొందరు ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Kalki 2898 AD: కల్కి షూటింగ్ ఇప్పుడు ఫినిష్ అయిందట.. ట్రైలర్ ఎప్పుడు రావొచ్చంటే!
Kalki 2898 AD: కల్కి షూటింగ్ ఇప్పుడు ఫినిష్ అయిందట.. ట్రైలర్ ఎప్పుడు రావొచ్చంటే!

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా కోసం సినీ ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురుచూస్తోంది. భారీ బడ్జెట్‍తో గ్రాండ్ లెవెల్ గ్రాఫిక్స్‌తో పురాణాల ఆధారంగా రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ గ్లోబల్ రేంజ్ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27వ తేదీన కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కానుంది. బుజ్జి అనే ఫ్యూచరస్టిక్ కారును పరిచయం చేసేందుకు నిర్వహించిన ఈవెంట్‍తో ప్రమోషన్లను కల్కి టీమ్ మొదలుపెట్టేసింది. అయితే, ఈ మూవీ షూటింగ్ పూర్తిగా ఇప్పుడు ముగిసిందని తెలుస్తోంది.

గుమ్మడికాయ కొట్టేశారు!

కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్ కాస్త మిగిలే ఉందంటూ కొంతకాలంగా వినిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఎప్పుడూ పూర్తిగా అయిపోతుందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఎట్టకేలకు ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయిందని సమాచారం బయటికి వచ్చింది. కల్కి షూటింగ్ శనివారం రాత్రి పూర్తయిందని, గుమ్మడికాయ కొట్టేశారంటూ ఈ మూవీకి పని చేసిన కొందరు సిబ్బంది సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేశారు.

షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఈ మూవీ కోసం చేసిన వారికి మేకర్స్ బహుమతులు ఇచ్చారు. శ్రీకృష్ణుడి వెండి విగ్రహం, రేపటి కోసం అని కల్కి మూవీ డైలాగ్‍ ఉండే ఓ నాణేన్ని అందించారు. అలాగే, ఈ మూవీ కోసం మూడేళ్లుగా పని చేసినందుకు ధన్యవాదాలు అంటూ ఓ నోట్ కూడా ఇచ్చారు. ఈ ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

కల్కి 2898 ఏడీ మూవీ ప్రధాన భాగం షూటింగ్ మార్చిలో పూర్తయిందని సమాచారం బయటికి వచ్చింది. అయితే, ఇంకా కాస్త ప్యాచ్ వర్క్ చిత్రీకరణ చేయాల్సి ఉందని తెలిసింది. ఇప్పుడు, ఆ పనులు కూడా అయిపోయి.. షూటింగ్ పూర్తిగా ఫినిష్ అయింది.

ట్రైలర్ అప్పుడేనా?

కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కానుండటంతో ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. జూన్ తొలి వారంలోనే ట్రైలర్ రిలీజ్ చేసేలా టీమ్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ పనులు కూడా జోరుగా జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ట్రైలర్ జూన్ ఫస్ట్ వీక్‍లోనే వస్తుందేమో చూడాలి. ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్ అన్నీ అద్భుతంగా సాగాయి. ముఖ్యంగా విజువల్స్ ఆశ్చర్యపరిచాయి.

బుజ్జికి విపరీతమైన క్రేజ్

కల్కి 2898 ఏడీ సినిమా నుంచి ఇటీవల బుజ్జి అనే స్పెషల్ కారును మూవీ టీమ్ పరిచయం చేసింది. ఇప్పుడు, ఈ ఫ్యుచరస్టిక్ కారుకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆరు టన్నుల బరువు, మూడు భారీ టైర్లతో ఈ కారు అదిరిపోయే డిజైన్‍తో ఉంది. ఈ మూవీ కోసమే ప్రత్యేకంగా రెండేళ్ల పాటు కష్టపడి ఈ బుజ్జికారును తయారు చేశారు. ఈ చిత్రంలో భైరవ (ప్రభాస్) వాహనంగా ఇది ఉండనుంది. బుజ్జితో భైరవ అంటూ వచ్చిన గ్లింప్స్ వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. అద్బుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంది.

కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్, దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‍‍తో వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ మూవీకి సంతోశ్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024