Prabhas on his marriage: వాళ్లను బాధపెట్టకూడదనే నేను పెళ్లి చేసుకోలేదు: ప్రభాస్ కామెంట్స్ వైరల్
Prabhas on his marriage: కల్కి 2898 ఏడీ స్పెషల్ ఈవెంట్లో ప్రభాస్ తన పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇన్నేళ్లుగా తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటో ఈ సందర్భంగా అతడు వెల్లడించాడు.
Prabhas on his marriage: ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? గతేడాది నుంచి ఇక అతడు పెళ్లి పీటలెక్కడం ఖాయమన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే అతడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ స్పెషల్ పర్సన్ వస్తున్నారన్న పోస్ట్ చూసి కూడా ఫ్యాన్స్ పెళ్లి గురించే అనుకున్నారు. కానీ అది కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషన్ అని తెలిసి ఉసూరుమన్నారు. కానీ ఇప్పుడు ప్రభాసే తన పెళ్లి గురించి చెప్పాడు.
ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..
కల్కి 2898 ఏడీ మూవీ స్పెషల్ ఈవెంట్ బుధవారం (మే 22) రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన విషయం తెలిసిందే. ఇందులో బుజ్జి అనే స్పెషల్ వెహికిల్ ను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ ను యాంకర్ సుమ ఆట పట్టించింది. మొన్నెప్పుడో స్పెషల్ వ్యక్తి వస్తుందని అనగానే.. ఎంత మంది అమ్మాయిల గుండెలు పగిలిపోయాయో తెలుసా అని సుమ అన్నది.
దీనికి ప్రభాస్ వెంటనే స్పందిస్తూ.. ఆ అమ్మాయిల కోసమే పెళ్లి చేసుకోలేదు అని అనడం విశేషం. "ప్రస్తుతం మా డైరెక్టర్ ఐడియాలు ఇవన్నీ. ఇక్కడికి హాయ్ డార్లింగ్స్ అని చెప్పి వెళ్దాం అని వస్తే మా డైరెక్టర్ ఏవేవో పనులు చేయిస్తున్నాడు. మూడేళ్ల పాటు నాకు ఈ బుజ్జిని తగిలించాడు" అని ప్రభాస్ సరదాగా అన్నాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ నవ్వుతూ కనిపించాడు.
వాళ్లతో నటించడం నా అదృష్టం
ఇక ఈ సినిమాలో పెద్ద పెద్ద నటులతో కలిసి నటించడంపై కూడా ప్రభాస్ స్పందించాడు. "అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులతో నటించడం గొప్ప అవకాశం. నేను కమల్ సర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. కమల్ తన సినిమాల్లో వేసుకునే బట్టను నాకు కొనివ్వమని నేను మా పేరెంట్స్ ను అడిగేవాడిని" అని ప్రభాస్ చెప్పడం గమనార్హం.
కల్కి 2898 ఏడీ సినిమాలో బుజ్జీ అనే ప్రత్యేక వాహనం గురించి కొంతకాలంగా హైప్ నెలకొని ఉంది. ఈ వెహికల్‍ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ భారీ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ ఈవెంట్‍లో బుజ్జీతో ప్రభాస్ ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. భైరవ గెటప్‍లోనే ఈ ఈవెంట్‍లో ప్రభాస్ కనిపించారు. డార్లింగ్ లుక్స్ స్టన్నింగ్‍గా ఉన్నాయి. కల్కి టీమ్ చేసిన తొలి ప్రమోషనల్ ఈవెంట్ ఇదే. కాగా, భైరవ, బుజ్జీ వీడియోను రిలీజ్ చేయగా.. ఇది అద్భుతమైన విజువల్స్‌తో అబ్బురపరిచేలా ఉంది.
కల్కి 2898 ఏడీ టీమ్ రిలీజ్ చేసిన భైరవ, బుజ్జీ వీడియోలో విజువల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ప్రతీ ఫ్రేమ్ స్టన్నింగ్‍గా ఉంది. ఈ చిత్రం విజువల్ వండర్‌లా ఉంటుందని మరోసారి భారీ నమ్మకాన్ని ఇచ్చేసింది. భారీ హాలీవుడ్ మూవీ రేంజ్‍లో ఔట్‍పుట్‍ను దర్శకుడు నాగ్అశ్విన్ సాధించారు. స్టొజిల్‍జోవిక్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా టాప్ నాచ్‍గా ఉంది.