Kajal Agarwal: అవి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి.. అలా పిలిచినా సంతోషిస్తాను: కాజల్ అగర్వాల్-kajal agarwal about society incidents and satyabhama movie says they disturbing me tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kajal Agarwal: అవి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి.. అలా పిలిచినా సంతోషిస్తాను: కాజల్ అగర్వాల్

Kajal Agarwal: అవి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి.. అలా పిలిచినా సంతోషిస్తాను: కాజల్ అగర్వాల్

Sanjiv Kumar HT Telugu
Jun 06, 2024 08:35 AM IST

Kajal Agarwal About Society Incidents Satyabhama Interview: కాజల్ అగర్వాల్ నటిస్తున్న లేడి ఒరియెంటెడ్ సినిమా సత్యభామ. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యభామ మూవీకి సంబంధించి ఆసక్తికర విశేషాలు తెలిపింది.

అవి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి.. అలా పిలిచినా సంతోషిస్తాను: కాజల్ అగర్వాల్
అవి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి.. అలా పిలిచినా సంతోషిస్తాను: కాజల్ అగర్వాల్

Kajal Aggarwal About Satyabhama Movie: రెండు దశాబ్దాల కెరీర్‌లో స్టార్ హీరోలకు జంటగా ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసింది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. సౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీలోనూ నటించి పేరు తెచ్చుకుంది. 60 సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్‌తో నటించి 'క్వీన్ ఆఫ్ మాసెస్'గా ప్రేక్షకుల అభిమానం పొందిన కాజల్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌ను సూపర్బ్‌గా మొదలుపెట్టింది.

కాజల్ అగర్వాల్ నటిస్తున్న లేడి ఒరియెంటెడ్ మూవీ సత్యభామ. ఇందులో కాజల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కనిపించనుంది. సత్యభామ మూవీ జూన్ 7న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.

"సత్యభామ మూవీ నా పర్సనల్ లైఫ్‌తోనూ రిలేట్ చేసుకోవచ్చు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్‌లా.. నిజ జీవితంలో నేనూ సమాజంలో ఏదైనా జరిగితే స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయకున్నా.. ఆ ఘటన గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. డిస్ట్రబ్ చేస్తూనే ఉంటాయి. అందరిలాగే సొసైటీలో జరిగేవాటి గురించి నాకూ కొన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి" అని కాజల్ అగర్వాల్ తెలిపింది.

"నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ సత్యభామ సినిమా లాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేశాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కానీ కొన్ని ఎమోషన్స్ అనుభూతిచెందాను. అవన్నీ మీకూ రియలిస్టిక్‌గా అనిపిస్తాయి" అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.

"నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇన్‌స్టంట్‌గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరి" అని కాజల్ అగర్వాల్ అన్నారు.

"శశికిరణ్ మంచి డైరెక్టర్. ఆయన సినిమాలు చూశాను. ఈ సినిమాకు డైరెక్షన్ ఎందుకు చేయడం లేదని శశిని అడిగాను. ఆయన తను ఈ మూవీకి స్క్రీన్ ప్లే ఇస్తూ ప్రజెంటర్‌గా ఉంటున్నానని చెప్పారు. మనం ఎప్పుడూ ఒకే పనిచేయనక్కర్లేదు. డిఫరెంట్ జాబ్స్ ఎక్స్‌ప్లోర్ చేయాలి. శశి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించా. ఆయన ఈ ప్రాజెక్ట్‌ను అన్ని విధాలా బాగా వచ్చేలా చూసుకున్నారు" అని కాజల్ పేర్కొంది.

"దర్శకుడు సుమన్ చిక్కాల ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేస్తున్నా.. ఎంతో కన్విక్షన్‌తో వర్క్ చేశారు. ఆయనకు చాలా క్లారిటీ ఉంది. తను అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నట్లు రూపొందించాడు. సుమన్ చిక్కాలతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. 

మా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్లైనా తమ ఫస్ట్ మూవీని ఓ బేబిని చూసుకున్నట్లు చూసుకున్నారు. ప్రతి రోజూ సెట్‌లో ఉంటూ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. తొలి సినిమాను ఎంతో జాగ్రత్తగా ప్రొడ్యూస్ చేశారు. ఈ టీమ్‌తో నాకు మంచి వర్కింగ్ ఎక్సీపిరియన్స్ దక్కింది. అందుకే అవురమ్ ఆర్ట్స్ నా సొంత బ్యానర్ అని చెప్పా" అని కాజల్ తెలిపింది.

Whats_app_banner