Kajal: పవర్‌ఫుల్ పోలీస్‍ ఆఫీసర్ ‘సత్యభామ’గా కాజల్.. అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్-kajal aggarwal as powerful police officer satyabhama movie title glimpse out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kajal: పవర్‌ఫుల్ పోలీస్‍ ఆఫీసర్ ‘సత్యభామ’గా కాజల్.. అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్

Kajal: పవర్‌ఫుల్ పోలీస్‍ ఆఫీసర్ ‘సత్యభామ’గా కాజల్.. అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 18, 2023 11:42 PM IST

Kajal Aggarwal: సత్యభామ మూవీలో కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేస్తోంది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ నేడు విడుదలైంది.

కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్

Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరో సినిమా చేస్తోంది. ఈసారి తన గత చిత్రాలకు విభిన్నంగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. ‘సత్యభామ’ అనే టైటిల్‍తో ఈ సినిమా వస్తోంది. పోలీస్ ఆఫీసర్ సత్యభామగా అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. గ్లింప్స్ ప్రకారం చూస్తే ఈ మూవీలో కాజల్ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. తాను ఇంతకు ముందెప్పుడూ పోషించనంత పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌లో కాజల్ కనిపిస్తోంది. రేపు (జూన్ 19) కాజల్ పుట్టిన రోజు సందర్భంగా నేడు (జూన్ 18) ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వివరాలివే.

సత్యభామ మూవీకి అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తున్నాడు. గూఢచారి, మేజర్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు డైరెక్షన్ చేసిన శశికిరణ్ తిక్కా.. ఈ చిత్రానికి స్క్రీన్‍ప్లే అందించడంతో పాటు సమర్పకుడిగా ఉండడం ఆసక్తికరంగా ఉంది. అవురమ్ బ్యానర్‌పై బాబీ తిక్క ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. కాగా, సత్యభామ టైటిల్ గ్లింప్స్ చాలా ఇంటెన్స్‌గా సాగింది.

పోలీస్ స్టేషన్‍లోని ఓ నిందితుడు నిజం చెప్పేందుకు మొండికేస్తున్న సమయంలో ఏసీపీ సత్యభామగా కాజల్ ఎంట్రీ ఇస్తుంది. ఆ ఖైదీని చేత్తోనే తీవ్రంగా చితకబాది నిజం చెప్తాననేలా చేస్తుంది. నిందితుడిని కొట్టే సమయంలో కాజల్ చేతికి ఉండే గాజులు పగిలి రక్తం వస్తుంది. కాజల్ సంతకం పెట్టిన పేపర్‌పై రక్తపు చుక్కలు పడతాయి. గాజులు తీసి కొట్టాల్సింది మేడమ్ అని ఓ మహిళా కానిస్టేబుల్ అంటే.. “లేకుండా కొట్టాడుగా.. చెప్పాడా” అని ఎస్‍ఐను ఉద్దేశించి డైలాగ్ చెప్పింది కాజల్. ఇలా ఇంటెన్స్‌గా సాగింది సత్యభామ టైటిల్ గ్లింప్స్. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.

కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు కాజల్ అగర్వాల్ సినిమాలకు కొంతకాలం గుడ్‍బై చెబుతుందని ఇటీవల వార్తలు బయటికి వచ్చాయి. కాజల్ కూడా అలానే సంకేతాలు ఇస్తూ ఓ ట్వీట్ చేసింది. అయితే, కొత్తగా ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది.

IPL_Entry_Point