NTR - Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాతో ఎన్టీఆర్.. ఎందుకు కలిశారంటే..-jr ntr doing interview with sandeep reddy vanga for devara movie promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr - Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాతో ఎన్టీఆర్.. ఎందుకు కలిశారంటే..

NTR - Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాతో ఎన్టీఆర్.. ఎందుకు కలిశారంటే..

NTR - Sandeep Reddy Vanga: ముంబైలో జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలిశారు. అయితే, వీరిద్దరూ ఎందుకు మీట్ అయ్యారనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వీరిద్దరి కలయికకు కారణమేంటో సమాచారం బయటికి వచ్చింది.

NTR - Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాతో ఎన్టీఆర్.. ఎందుకు కలిశారంటే..

తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు బాలీవుడ్‍లో ఫుల్ క్రేజ్ ఉంది. గతేడాది రణ్‍బీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమాతో భారీ బ్లాక్‍బస్టర్ కొట్టారు సందీప్. ఈ చిత్రంపై కొన్ని వివాదాలు తలెత్తినా.. కమర్షియల్‍గా మాత్రం దుమ్మురేసింది. సందీప్ వంగా పేరు నేషనల్ వైడ్‍గా మరోసారి మార్మోగింది. తదుపరి ప్రభాస్‍తో స్పిరిట్ మూవీని ఆయన చేయనున్నారు. కాగా, తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియన్ ఎన్టీఆర్.. సందీప్ రెడ్డి వంగాను కలిశారు.

సందీప్‍తో ఎన్టీఆర్

దేవర ప్రమోషన్ల కోసం ముంబై వెళ్లారు ఎన్టీఆర్. రేపు (సెప్టెంబర్ 10) అక్కడే దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. కొరాటల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరపై ఫుల్ హైప్ ఉంది. సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ముంబైలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను ఎన్టీఆర్ కలిశారు. ఈ ఇద్దరు కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు ఎందుకు కలిశారన్న సస్పెన్స్ పెరిగిపోయింది. అయితే, వీరిద్దరు ఎందుకు మీట్ అయ్యారో స్పష్టత వచ్చింది.

ఇంటర్వ్యూ కోసం..

దేవర సినిమా కోసం ఓ ఇంటర్వ్యూ చేసేందుకే ఎన్టీఆర్, సందీప్ రెడ్డి కలిసారని తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూ షూటింగ్ కూడా జరిగిందట. ఈ ఇంటర్వ్వూతో హిందీలో దేవరపై క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగా మధ్య మాటలు ఎలా సాగాయోననే క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఏ విషయాన్నైనా సందీప్ కుండబద్దలు కొట్టినట్టు నేరుగా చెబుతారు. తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వెల్లడిస్తారు. మరోవైపు ఎన్టీఆర్ చాలా సరదాగా మాట్లాడతారు. వీరిద్దరి మధ్య ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందోననే ఆసక్తి ఎక్కువగా ఉంది. మరి ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుందో చూడాలి.

దేవర సినిమా ట్రైలర్ రేపు (సెప్టెంబర్ 10) సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ కానుంది. ముంబైలో లాంచ్ ఈవెంట్ జరగనుంది. అక్కడి మీడియాతో ఎన్టీఆర్ మాట్లాడనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‍లో ఎన్టీఆర్‌కు ఫుల్ పాపులారిటీ వచ్చింది. దీంతో దేవర హిందీ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ మూవీకి చాలా క్రేజ్ ఉంది.

ట్రైలర్ రన్‍టైమ్ ఇదే!

దేవర ట్రైలర్ రన్‍టైమ్ వివరాలు బయటికి వచ్చాయి. ఈ ట్రైలర్ 2 నిమిషాల 50 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. ఎక్కువగా ఈ ట్రైలర్‌లో యాక్షన్ ఉంటుందని టాక్. మూవీ టీమ్ కూడా యాక్షన్ ఫీస్ట్‌కు రెడీ ఉండండి అంటూ హైప్ పెంచేసింది.

దేవర చిత్రంతోనే తెలుగులోకి అడుగుపెడుతున్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో హైవోల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ మూవీలో డ్యుయల్ రోల్ చేశారు ఎన్టీఆర్. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన మూడు పాటలు చార్ట్ బస్టర్లు అయ్యాయి. సెప్టెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దేవర విడుదల కానుంది.