Devara Collections: గ్లోబల్ రేంజ్‍లో దేవర కలెక్షన్ల హవా.. రెండో ప్లేస్‍లో.. కానీ!
Devara Box office Collections: దేవర సినిమా రీసౌడింగ్ ఓపెనింగ్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు దుమ్మురేపింది. ఆ తర్వాత వసూళ్లు డ్రాప్ అయినా.. మంచి నంబర్లే వచ్చాయి. దీంతో ఈ వారం కలెక్షన్లలో గ్లోబల్ రేంజ్‍లో రెండో స్థానంలో నిలిచింది దేవర.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం సముద్రమంత అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ హైప్ మధ్య సెప్టెంబర్ 27న రిలీజైన ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్ దక్కింది. ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దేవర సత్తాచాటింది.
వరల్డ్ వైడ్ రెండో స్థానంలో..
ఈ వీకెండ్‍లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన జాబితాలో దేవర సినిమా రెండో స్థానంలో నిలిచింది. ట్రాన్స్‌ఫార్మర్స్ వన్ చిత్రాన్ని కూడా దాటేసింది. గ్లోబల్ రేంజ్‍లో దుమ్మురేపింది.
దేవర తొలి వీకెండ్‍లో భారీ వసూళ్లను దక్కించుకుంది. కామ్‍స్కోర్ రిపోర్ట్ ప్రకారం, దేవర మూవీ ఈ వీకెండ్‍లో 32.92 మిలియన్ డాలర్లు (సుమారు రూ.275 కోట్లు) కలెక్షన్లు దక్కించుకుంది. 44 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.368 కోట్లు) దేవర ముందు వైల్డ్ రోబోట్ చిత్రం నిలిచింది. ఈ వారం గ్లోబల్ వసూళ్లలో దేవర సెకండ్ ప్లేస్‍లో ఉంది. ట్రాన్స్‌ఫార్మర్స్ వన్ చిత్రం 25 మిలియన్ డాలర్లతో మూడో ప్లేస్‍లో నిలిచింది. అయితే, వైల్డ్ రోబోట్, ట్రాన్స్‌ఫార్మర్స్ వన్ చిత్రాలు ఈ వారం రిలీజ్ అయినవి కాదు. దేవరకు ఫస్ట్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో భారీ కలెక్షన్లు దక్కించుకుంది.
ఫస్ట్ వీకెండ్ సక్సెస్.. కానీ!
దేవర సినిమాకు కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది. ఈ చిత్రం తొలి రోజు రూ.172 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా సాధించినట్టు మూవీ టీమ్ పేర్కొంది. రెండు రోజుల్లో రూ.243 కోట్లు దక్కినట్టు అధికారికంగా చెప్పింది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు ఏకంగా రూ.101 కోట్ల వసూళ్లు తక్కువగా వచ్చాయి. ఆదివారం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కోలుకుంది. ఈ మూవీ రూ.300కోట్ల గ్రాస్ మార్క్ దాటిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కానీ దేవరకు మిక్స్డ్ టాక్ ఎక్కువగా వచ్చింది. దీంతో నేడు సోమవారం వసూళ్లలో భారీగా తగ్గుదల కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుకింగ్ ట్రెండ్స్ చూస్తే ఇది అర్థమవుతోంది. దేవరకు మండే టెస్ట్ చాలా కీలకంగా ఉంది.
దేవర ఒకవేళ నేడు సోమవారం కలెక్షన్లలో నిలకడ చూపిస్తే బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‍గా కొనసాగే ఛాన్స్ ఉంటుంది. మరే పెద్ద చిత్రం కూడా పోటీలో లేకపోవటం ఈ మూవీకి ప్లస్‍గా ఉంది. దసరా సెలవులు కూడా మరో నాలుగు రోజుల్లో మొదలుకానున్నాయి. ఇలా చాలా అనుకూల అంశాలు ఉన్నాయి. మరి, మిక్స్డ్ టాక్‍ను దాటుకొని దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తుందా.. వసూళ్లలో డ్రాప్ కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి.
దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ అయింది. తొలి వీకెండ్ తెలుగుతో పాటు హిందీలోనూ మంచి కలెక్షన్లు వచ్చాయి. తొలి రోజు కంటే హిందీలో రెండో రోజు ఎక్కువ వసూళ్లు దక్కాయి.
దేవర మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. ఈ చిత్రంతోనే టాలీవుడ్‍లోకి జాన్వీ, సైఫ్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశాయి.
టాపిక్