Richest Heroine: 14 ఏళ్లలో హిట్ కానీ ఒక్క సినిమా.. అయినా భారత్‌లోనే అత్యధిక ధనిక హీరోయిన్.. ఆమె మీకు బాగా తెలుసు!
Richest Heroine Aishwarya Rai Net Worth: 14 ఏళ్లలో ఒక్క సోలో హిట్ లేని హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ఇండియాలోనే అత్యధిక ధనిక నటిగా రికార్డు కెక్కింది. ఇటీవల కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్ ఆస్తుల విలువ ఎంతనే వివరాల్లోకి వెళితే..
India Richest Actress: ఏదైనా సినీ పరిశ్రమలో అత్యంత ధనిక హీరో, లేదా హీరోయిన్ అంటే ప్రస్తుతం తమ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకునే ప్రజంట్ నటీనటులు వస్తారు. ఓల్డ్ జనరేషన్‌కు చెదిన హీరో హీరోయిన్స్ స్టార్ డమ్ కాస్తా తగ్గిపోవడంతో కొత్త స్టార్స్ వారి స్థానాలను ఆక్రమించేస్తారు. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఇలా జరగలేదు. ఇండియాలో బాలీవుడ్‌లోనే అత్యధిక రిచెస్ట్ హీరోయిన్‌గా సీనియర్ హీరోయిన్ రికార్డుకెక్కింది.
తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ప్రస్తుతం రిచెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది బ్యూటిఫుల్ ఐశ్వర్య రాయ్. 2000 సంవత్సరం నుంచి ఇండియాలో అత్యంత ధనిక నటిగా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ గుర్తింపు తెచ్చుకుంటోంది. 90వ దశకం మధ్యలో డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రాయ్ ఇప్పటివరకు ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోలతో అతిపెద్ద చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది.
సినిమాల రెమ్యునరేషన్, ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపార పెట్టుబడులు అన్ని కలిపి ఐశ్వర్య రాయ్ సుమారుగా రూ. 776 కోట్ల ఆస్తిని సంపాందించని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇలా భారతదేశంలోని ఏ హీరోయిన్ కూడా కలిగి లేదు. అంతేకాకుండా ఐశ్వర్య రాయ్ నెట్ వర్త్ సుమారుగా రూ. 800 కోట్ల వరకు ఉంటుందని పలు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఆమె లగ్జరీ లైఫ్ స్టైల్, మాన్షన్స్, ఇతర ఆస్తులు అన్ని కలిపి 800 కోట్లకుపైగా ఉంటుందని లెక్కగట్టారు.
ఇక బాక్సాఫీస్ రికార్డు గురించి మాట్లాడినట్లయితే.. గత దశాబ్దంలో హిందీ చిత్రాలలో కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా.. దక్షిణాదిలో నయనతార, అనుష్క శెట్టి, సమంత కలెక్షన్స్ సాధించిన వారిగా ఉన్నారు. గత ఐదేళ్లలో అలియా భట్ ఈ జాబితాలో ఎగబాకింది. అయితే ఈ హీరోయిన్స్ ఎవ్వరూ కూడా ఐశ్వర్య రాయ్‌కు పోటీ ఇవ్వలేకపోయారు. 600 కోట్ల నికర ఆస్తులతో ప్రియాంక చోప్రా రెండో స్థానంలో ఉండగా, 550 కోట్ల రూపాయలతో దీపికా పదుకొణె రెండో స్థానంలో ఉంది.
ఇక అలియా భట్ కూడా రూ. 500 కోట్లకు పైగా నెట్ వర్త్ కలిగి ఉంది. ఐశ్వర్య సమయంలో వచ్చిన కరీనా కపూర్ (రూ. 485 కోట్లు), కాజోల్ (రూ. 250 కోట్లు) కూడా ఆమె కంటే చాలా వెనుకబడి ఉన్నారు. ఇదిలా ఉంటే, ఐశ్వర్య రాయ్ తన కెరీర్‌లో చివరిగా 2010లో వచ్చిన ఎంథిరన్ మూవీతో సోలో హిట్ అందుకుంది. ఇదే తెలుగులో రోబోగా వచ్చింది. ఇక అప్పటి నుంచి ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలో నటించిన అన్ని సినిమాలు గుజారిష్, జజ్బా, సర్బ్‌జిత్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి.
అలా 14 ఏళ్లుగా ఐశ్వర్యా రాయ్‌కు ఒక్క సోలో హిట్ లేకుండా పోయింది. కానీ, ఐశ్వర్య రాయ్ చిన్న పాత్రలతో పెద్ద చిత్రాలలో భాగం అయి తెలివిగా వ్యవహరించింది. ఉదాహరణకు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ మూవీ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్లు తెచ్చిపెట్టింది. అలాగే ఇందులో ఐశ్వర్య రాయ్ నటనకు కూడా ప్రశంసలు అందాయి. ఇది మాత్రమే ఐశ్వర్యకు హిట్ సినిమా అని చెప్పుకోవ్చు.
అయితే, రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ బ్రాండ్‌ల ఎండార్స్‌మెంట్స్‌తో ఐశ్వర్య రాయ్‌కు భారీ ఆదాయం రావడంతో భారతదేశంలో అత్యధిక సంపన్నురాలిగా నిలిచింది. సంవత్సరాల నుంచి లొరియల్, లాంగిన్స్ వంటి ఫేస్ క్రీమ్ బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. కాగా హాలీవుడ్ చిత్రాలతో పాటు కేన్స్ రెడ్ కార్పెట్‌లో (Cannes Film Festival 2024) ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్య రాయ్ ఇటీవల గుర్తింపు తెచ్చుకుంది.