Alia Bhatt Dress Price: అలియా భట్ డ్రెస్ సింపులే.. కానీ, ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
Alia Bhatt Dress Price: ఆర్ఆర్ఆర్ సీత, బాలీవుడ్ బ్యూటి అలియా భట్ నేటి ట్రెండ్‌కు తగినట్లుగా డిఫరెంట్ దుస్తుల్లో దర్శనం ఇస్తుంటుంది. కానీ, తాజాగా సింపుల్ స్లీవ్‌లెస్ జీన్స్ డ్రెస్సులో అట్రాక్ట్ చేసింది. అయితే ఈ డ్రెస్ ధర ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
(1 / 6)
అలియా భట్ తన ఫ్యాషన్ ఏంటో చూపించడంలో ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటుంది. చీరకట్టులో అయినా, ఆకట్టుకునే పూల చీరలో అయినా అలియా భట్ ఏ లుక్‌లో అయినా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. అలియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె గ్లామరస్ ఫొటోలు ఆమె ఫాలోవర్స్ అందరికీ ఫ్యాషన్ ఇన్‌స్పిరేషన్‌గా ఉంటాయి. ఇక తాజాగా అలియా కనిపించిన డ్రెస్ వివరాలు చూద్దాం.
(Instagram/@aliaabhatt)(2 / 6)
శనివారం అలియా తన అభిమానులకు వీకెండ్ ట్రీట్ ఇచ్చింది. ఆలియా భట్ ఇన్ స్టాగ్రామ్ లో "జస్ట్ అదర్ స్మార్ఫ్" అనే క్యాప్షన్ తో వరుస అద్భుతమైన ఫోటోలను అప్ లోడ్ చేసింది. ఇందులో ఎంతో అందంగా, హాట్‌గా దర్శనం ఇచ్చింది అలియా. అయితే ఇందులో అలియా వేసుకున్న డ్రెస్సు, దాని ధర హాట్ టాపిక్ అవుతోంది.
(Instagram/@aliaabhatt)(3 / 6)
అలియా భట్ స్టైలిష్ స్లీవ్ లెస్ డ్రెస్ ఆకర్షణీయమైన ఇండిగో బ్లూ షేడ్ లో ఉంది. అలాగే స్కూప్ నెక్ లైన్, కాస్ట్‌లీ డెనిమ్ ఫ్యాబ్రిక్, రియర్ జిప్ ఫాస్టెనింగ్, గ్రిస్-క్రాస్ స్ట్రాప్స్, బాడీకాన్ ఫిట్, బ్యాక్ లెస్ డిజైన్‌తో పాడు మిడి హెమ్ లైన్ కలిగి ఉంది. ఈ డెనిమ్ బాడీకాన్ మిడీ డ్రెస్ ధర రూ. 1.37 లక్షలు. ఇది తెలిసి ఇంత సింపుల్‌గా కనిపించే డ్రెస్సుకు అంత ధరనా అని అవాక్కవుతున్నారు.
(Instagram/@aliaabhatt)(4 / 6)
సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ ప్రియాంక కపాడియా పటానీ సహాయంతో ఆలియా గోల్డ్ హూప్ చెవిపోగులు, వేలిని అలంకరించే బంగారు ఉంగరం, హై హీల్స్ జతతో తన లుక్ ను గ్లామరస్ గా అలంకరించింది.
(Instagram/@aliaabhatt)(5 / 6)
మేకప్ ఆర్టిస్ట్ పునీత్ పి సైనీ సహాయంతో అలియా మస్కారా కనురెప్పలు, కాంటూర్ కనుబొమ్మలు, గులాబీ బుగ్గలు, మంచు బేస్, ప్రకాశవంతమైన హైలైటర్‌తోపాటు మృదువైన లిప్ స్టిక్ తో ఎంతో అందంగా దర్శనం ఇచ్చింది.
(Instagram/@aliaabhatt)ఇతర గ్యాలరీలు