Do aur Do Pyaar Movie: ఆరేళ్ల త‌ర్వాత ఇలియానాకు హిట్టొచ్చింది - దో ఔర్ దో ప్యార్ మూవీ టాక్ ఏంటంటే?-ileana vidya balan bollywood romantic comedy movie do aur do pyaar talk and first day collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Do Aur Do Pyaar Movie: ఆరేళ్ల త‌ర్వాత ఇలియానాకు హిట్టొచ్చింది - దో ఔర్ దో ప్యార్ మూవీ టాక్ ఏంటంటే?

Do aur Do Pyaar Movie: ఆరేళ్ల త‌ర్వాత ఇలియానాకు హిట్టొచ్చింది - దో ఔర్ దో ప్యార్ మూవీ టాక్ ఏంటంటే?

Nelki Naresh Kumar HT Telugu
Apr 20, 2024 01:37 PM IST

Do aur Do Pyaar Movie: దో ఔర్ దో ప్యార్ మూవీతో దాదాపు మూడేళ్ల త‌ర్వాత సిల్వ‌ర్‌స్క్రీన్‌పై క‌నిపించింది ఇలియానా. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ బాలీవుడ్ మూవీ టాక్ ఏంటంటే?

దో ఔర్ దో ప్యార్ మూవీ
దో ఔర్ దో ప్యార్ మూవీ

Do aur Do Pyaar Movie: ఇలియానా సిల్వ‌ర్‌స్క్రీన్‌పై క‌నిపించి మూడేళ్లు దాటిపోయింది. గ‌త ఏడాది ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది ఇలియానా. మైఖేల్ డోలాన్ అనే అమెరిక‌న్ ఫిల్మ్ మేక‌ర్స్‌తో చాలా కాలంగా ర‌హ‌స్య ప్రేమ‌య‌ణాన్ని సాగిస్తోన్న ఈ గోవా బ్యూటీ అత‌డితో క‌లిసి ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. పెళ్లికి ముందే ఇలియానా త‌ల్ల‌వ్వ‌డం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

రొమాంటిక్ కామెడీ డ్రామా...

పెళ్లి, మాతృత్వ బంధం కార‌ణంగా చాలా కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న ఇలియానా శుక్ర‌వారం దో ఔర్ దో ప్యార్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో ఇలియానాతో పాటు విద్యాబాల‌న్ హీరోయిన్లుగా న‌టించారు.

ప్ర‌తీక్ గాంధీ, సెంథిల్ రామ‌మూర్తి హీరోలుగా న‌టించారు. మెడ్ర‌న్ డే రిలేష‌న్స్ ఆధారంగా శిర్షా గుహా తెర‌కెక్కించిన ఈ మూవీ తొలి రోజు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. మెసేజ్‌కు కామెడీని జోడించి తెర‌కెక్కిన ఈ మూవీలో ఇలియానా, విద్యాబాల‌న్ యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టారంటూ కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

దో ఔర్ దో ప్యార్ క‌థ ఇదే...

బెంగాళీ కుర్రాడు అనీ (ప్ర‌తీక్ గాంధీ), త‌మిళ అమ్మాయి కావ్య (కావ్య‌) ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. అపోహ‌లు, అపార్థాల కార‌ణంగా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. పెళ్లికి ముందే అనీ...నోరా అనే సినీ న‌టితో ప్రేమ‌లో ఉంటాడు. కావ్య కూడా విక్ర‌మ్ అనే ఫొటోగ్రాఫ‌ర్‌తో డేటింగ్ చేస్తుంది. ఈ బంధాలు వారి జీవితాల్లో ఎలాంటి క‌ల్లోలాన్ని, క‌ష్టాల‌ను తెచ్చిపెట్టాయి...అనీ, కావ్య కొత్త జీవితాన్ని ఎలా మొద‌లుపెట్టారు అన్న‌దే ఈ మూవీ క‌థ.

గ్లామ‌ర్ ప్ల‌స్ యాక్టింగ్‌...

ఈ సినిమాలో నోరా పాత్ర‌లో యాక్టింగ్‌తో పాటు గ్లామ‌ర్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో ఇలియానా క‌నిపించింది. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ ఇలియానాను సిల్వ‌ర్‌స్క్రీన్‌పై చూడ‌టం ఆనందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇలియానా యాక్టింగ్ టాలెంట్‌కు త‌గ్గ ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర‌లు బాలీవుడ్‌లో ఎక్కువ‌గా రాలేద‌ని చెబుతోన్నారు.

బోల్డ్ డైలాగ్స్‌...

ఇలియానాతో పాటు విద్యాబాల‌న్ రోల్ కూడా బాగుంద‌ని అంటున్నారు. ఈ సినిమాలో చాలా బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయ‌ని, కానీ వాటిని కావాల‌నే కాకుండా క‌థ‌లో అంత‌ర్భాగంగా వ‌చ్చేలా డైరెక్ట‌ర్ చ‌క్క‌గా రాసుకున్నాడ‌ని అంటున్నారు. స‌మ‌కాలీన స‌మ‌స్య‌ను ద‌ర్శ‌కుడు కామెడీతో ఎక్క‌డ బోర్ లేకుండా చెప్పాడ‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు.

యాభై ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్‌..

తొలిరోజు సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చినా క‌లెక్ష‌న్స్ మాత్రం త‌క్కువ‌గానే వ‌చ్చాయి. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ యాభై ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. శ‌నివారం రోజు వ‌సూళ్లు పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

2018లో హిట్‌...

ఇలియానా చివ‌ర‌గా 2018లో వ‌చ్చిన రైడ్ సినిమాతో హిట్టందుకుంది. అజ‌య్ దేవ్‌గ‌ణ్ హీరోగా న‌టించిన ఈ బాలీవుడ్‌ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద 150 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తెలుగులో స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా చెలామ‌ణి అయ్యింది ఇలియానా. పోకిరి, జ‌ల్సా, కిక్‌తో పాటు ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు చేసింది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా బిజీగా ఉన్న స‌మ‌యంలోనే బ‌ర్ఫీ సినిమాతో బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్క‌డ నుంచే ఇలియానా కెరీర్ డౌన్‌ఫాల్ స్టార్ట‌యింది. అమ‌ర్ అక్బ‌ర్ ఆంథోనీతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా కూడా ఇలియాన‌కు విజ‌యాన్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయింది.

IPL_Entry_Point