Ileana D’Cruze: అతడిని దూషిస్తే నాకు బాధేస్తుంది: ఇలియానా-i am not comfortable with talking rubbish about michael dolan says ileana dcruze ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  I Am Not Comfortable With Talking Rubbish About Michael Dolan Says Ileana Dcruze

Ileana D’Cruze: అతడిని దూషిస్తే నాకు బాధేస్తుంది: ఇలియానా

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 17, 2024 08:07 PM IST

Ileana D’Cruze: స్టార్ హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. ఈ తరుణంలో తన కుటుంబ జీవితం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఇలియానా.

Ileana D’Cruze: అతడిని దూషిస్తే నాకు బాధేస్తుంది: ఇలియానా
Ileana D’Cruze: అతడిని దూషిస్తే నాకు బాధేస్తుంది: ఇలియానా

Ileana D’Cruze: టాలీవుడ్‍లో చాలా ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‍గా వెలుగొందారు ఇలియానా. తన అందం, నటనతో మెప్పించారు. చాలా మంది తెలుగు స్టార్ హీరోలతో నటించారు. ఆమె చేసిన చాలా చిత్రాలు బ్లాక్‍బాస్టర్ అయ్యాయి. అయితే, పదేళ్లుగా ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో గతేడాది తన భర్తను ప్రపంచానికి పరిచయం చేశారు ఇలియానా.

మైకేల్ డోలాన్‍ను తన జీవిత భాగస్వామి అని ఇలియానా వెల్లడించారు. ఇలియానా, మైకేల్ దంపతులకు గతేడాదే మగపిల్లాడు జన్మించారు. అతడికి కొయా ఫోనిక్స్ డోలాన్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం తన భర్త, కుమారుడితో కలిసి అమెరికాలోనే ఉంటున్నారు ఇలియానా. తన కుటుంబం, మాతృత్వం గురించి తరచూ వెల్లడిస్తూ వస్తున్నారు. ఇన్‍స్టాగ్రామ్‍లోనూ అప్పుడప్పుడూ పోస్టులు చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలియానా కొన్ని విషయాలు వెల్లడించారు.

పని చేద్దామనుకున్నా.. కుదర్లేదు

తాను గర్భంతో ఉన్న సమయంలోనూ పని చేయాలని అనుకున్నానని.. ఇబ్బందులు ఏర్పడటంతో అలా చేయలేకపోయానని ఇలియానా తెలిపారు. బ్రేక్ తీసుకోకతప్పలేదని చెప్పారు. 2023 తనకు ఎంతో సంతోషకరమైన సంవత్సరమని, గర్భవతిగా ఉన్నప్పుడు తన తల్లి చాలా మద్దతుగా నిలిచారని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పారు. తన భర్త మైకేల్ డోలాన్ అద్భుతమైన వ్యక్తి అని.. తమ బలమైన బంధాన్ని పదాల్లో చెప్పలేనని అన్నారు.

భర్తను ఏమైనా అంటే బాధేస్తుంది

పెళ్లి ఎప్పుడైందనే ప్రశ్నకు ఇలియానా నేరుగా సమాధానం చెప్పలేదు. రిలేషన్ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు తనకు సందేహంగా ఉంటుందని, ఎందుకంటే తాను గతంలో జనాల నుంచి ఈ విషయంలో నెగెటివ్ అనుభవాలను ఎదుర్కొన్నానని చెప్పారు. తనను ఏమైనా అంటే తట్టుకుంటానని, కానీ భర్త, కుటుంబాన్ని అంటే బాధేస్తుందని అన్నారు. “నా గురించి ఏదైనా అంటే నేను భరిస్తా.. కానీ నా జీవిత భాగస్వామి, నా కుటుంబం గురించి దూషిస్తే నేను తట్టుకోలేను” అని ఇలియానా చెప్పారు.

తన భర్త మైకేల్ చాలా ప్రేమను చూపిస్తారని, తనకు మద్దతుగా నిలుస్తున్నారని ఇలియానా మరోసారి తెలిపారు. ఇలియానా త్వరలోనే మళ్లీ యాక్టింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇలియానా తొలుత తన జీవిత భాగస్వామి మైకేల్ డోలాన్‍ను నేరుగా ప్రపంచానికి పరిచయం చేయలేదు. అతడి ముఖం కనిపించకుండా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గర్భిణి అయ్యాక కూడా చాలా కాలం అతడు ఎవరో చెప్పలేదు. దీంతో, ఇలియానా డేటింగ్ చేస్తున్నదెవరితో అంటూ చాలా రూమర్లు వచ్చాయి. ఇది హాట్ టాపిక్‍గా నడిచింది. అయితే, ఎట్టకేలకు మైకేల్ డోలాన్ పేరును ఇలియానా వెల్లడించారు. గతేడాది ఆగస్టు 1వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చారు ఇలియానా.

2006లో దేవదాసు సినిమాతో తెరంగేట్రం చేశారు ఇలియానా. పోకిరీ, రాఖీ, జల్సా, కిక్, జులాయి సహా చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్‍గా చేశారు. 2013 నుంచి బాలీవుడ్‍పై ఆమె ఎక్కువగా ఫోకస్ పెట్టారు. చివరగా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం చేశారు ఇలియనా. హిందీలో చివరగా 2021లో ది బిగ్ బుల్ చిత్రంలో కనిపించారు. ఇలియానా నటించిన దో ఔర్ దో ప్యార్ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.

IPL_Entry_Point