Ileana: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన ఇలియానా బోల్డ్ ల‌వ్ స్టోరీ మూవీ - ఎందులో చూడాలంటే?-ileana dcruz vidya balan do aur do pyaar movie streaming now on disney plus hotstar ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ileana: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన ఇలియానా బోల్డ్ ల‌వ్ స్టోరీ మూవీ - ఎందులో చూడాలంటే?

Ileana: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన ఇలియానా బోల్డ్ ల‌వ్ స్టోరీ మూవీ - ఎందులో చూడాలంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jun 16, 2024 06:07 AM IST

Ileana: ఇలియానా హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్‌ రొమాంటిక్ కామెడీ మూవీ దో ఔర్ దో ప్యార్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ఇలియానాతో పాటు విద్యాబాల‌న్ మ‌రో హీరోయిన్‌గా క‌నిపించింది.

దో ఔర్ దో ప్యార్ మూవీ ఓటీటీ
దో ఔర్ దో ప్యార్ మూవీ ఓటీటీ

Ileana: మాతృత్వ బంధం కార‌ణంగా రెండేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్న ఇలియానా ఇటీవ‌లే దో ఔర్ దో ప్యార్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ టాక్ బాగున్నా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్టు అనిపించుకోలేక‌పోయింది.

డిస్నీ హాట్ స్టార్‌లో...

దో ఔర్ దో ప్యార్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా సైలెంట్‌గా ఈ రొమాంటిక్ కామెడీ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు.

విద్యాబాల‌న్‌...

దో ఔర్ దో ప్యార్ మూవీలో ఇలియానాతో పాటు విద్యాబాల‌న్ మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌తీక్ గాంధీ, సెంథిల్ రామ‌మూర్తి హీరోలుగా క‌నిపించారు. మెడ్ర‌న్ డే రిలేష‌న్స్ ఆధారంగా డైరెక్ట‌ర్ శిర్షా గుహా ఈ మూవీని తెర‌కెక్కించింది.

దో ఔర్ దో ప్యార్ క‌థ ఇదే...

బెంగాళీ కుర్రాడు అనీ (ప్ర‌తీక్ గాంధీ), త‌మిళ అమ్మాయి కావ్య (కావ్య‌) కు పెళ్లి జ‌రుగుతుంది. అపోహ‌లు, అపార్థాల కార‌ణంగా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. పెళ్లికి ముందే అనీ...నోరా (ఇలియానా) అనే సినీ న‌టితో ప్రేమ‌లో ఉంటాడు. కావ్య కూడా విక్ర‌మ్ (సెంథిల్ రామ‌మూర్తి) అనే ఫొటోగ్రాఫ‌ర్‌తో డేటింగ్ చేస్తుంది. ఈ బంధాలు అనీ, కావ్య జీవితాల‌ను ఎలాంటి మ‌లుపులు తిప్పాయి.. ఊటీ ట్రిప్ వారిని ఎలా ద‌గ్గ‌ర చేసింది అన్న‌దే ఈ దో ఔర్ దో ప్యార్ మూవీ క‌థ‌.

గ్లామ‌ర్ ప్ల‌స్ యాక్టింగ్‌...

ఈ సినిమాలో నోరా గా బోల్డ్ రోల్‌లో ఇలియానా క‌నిపించింది. రొమాంటిక్ డైలాగ్స్ కూడిన గ్లామ‌ర‌స్ క్యారెక్ట‌ర్‌లో ఇలియానా అద‌ర‌గొట్టింది. వింటేజ్ ఇలియానాను గుర్తుచేసింది. థియేట‌ర్ల‌లో ఈ సినిమా రిలీజైన విష‌యం కూడా పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌క‌పోవ‌డంతో ఇలియానా క‌ష్టం వృథాగా మారింది.

ఈ ఏడాది దో ఔర్ దో ప్యార్‌తో పాటు హిందీలో తేరా క్యా హోగా ల‌వ్‌లీ సినిమా చేసింది ఇలియానా. సొసైటీలో స్కిల్ క‌ల‌ర్ ప‌ట్ల ఉండే వివ‌క్ష‌ను చూపిస్తూ సందేశాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ మూవీ కూడా డిజాస్ట‌ర్ అయ్యింది.

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా...

తెలుగులో స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్న‌ది ఇలియానా. పోకిరి, జ‌ల్సా, కిక్ తో పాటు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందుకున్న‌ది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా బిజీగా ఉన్న స‌మ‌యంలోనే బ‌ర్ఫీ సినిమాతో బాలీవుడ్ బాట ప‌ట్టింది. ఆ రాంగ్ స్టెప్ కార‌ణంగానే ఇలియానా కెరీర్ దెబ్బ‌తిన్న‌ది.

బ‌ర్ఫీలో ఛాలెంజింగ్ రోల్‌లో న‌టించింది. కానీ సినిమా ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో ఇలియానాకు ఆశించిన స్థాయిలో బాలీవుడ్‌లో అవ‌కాశాలు రాలేదు. బాలీవుడ్‌లో ప‌దిహేనుకుపైగా సినిమాలు చేసినా రుస్తుం, రైడ్ మిన‌హా ఇలియానాకు పెద్ద‌గా విజ‌యాలు ద‌క్క‌లేదు. మ‌రోవైపు అమ‌ర్‌ అక్బ‌ర్ ఆంథోనీతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా కూడా ఇలియాన‌కు నిరాశ‌నే మిగిల్చింది. ప్ర‌స్తుతం ఇలియానా చేతిలో ఒక్క‌మూవీ కూడా లేకుండాపోయింది.

గ‌త ఏడాది త‌ల్ల‌యింది...

మైఖేల్ డోలాన్ అనే అమెరిక‌న్ ఫిల్మ్ మేక‌ర్స్‌తో చాలా కాలంగా ర‌హ‌స్య ప్రేమ‌య‌ణాన్ని సాగిస్తోన్న ఈ గోవా బ్యూటీ అత‌డితో క‌లిసి గ‌త ఏడాది ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. పెళ్లికి ముందే ఇలియానా త‌ల్లిగా మారింది.

WhatsApp channel