Ileana Hospitalized: ఆసుపత్రిలో చేరిన ఇలియానా.. ఫ్లూయిడ్స్ ఎక్కించిన వైద్యులు.. ఇప్పుడెలా ఉంది?-actress ileana hospitalized shares health update she is fine now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ileana Hospitalized: ఆసుపత్రిలో చేరిన ఇలియానా.. ఫ్లూయిడ్స్ ఎక్కించిన వైద్యులు.. ఇప్పుడెలా ఉంది?

Ileana Hospitalized: ఆసుపత్రిలో చేరిన ఇలియానా.. ఫ్లూయిడ్స్ ఎక్కించిన వైద్యులు.. ఇప్పుడెలా ఉంది?

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 08:38 PM IST

Ileana Hospitalized: ప్రముఖ హీరోయిన్ ఇలియానా ఆసుపత్రిలో చేరింది. ఒక్క రోజులోనే ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు ఇలియానా షేర్ చేసిన పోస్టు ద్వారా తెలుస్తోంది. ఆమెకు వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించారు.

ఇలియానా
ఇలియానా

Ileana Hospitalized: ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస పెట్టి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. అక్కడా కూడా జైత్ర యాత్ర కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో కాస్తంత గ్యాప్ తీసుకుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఫుల్‌ బిజీగా ఉండే ఈ అమ్మడు.. అందులో తన గురించి తెలియజేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. తాజాగా ఇలియానా ఆసుపాత్రి పాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నే ఆమె తన ఇన్ స్టా స్టోరీ ద్వారా తెలియజేసింది. ఇందుకు సంబంధించిన రెండో ఫొటోలను స్టోరీలో షేర్ చేసింది.

రోజుకు ఎంత తేడా ఉంటుంది. అని మొదటి ఫొటోలో రాసింది. ఈ చిత్రంలో ఇలియానా ఆసుపత్రి బెడ్‌పై పడుకుని ఉంది. తదుపరి ఫ్రేమ్‌లో నవ్వుతూ కెమెరాకు ఫోజిచ్చింది. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వా ఈ ఫొటో దిగినట్లు తెలుస్తోంది. "ఒక రోజుకు ఎంత తేడా వచ్చింది.. కొంతమంది లవ్లీ డాక్టర్లు, వారిచ్చిన 3 బ్యాగులు ఐవీ ఫ్లూయిడ్ కారణంగా ఇలా ఉన్నా" అంటూ ఈ చిత్రంలో రాసింది.

అంతేకాకుండా ఈ ఫొటోలతో పాటు తన అభిమానులకు థ్యాంక్యూ నోట్ కూడా జత చేసింది ఇల్లీ బేబీ. "నా ఆరోగ్యం గురించి మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. మీరు నాపై ఎంతో శ్రద్ధ చూపించారు. నేను మీ ప్రేమను నిజంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు పూర్తిగా బాగున్నానని నేను మీకు తెలియజేస్తున్నాను. సరైన సమయంలో మంచి వైద్య సంరక్షణ లభించింది." అని ఇలియానా మరో ఫొటోలో పేర్కొంది.

తెలుగు సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించిన ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. 2012లో బర్ఫీ మూవీతో అక్కడ అరంగేట్రం చేసింది. ఇందులో ఆమెతో పాటు ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్ కలిసి నటించారు. ఈ చిత్రం తర్వతా ఫటా పోస్టర్ నిక్లా హీరో, మే తేరా హీరో, రుస్తుం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రణ్‌దీప్ హుడాతో క్యా హోగా లవ్లీ అనే సినిమాలో నటిస్తోంది ఈ గోవా సుందరి.

ఆసుపత్రిలో ఇలియానా
ఆసుపత్రిలో ఇలియానా
ఇలియానా హెల్త్ అప్డేట్
ఇలియానా హెల్త్ అప్డేట్
Whats_app_banner

సంబంధిత కథనం