Sonakshi Sinha wedding: అవును.. ఆ పుకార్లు నిజమే.. పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పిన బాలీవుడ్ నటి-sonakshi sinha wedding bollywood actress confirms her marriage with boyfriend zaheer iqbal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sonakshi Sinha Wedding: అవును.. ఆ పుకార్లు నిజమే.. పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పిన బాలీవుడ్ నటి

Sonakshi Sinha wedding: అవును.. ఆ పుకార్లు నిజమే.. పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పిన బాలీవుడ్ నటి

Hari Prasad S HT Telugu
Jun 15, 2024 11:06 AM IST

Sonakshi Sinha wedding: మరో బాలీవుడ్ నటి పెళ్లి పీటలెక్కబోతోంది. తన బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోనాక్షి సిన్హా అఫీషియల్ గా వెల్లడించింది.

అవును.. ఆ పుకార్లు నిజమే.. పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పిన బాలీవుడ్ నటి
అవును.. ఆ పుకార్లు నిజమే.. పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పిన బాలీవుడ్ నటి

Sonakshi Sinha wedding: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, ఆమె బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ తమ పెళ్లి తేదీని కన్ఫమ్ చేశారు. అంతేకాదు వీళ్ల వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. ఇప్పుడీ ఇన్విటేషన్ వైరల్ అవుతోంది. కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారని, వీళ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గత వారం వార్తలు రాగా.. ఇప్పుడు వాళ్లే ఈ విషయాన్ని కన్ఫమ్ చేశారు.

సోనాక్షి, జహీర్ పెళ్లి వేడుక

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, ఆమె బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ జూన్ 23న పెళ్లి చేసుకోనున్నారు. ముంబైలో వీళ్ల పెళ్లి జరగనుంది. వాళ్ల వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా ఈ మధ్యే లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మ్యాగజైన్ కవర్ పేజీలాగా వీళ్ల ఇన్విటేషన్ డిజైన్ చేయడం విశేషం. దానిపై సోనాక్షిని జహీర్ కిస్ చేస్తున్న ఫొటో చూడొచ్చు.

"మేము దీనిని అఫీషియల్ చేస్తున్నాం. పుకార్లు నిజమే" అనే టైటిల్ తో వీళ్ల ఇన్విటేషన్ ప్రారంభం కావడం విశేషం. అంతేకాదు దానిపై వీళ్ల పెళ్లి తేదీ, వేదిక, టైమ్, డ్రెస్ కోడ్ లాంటి వివరాలన్నీ ఉన్నాయి. ఈ కార్డుతోపాటు సోనాక్షి, జహీర్ జంట ఓ ఆడియో సందేశాన్ని కూడా షేర్ చేశారు.

"ఈ పేజ్ ను చూస్తున్న అందరు టెక్ సావీ, స్పై ఫ్రెండ్స్, ఫ్యామిలీకి హాయ్. గత ఏడేళ్లుగా మేము కలిసి ఉన్నాం. ప్రేమ, సంతోషం, నవ్వులు, ఎన్నో అడ్వెంచర్లు కలిపి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయి. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనే పుకార్ల నుంచి అధికారికంగా భర్త, భార్యగా మారే క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. మీరు లేకుండా ఈ వేడుక జరగదు. అందుకే జూన్ 23న మీ పనులన్నీ పక్కన పెట్టేయండి. మాతో కలిసి పార్టీ చేసుకోండి. అక్కడ కలుద్దాం" అని సోనాక్షి, జహీర్ ఆ ఆడియో మెసేజ్ లో చెప్పారు.

డ్రెస్ కోడ్ కూడా..

సోనాక్షి, జహీర్ పెళ్లికి వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ కూడా పెట్టడం విశేషం. ఫార్మల్, ఫెస్టివ్ డ్రెస్ లలోనే తమ పెళ్లికి రావాలని వారు కోరారు. 2022లో వచ్చిన డబుల్ ఎక్స్ఎల్ మూవీలో కలిసి నటించిన సోనాక్షి, జహీర్ గత ఏడేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. వీళ్లు ముంబైలోని బాస్టియన్ లో పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. జూన్ 23 రాత్రి 8 గంటల నుంచి వీళ్ల పెళ్లి వేడుక ప్రారంభం కానుంది.

నిజానికి వీళ్లు సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంటారని మొదట వార్తలు వచ్చాయి. పెళ్లికి ముందు రోజు కూడా జుహులోని సోనాక్షి ఇంట్లోనూ వేడుకలు జరగనున్నాయి. సోనాక్షి పెళ్లికి బాలీవుడ్ లోని చాలా మంది సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే ఆమె హీరామండి వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ సిరీస్ లో నటించిన స్టార్లందరూ పెళ్లికి వచ్చే అవకాశం ఉంది.

WhatsApp channel