Allu Sirish: పవన్ కల్యాణ్ నుంచి అది నేర్చుకోవాలనుకుంటున్నా: అల్లు శిరీష్.. అధిక టికెట్ ధరలపై కూడా కామెంట్-i want to learn mental strength from pawan kalyan says allu sirish and responded on ticket prices at buddy movie meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Sirish: పవన్ కల్యాణ్ నుంచి అది నేర్చుకోవాలనుకుంటున్నా: అల్లు శిరీష్.. అధిక టికెట్ ధరలపై కూడా కామెంట్

Allu Sirish: పవన్ కల్యాణ్ నుంచి అది నేర్చుకోవాలనుకుంటున్నా: అల్లు శిరీష్.. అధిక టికెట్ ధరలపై కూడా కామెంట్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 31, 2024 04:11 PM IST

Allu Sirish - Buddy Movie: అల్లు శిరీష్ హీరోగా బడ్డీ చిత్రం వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రెస్‍మీట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ నుంచి తాను ఏం నేర్చుకోవాలని అనుకుంటున్నానో ఓ ప్రశ్నకు సమాధానంగా శిరీష్ తెలిపారు.

Allu Sirish: పవన్ కల్యాణ్ నుంచి అది నేర్చుకోవాలనుకుంటున్నా: అల్లు శిరీష్.. అధిక టికెట్ ధరలపై కూడా కామెంట్
Allu Sirish: పవన్ కల్యాణ్ నుంచి అది నేర్చుకోవాలనుకుంటున్నా: అల్లు శిరీష్.. అధిక టికెట్ ధరలపై కూడా కామెంట్

బడ్డీ సినిమా రిలీజ్‍కు రెడీ అయింది. అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్లను మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. కొన్ని ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శితం కాగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. బడ్డీ సినిమా ప్రెస్‍మీట్ నేడు (జూలై 31) జరిగింది. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలకు అల్లు శిరీష్ సమాధానాలు చెప్పారు.

చిరంజీవి, పవన్ నుంచి ఈ విషయాలు నేర్చుకుంటా

తన మామయ్యలు అయిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి గుణాలు నేర్చుకోవాలని అనుకుంటున్నానో అల్లు శిరీష్ చెప్పారు. ఈ ప్రెస్‍మీట్‍లో ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాలు చెప్పారు.

పవన్ కల్యాణ్‍లోని మానసిక స్థైర్యాన్ని తాను అలవరుచుకోవాలని అనుకుంటున్నట్టు శిరీష్ చెప్పారు. “పవన్ కల్యాణ్ నుంచి నేను నేర్చుకోవాలనుకుంటున్నది మానసిక దృఢత్వం. మానసికంగా ఆయన ఉన్నంత స్ట్రాంగ్‍గా ఎవరూ ఉండరు. చిరంజీవి నుంచి అన్‍లిమిటెడ్ పాజిటివిటీ నేర్చుకోవాలని ఉంటున్నా. కల్యాణ్ ఓ ఫంక్షన్‍లో చెప్పారు. మీరు ఎంత ద్వేషించినా చిరంజీవి మీకు ప్రేమే తిరిగిస్తారని అన్నారు. చిరంజీవిలోని పాజిటివిటీ, వినమ్రత నాకు ఎంతో ఇష్టం” అని అల్లు శిరీష్ అన్నారు.

ఏపీ ఎన్నికల ముందు వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయటంతో మెగా, అల్లు అభిమానుల మధ్య గ్యాప్ ఏర్పడినట్టు సోషల్ మీడియాలో అర్థమవుతోంది. ఈ తరుణంలో శిరీష్‍కు ఈ ప్రశ్న ఎదురైంది.

మా అన్నే నా బడ్డీ

తన అన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జునే తనకు స్నేహితుడు, రూమ్‍మేట్, బడ్డీ అన్నీ అల్లు శిరీష్ చెప్పారు. “నా బెస్ట్ బడ్డీ అంటే మా అన్నే. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. మేం ఎనిమిది తొమ్మిదేళ్లు ఒకే రూమ్‍లో ఉన్నాం. మేం రూమ్‍మేట్స్, బ్రదర్స్, బడ్డీస్. నేను మా నాన్నతో, బెస్ట్ ఫ్రెండ్‍తో, గర్ల్ ఫ్రెండ్‍తో షేర్ చేసుకోని విషయాలు కూడా మా అన్నతో షేర్ చేసుకోగలను” అని శిరీష్ చెప్పారు.

అధిక టికెట్ ధరలపై..

అన్ని ఇండస్ట్రీల్లోనూ సినిమాను ఎక్కువగా ప్రేమించే ప్రేక్షకులు తెలుగు వారేనని అల్లు శిరీష్ చెప్పారు. టికెట్ ధరలు పెంచడం వల్ల బంగారు గుడ్లు పెట్టే బాతును చంపినట్టుగా అవుతుందనేలా మాట్లాడారు. “దేశంలో హిందీ మాట్లాడే వారు 90 కోట్లు ఉన్నా.. థియేటర్లకు వచ్చేది 3, 4 కోట్ల మందే. తెలుగు మాట్లాడే వారు 10 కోట్లే ఉన్నా.. మూడు కోట్ల మంది థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా హిందీ సినిమాలతో పోలిస్తే మన సింగిల్ స్క్రీన్ థియేటర్ల టికెట్ ధరలు అందుబాటులో ఉంటాయి. టికెట్ ధరలను విపరీతంగా పెంచేస్తే బంగారు బాతును చంపినట్టుగా అవుతుందని అనుకుంటన్నా. అలా చేయకుండా టికెట్ ధరలు అందుబాటులో పెడితే.. యూత్, ఫ్యామిలీలు ఎక్కువగా థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నా” అని అల్లు శిరీష్ అన్నారు. టికెట్ ధరలు అధికంగా ఉండడం తొలివారం థియేటర్లకు వచ్చేందుకు కొందరు వెనకాడుతున్నారని ఆయన అన్నారు.

బడ్డీ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సింగిల్ స్క్రీన్‍లలో టికెట్ ధర రూ.99, మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధర రూ.125గా ఉన్నాయి. తక్కువ ధరతో ఈ మూవీ వస్తోంది.

టెడ్డీ బేర్‌తో కలిసి హీరో శిరీష్ అన్యాయాలను ఎదిరించి పోరాడడం చుట్టూ బడ్డీ సినిమా సాగుతుంది. స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా, ఆరాధాన జ్ఞానవేల్ రాజా ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు. డైరెక్టర్ సామ్ ఆంటోన్ తెరకెక్కించిన ఈ మూవీకి హిప్‍హప్ తమిళ మ్యూజిక్ ఇచ్చారు.

Whats_app_banner