Buddy Ticket Prices: తక్కువ టికెట్ ధరలతో థియేటర్లలో అల్లు శిరీష్ ‘బడ్డీ’ సినిమా! రన్‍టైమ్ కూడా క్రిస్ప్‌గానే..
Buddy Ticket Prices: బడ్డీ సినిమా టికెట్ ధరలు సాధారణం కంటే తక్కువగానే ఉండనున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. అలాగే, ఈ మూవీ రన్‍టైమ్ వివరాలు కూడా బయటికి వచ్చాయి.
యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘బడ్డీ’ రిలీజ్‍కు రెడీ అవుతోంది. ఆగస్టు 2వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే కొన్ని ప్రత్యేక ప్రీమియర్ షోలను కూడా మూవీ టీమ్ ప్రదర్శించింది. హీరోతో కలిసి అన్యాయాలను ఎదుర్కొనే టెడ్డీబేర్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో బడ్డీ చిత్రం వస్తోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా అనిపించింది. అయితే, ఈ సినిమా టికెట్లను సాధారణం కంటే తక్కువ ధరకే విక్రయించాలని మూవీ టీమ్ భావించినట్టు తాజాగా సమాచారం బయటికి వచ్చింది. టికెట్ ధరల వివరాలు కూడా వెల్లడయ్యాయి.
టికెట్ రేట్స్ ఇవే
బడ్డీ సినిమా టికెట్ల ధరలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తక్కువగానే ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్‍లలో టికెట్ ధర రూ.99, మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రేటు రూ.125గా ఉండనున్నట్టు తెలుస్తోంది.
బడ్డీ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూసేలా మూవీ టీమ్ ఈ వ్యూహం పాటిస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం పిల్లలను ఎక్కువగా అలరించేలా ఉంటుందని టాక్. అందుకే ధరలను తక్కువగా ఉంచితే అధిక సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఎక్కువ మంది చూస్తే మౌత్ టాక్ కూడా బాగుంటుంది. పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మంచి కలెక్షన్లు దక్కించుకునే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నట్టు అంచనా.
బడ్డీ మూవీ రన్‍టైమ్
బడ్డీ సినిమా క్రిస్ప్ రన్‍టైమ్‍తో రానుంది. సుమారు 2 గంటల 10 నిమిషాల రన్‍టైమ్‍తో ఈ చిత్రం రానుంది. ఈ విషయాన్ని హీరో అల్లు శిరీష్.. ఓ ప్రీమియర్ షో సందర్భంగా వెల్లడించారు. ముందుగా రెండున్నర గంటల నిడివితో ఈ చిత్రం ఉండగా.. ఆ తర్వాత తగ్గించినట్టు చెప్పారు. “సినిమా చూసిన తర్వాత, రన్‍టైమ్ ఇంకా తగ్గించేందుకు అవకాశం ఉందని నాకు అనిపించింది. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం. ఇది చేశాక రన్‍టైమ్ రెండు గంటల 10 నిమిషాలకు తగ్గుతుంది” అని శిరీష్ అన్నారు.
బడ్డీ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సెన్సార్ సర్టిఫికేట్‍లో ఈ చిత్రం రన్‍టైమ్ 2 గంటల 17 నిమిషాలుగా ఉంది.
ఊర్వశివో రాక్షసివో మూవీ తర్వాత అల్లు శిరీష్ కాస్త గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ రెండేళ్ల తర్వాత బడ్డీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అడుగుపెడుతున్నారు. ప్రీమియర్ షోలకు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ వీడియోలను కూడా శిరీష్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మొత్తంగా బడ్డీ చిత్రంపై ఆయన చాలా నమ్మకంతో ఉన్నారు. ఆగస్టు 2న ఈ మూవీ విడుదల కానుంది.
బడ్డీ సినిమాకు సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. అల్లు శిరీష్‍తో పాటు అజ్మల్ అమీర్, ప్రిష రాజేశ్ సింగ్, ముకేశ్ కుమార్, మహమ్మద్ అలీ కీలకపాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా, ఆరాధాన జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. హిప్‍హప్ తమిళ సంగీతం అందించారు.