Urvashivo Rakshasivo Success Meet: ఊర్వశివో రాక్షసివో సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ కంటతడి
Urvasivo Rakshasivo Success Meet: ఊర్వశివో రాక్షసివో సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ కంటతడి పెట్టాడు. తమ్ముడి మూవీ సక్సెస్ కావడంతో భావోద్వేగానికి గురయ్యాడు. మూవీ సక్సెస్ మీట్‌లో అన్నదమ్ములిద్దరూ హంగామా చేశారు.
(1 / 7)
Urvashivo Rakshasivo Success Meet: ఊర్వశివో రాక్షసివో సక్సెస్ మీట్‌లో తమ్ముడు అల్లు శిరీష్‌ను గట్టిగా వాటేసుకున్న అల్లు అర్జున్. తన ఇద్దరు తనయులను చూసి తండ్రి అల్లు అరవింద్ తెగ ఆనందపడిపోయాడు.
(2 / 7)
Urvashivo Rakshasivo Success Meet: ఊర్వశివో రాక్షసివో అంచనాలను మించి సక్సెస్ కావడంతో ఈ మూవీ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్‌ను అభినందించాడు అల్లు అర్జున్. ఈ సందర్బంగా ఆమె కాస్త సిగ్గు పడుతూ థ్యాంక్స్ చెప్పింది.
(3 / 7)
Urvashivo Rakshasivo Success Meet: ఈ మూవీ సక్సెస్ మీట్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఇక మూవీ టీమ్ మొత్తం కూడా ఈ సక్సెస్ మీట్‌లో పాలుపంచుకుంది.
(4 / 7)
Urvashivo Rakshasivo Success Meet: అల్లు బ్రదర్స్ మధ్య అనుబంధం చూసి ఫ్యాన్స్ మెస్మరైజ్ అయ్యారు. ఈ సక్సెస్ మీట్‌లో ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. సినిమాను పెద్ద హిట్ చేసిన అభిమానులకు అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పాడు. తమ కుటుంబానికి ఇది ఎంతో ముఖ్యమై, ప్రత్యేకమైన సినిమా అని అన్నాడు. తన తమ్ముడు శిరీష్ మూవీ సక్సెస్‌లతో సంబంధం లేకుండా ఎప్పుడూ శిరీష్‌లాగే ఉంటాడని కూడా చెప్పాడు.
(5 / 7)
Urvashivo Rakshasivo Success Meet: మూవీ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్‌తో అల్లు అర్జున్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమెతో అల్లు శిరీష్ డేటింగ్ వార్తల నేపథ్యంలో ఈ ఫొటోలు స్పెషల్‌గా నిలుస్తున్నాయి.
(6 / 7)
Urvashivo Rakshasivo Success Meet: ఇక తన ఇద్దరు తనయులను చూసి ఎంతో ముచ్చటపడిపోయాడు అల్లు అరవింద్. ఇప్పటికే పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడని, ఇటు అల్లు శిరీష్‌కు కూడా సక్సెస్ రావడం ఆనందంగా ఉందని అల్లు అరవింద్ అన్నాడు. ఈ సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్‌ను చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
(7 / 7)
Urvashivo Rakshasivo Success Meet: ఊర్వశివో రాక్షసివో సక్సెస్ మీట్‌లో అనూ ఇమ్మాన్యుయేల్ కూడా స్పెషల్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సినిమాలో అల్లు శిరీష్‌తో కలిసి ఆమె చాలా బోల్డ్ సీన్లలో నటించింది.
ఇతర గ్యాలరీలు