Allu Sirish: హీరో అల్లు శిరీష్‌ను కెప్టెన్ అంటాను.. అతని కెరీర్‌లో ఇదే బెస్ట్ మూవీ: రైటర్ సాయి హేమంత్
Writer Sai Hemanth About Allu Sirish Buddy Trailer Launch: హీరో అల్లు శిరీష్‌ను తాను కెప్టెన్ అని పిలుస్తానని రైటర్ సాయి హేమంత్ తెలిపారు. బడ్డీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అల్లు శిరీష్‌పై రైటర్ సాయి హేమంత్ వ్యాఖ్యలు చేశారు.
Allu Sirish Buddy Writer Sai Hemanth: అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన బడ్డీ సినిమా జూలై 26న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల బడ్డీ ట్రైలర్ విడుదల చేయడంతోపాటు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైటర్ సాయి హేమంత్‌తోపాటు పలువురు తమ అభిప్రాయాలు చెప్పారు.
"బడ్డీ సినిమాకు వర్క్ చేయడం కష్టంగానే అనిపించింది. ఎడిటింగ్ టేబుల్‌పై నేను దర్శకుడు శామ్ రోజూ డిస్కస్ చేసుకునేవాళ్లం. ఇదొక డిఫరెంట్ మూవీ. బడ్డీ లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాలో మంచి కాస్టింగ్ ఉంది. వాళ్లతో పాటు మూవీలో బడ్డీది ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇలాంటి కొత్త తరహా సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారికి అభినందనలు. మా మూవీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. తప్పకుండా థియేటర్స్‌లో చూడండి" అని ఎడిటర్ రూబెన్ తెలిపారు.
"నేను చిన్నప్పుడు యముడు, నా పేరు శివ సినిమాల్లో కేఈ జ్ఞానవేల్ రాజా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అని చూసేవాడిని. ఇదేదో కొత్తగా ఉందని అనిపించేది. ఇవాళ ఆయన తెలుగులో ప్రొడ్యూస్ చేసిన సినిమాకు నేను రైటర్‌ను కావడం నాకు గర్వంగా ఉంది" అని బడ్డీ మూవీ రైటర్ సాయి హేమంత్ చెప్పారు.
"ఈ సినిమాలో గుర్తుండే డైలాగ్స్ చాలా ఉన్నాయి. బడ్డీ చెప్పే ప్రతి డైలాగ్ పంచ్‌లా పేలుతుంది. డైరెక్టర్ శామ్ గారు మరిన్ని తెలుగు సినిమాలు చేయాలి. ఆ సినిమాలకు నేను వర్క్ చేయాలని కోరుకుంటున్నా. మా శిరీష్ గారిని కెప్టెన్ అని పిలుస్తాను. ఆయన కెరీర్‌లో టిల్ డేట్ ది బెస్ట్ మూవీ బడ్డీ అని చెప్పగలను" అని సాయి హేమంత్ అన్నారు.
"బడ్డీ సినిమా కథను దర్శకుడు శామ్ చెప్పినప్పుడే ఇదొక స్పెషల్ ఫిల్మ్ అవుతుందని నమ్మాను. ఈ కథ వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియెన్స్ రీచ్ అయ్యేలా ఉంటుంది. డైరెక్టర్ శామ్, రైటర్ హేమంత్ కలిసి మరింత ఇంట్రెస్టింగ్‌గా స్క్రిప్ట్ చేశారు. పిల్లలు పెద్దలు యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అల్లు శిరీష్ మంచి కోస్టార్. ఆయన నుంచి యాక్టింగ్ పరంగా చాలా విషయాలు నేర్చుకున్నాను" అని హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ తెలిపారు.
"బడ్డీ సినిమా ట్రైలర్‌ను మీ అందరి ముందు రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి వర్క్ చేయడం మా అందరికీ కొత్త ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. బడ్డీ సినిమా యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుంది. బడ్డీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఊహించుకుంటూ విజువల్స్ క్యాప్చర్ చేశారు. విజువల్ ఎఫెక్టుల ప్రాధాన్యత ఉండే చిత్రమిది. ప్రేక్షకులకు బడ్డీ సినిమా న్యూ ఫీల్ కలిగిస్తుంది" అని సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ అన్నారు.