Vijay Deverakonda: వారిద్దరి కోసమే కల్కి సినిమాలో క్యారెక్టర్ చేశా: విజయ్ దేవరకొండ-i done the role in kalki 2898 ad film for prabhas and nag ashwin says vijay deverakonda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: వారిద్దరి కోసమే కల్కి సినిమాలో క్యారెక్టర్ చేశా: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: వారిద్దరి కోసమే కల్కి సినిమాలో క్యారెక్టర్ చేశా: విజయ్ దేవరకొండ

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 30, 2024 10:54 PM IST

Vijay Deverakonda on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ క్యామియో రోల్ చేశారు. అర్జునుడి పాత్రలో కనిపించారు. ఇది హాట్‍టాపిక్‍గా మారింది. అయితే, కల్కి మూవీలో ఎవరి కోసం నటించారో తాజాగా వెల్లడించారు విజయ్ దేవరకొండ.

Vijay Deverakonda: వారిద్దరి కోసమే కల్కి సినిమాలో క్యారెక్టర్ చేశా: విజయ్ దేవరకొండ
Vijay Deverakonda: వారిద్దరి కోసమే కల్కి సినిమాలో క్యారెక్టర్ చేశా: విజయ్ దేవరకొండ

ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేసిన క్యామియో రోల్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో విజయ్ సుమారు రెండు నిమిషాల పాటు కనిపించారు. ఈ సినిమాలో అర్జునుడి పాత్రను విజయ్ దేవరకొండ పోషించారు. అర్జునుడిగా అతడి ఆహార్యం బాగా సూటైంది. అయితే, కొందరు ఈ విషయంపై ట్రోల్స్ కూడా చేశారు. అయితే, తాను కల్కి 2898 ఏడీ చిత్రంలో ఎవరి కోసం ఆ క్యారెక్టర్ చేశానో విజయ్ దేవరకొండ నేడు (జూన్ 30) వెల్లడించారు.

వారిద్దరి కోసం..

హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కోసం కల్కి 2898 ఏడీ సినిమాలో అర్జునుడి పాత్ర చేశానని విజయ్ దేవరకొండ చెప్పారు. నేడు ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. “చాలా ఎపిక్ సినిమా. నేను నిన్ననే చూశా. చాలా ఎమోషనల్‍గా అనిపించింది. మన తెలుగు సినిమా.. మన ఇండియన్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాం. నేను నాగీ (నాగ్ అశ్విన్) గురించి, ప్రభాస్ అన్న గురించి ఆ పాత్ర చేశా. ఇలాంటి సినిమాలో చివర్లో అలా రావడం చాలా సంతోషం, తృప్తిగా ఉంది” అని విజయ్ దేవరకొండ చెప్పారు.

అది ప్రభాస్.. నేను కాదు

ప్రభాస్‍ను ఓడించే పాత్రను కల్కి 2898 ఏడీ చిత్రంలో చేశారని ఎదురైన ప్రశ్నకు విజయ్ దేవరకొండ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. అక్కడ ఉన్నది ప్రభాస్ తాను కాదని.. కర్ణుడు, అర్జునుడు అని అన్నారు. “నా ప్రకారం ఇది ప్రభాస్, నేను కాదు.. కర్ణుడు.. అర్జునుడు. నాగీ యూనివర్స్ లో ఓ పాత్ర పోషిస్తున్నాం. మేమంతా మనుషులమే. నాకు వారు చాలా ఇష్టమైన వారు. ప్రభాస్, నాగీ, అమితాబ్ బచ్చన్, దీపికా నాకు చాలా ఫేవరేట్” అని విజయ్ దేవరకొండ అన్నారు. వైజయంతీ మూవీస్‍తో తన కెరీర్ మొదలైందని, ఇలాంటి సినిమాలో చిన్న రోల్ చేయడం సంతోషమని చెప్పారు.

నాగ్ అశ్విన్ ప్రతీ సినిమాలో తాను చేస్తుంటానని విజయ్ దేవరకొండ అన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రమణ్యం, మహానటిలో నటించిన విజయ్ ఇప్పుడు కల్కి 2898 ఏడీలోనూ కనిపించారు. దీంతో నాగీకి లక్కీ చాంప్ అని అందరూ అనుకుంటున్నారని ప్రశ్న ఎదురైంది. అయితే, సినిమాలు బాగున్నాయి కాబట్టి నడుస్తున్నాయని, తాను ఉన్నానని కాదని విజయ్ దేవరకొండ అన్నారు.

కల్కి కలెక్షన్ల హోరు

కల్కి 2898 ఏడీ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 27వ తేదీన రిలీజ్ అయింది. అదే రేంజ్‍లో కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ చిత్రానికి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.415 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. మరొక్క రోజులో రూ.500 కోట్ల మార్కును ఈ సినిమా దాటనుంది. అద్బుతమైన విజువల్స్‌తో పురాణాల ఆధారంగా తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ టేకింగ్‍, విజువల్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్‍తో ప్రొడ్యూజ్ చేసింది.

Whats_app_banner