OTT Psychological Thriller: పాపులర్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్‍కు రెండో సీజన్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులోనూ..
OTT Psychological Thriller: మిథ్య వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. ట్రైలర్‌తో పాటు స్ట్రీమింగ్ డేట్ వెల్లడైంది. తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమ్ అవనుంది.
హుమా ఖురేషి ప్రధాన పాత్ర పోషించిన ‘మిథ్య’ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ సాధించింది. 2022 ఫిబ్రవరిలో వచ్చిన ఈ సిరీస్‍కు వ్యూస్ భారీగానే దక్కాయి. ఈ సిరీస్ పాపులర్ అయింది. ఇప్పుడు, ఈ మిథ్య సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది. ‘మిథ్య: ది డార్కర్ చాప్టర్’ పేరుతో ఈ సిరీస్‍కు రెండో సీజన్ రానుంది. ఈ సీజన్ ట్రైలర్‌ను నేడు (అక్టోబర్ 21) జీ5 ఓటీటీ తీసుకొచ్చింది. స్ట్రీమింగ్ డేట్‍ను కూడా ఖరారు చేసింది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
‘మిథ్య: ది డార్కర్ చాప్టర్’ వెబ్ సిరీస్ నవంబర్ 1వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (అక్టోబర్ 21) వెల్లడించింది. గతంలోని రహస్యాలు ఇప్పుడు వెంటాడితే ఏం జరుగుతుంది అంటూ ఈ సీజన్ ట్రైలర్ తీసుకొచ్చింది జీ5 ఓటీటీ.
మిథ్య: ది డార్కర్ చాప్టర్ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. ట్రైలర్‌ను ఇప్పటికి హిందీలో తీసుకొచ్చింది జీ5 ఓటీటీ. అయితే, ఈ సీజన్ మూడు భాషల్లో నవంబర్ 1న స్ట్రీమింగ్‍కు రానున్నట్టు ప్లాట్‍ఫామ్‍లో కన్ఫర్మ్ చేసింది.
‘మిథ్య: ది డార్కర్ చాప్టర్’ వెబ్ సిరీస్‍లో జుహి అధికారి అనే ప్రోఫెసర్ పాత్రను హుమా ఖురేషి పోషించారు. అవంతిక దసానీ, నవీన్ కుస్తూరియా, రజిత్ కపూర్, ఇంద్రీనిల్ సెంగుప్తా, అనిందితా బోస్, రుషాద్ రాణా, అవంతిక అకేర్కర్, కృష్ణ బిస్త్ ఈ సీజన్‍లో కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‍కు కపిల్ శర్మ దర్శకత్వం వహించారు.
జూహి (హుమా ఖురేషి), రియా (అవంతిక దసానీ) మధ్య రివేంజ్ డ్రామాగా ‘మిథ్య: ది డార్కర్ చాప్టర్’ ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. జూహిని దెబ్బతీసేందుకు రియా ప్రయత్నిస్తుంటారు. అడ్డుకునేందుకు జూహి ట్రై చేస్తుంటారు. అబద్ధాలు, మోసం, రివేంజ్‍తో ఈ సిరీస్ సాగుతుందని ట్రైలర్లో ఉంది. ఇలా ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
ఐంధమ్ వేదం సిరీస్ ఈ వారమే..
జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ‘ఐంధమ్ వేదం’ ఈ వారమే అక్టోబర్ 25వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగులోనూ అందుబాటులోకి వస్తుంది. ఈ సిరీస్‍లో సాయి ధన్సిక, సంతోశ్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వైజీ మహేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‍కు నాగరాజన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ ఐంధమ్ వేదం సిరీస్‍ను అక్టోబర్ 25 నుంచి జీ5లో చూడొచ్చు.