Huma Qureshi: సోనాక్షి సిన్హా పెళ్లిలో బాయ్‍ఫ్రెండ్‍తో సందడి చేసిన హుమా ఖురేషి.. అతడు ఎవరో తెలుసా!-huma qureshi attends sonakshi sinha zaheer iqbal wedding with rumoured boyfriend rachit singh know who he is ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Huma Qureshi: సోనాక్షి సిన్హా పెళ్లిలో బాయ్‍ఫ్రెండ్‍తో సందడి చేసిన హుమా ఖురేషి.. అతడు ఎవరో తెలుసా!

Huma Qureshi: సోనాక్షి సిన్హా పెళ్లిలో బాయ్‍ఫ్రెండ్‍తో సందడి చేసిన హుమా ఖురేషి.. అతడు ఎవరో తెలుసా!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 24, 2024 10:57 PM IST

Sonakshi Sinha Wedding - Huma Qureshi: సోనాక్షి సిన్హా పెళ్లిలో తన బాయ్‍ఫ్రెండ్‍తో సందడి చేశారు బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి. కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు వైరల్‍గా మారాయి.

Huma Qureshi: సోనాక్షి సిన్హా పెళ్లిలో బాయ్‍ఫ్రెండ్‍తో సందడి చేసిన హుమా ఖురేషి.. అతడు ఎవరో తెలుసా!
Huma Qureshi: సోనాక్షి సిన్హా పెళ్లిలో బాయ్‍ఫ్రెండ్‍తో సందడి చేసిన హుమా ఖురేషి.. అతడు ఎవరో తెలుసా!

Sonakshi Sinha Wedding - Huma Qureshi: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, సినీ రచయిత జహీర్ ఇక్బాల్ వివాహం చేసుకున్నారు. ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న వీరు ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి వివాహం ముంబైలో ఆదివారం (జూన్ 23) జరిగింది. అయితే, క్రమంగా ఫొటోలు బయటికి వస్తున్నాయి. ముందుగా సోనాక్షి, జహీర్ తమ వివాహన్ని రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత ముంబైలోని ఇంట్లో వివాహ వేడుక జరిగింది. అనంతరం బాస్టియన్ రెస్టారెంట్‍లో బాలీవుడ్ సెలెబ్రిటీలకు సోనాక్షి సిన్హా, జహీర్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇచ్చారు. దీనికి చాలా మంది స్టార్లు హాజరయ్యారు. అయితే, బాలీవుడ్ నటి హుమా ఖురేషి హైలైట్ అయ్యారు.

బాయ్‍ఫ్రెండ్‍తో హుమా

సోనాక్షి సిన్హా వెడ్డింగ్ పార్టీకి హుమా ఖురేషి హాజరయ్యారు. రచిత్ సింగ్‍తో కలిసి సందడి చేశారు. హుమా - రచిత్ ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. రచిత్‍తో హుమా డేటింగ్ చేస్తున్నారంటూ ఏడాది నుంచి రూమర్లు ఉన్నాయి. సోనాక్షి పెళ్లిలో రచిత్‍తో దిగిన ఫొటోలను కూడా హుమా ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఎవరీ రచిత్?

యాక్టింగ్ కోచ్‍గా రచిత్ సింగ్ పని చేస్తున్నారు. నటీనటులకు అవసరానికి తగ్గట్టు యాక్టింగ్‍లో శిక్షణ ఇస్తుంటారు. ఆలియా భట్, రణ్‍వీర్ సింగ్, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, అనుష్క శర్మ, సైఫ్ అలీ ఖాన్‍లకు యాక్టింగ్ కోచ్‍గా రచిత్ చేశారని తెలుస్తోంది. వేదాంత్, రవీనా టాండన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘కర్మ కాలింగ్’ వెబ్ సిరీస్‍లోనూ రచిత్ సింగ్ నటించారు. ఈ ఏడాది మొదట్లోనే ఈ సిరీస్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చింది.

హుమా ఖురేషి - రచిత్ సింగ్ ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నారనే రూమర్లు వస్తున్నాయి. అయితే, దీనిపై ఆ ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు. అయితే, కొన్ని పార్టీల్లో కలిసి కనిపించారు. ఇప్పుడు సోనాక్షి సిన్హా పెళ్లిలో సందడి చేశారు.

హుమా సోదరుడు షకీబ్ సలీమ్‍తోనూ రచిత్ చాలా క్లోజ్‍గా కనిపించారు. రచిత్, హుమాతో తాను ఉన్న ఫొటోలను సలీమ్ కూడా షేర్ చేశారు. రచిత్ కూడా ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేశారు. మొత్తంగా సోనాక్షి సిన్హా పెళ్లిలో హుమా - రచిత్ హైలైట్ అయ్యారు.

హుమా ఖురేషి అంతకు ముందు డైరెక్టర్, స్క్రీన్ రైటర్ ముదాసర్ అజీజ్‍తో డేటింగ్ చేశారు. సుమారు మూడేళ్ల ప్రేమ తర్వాత 2022 అక్టోబర్‌లో వాళ్లిద్దరూ విడిపోయారు. ఇప్పుడు రచిత్‍తో హుమా ప్రేమలో ఉన్నారనే రూమర్లు వస్తున్నాయి.

సోనాక్షి - జహీర్ పెళ్లి

ఏడేళ్ల ప్రేమ తర్వాత తాము వివాహంతో ఒక్కటయ్యామని సోనాక్షి సిన్హా ఇన్‍స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. జహీర్ ఇక్బాల్‍తో పెళ్లి ఫొటోలను పోస్ట్ చేశారు. అయితే, ఈ పెళ్లికి తొలుత సోనాక్షి తండ్రి, ఎంపీ శత్రుఘ్న సిన్హా అంగీకరించలేదనే సమాచారం బయటికి వచ్చింది. అయితే, సోనాక్షి నిర్ణయించుకోవడంతో ఆయన కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. అయితే, వివాహ వేడుకలో శత్రుఘ్న సిన్హా అంత చురుగ్గా, ఆనందంగా పాల్గొనలేదని రూమర్లు బయటికి వచ్చాయి.

Whats_app_banner