Sonakshi Sinha Wedding: ట్రోలింగ్.. పెళ్లి ఫొటోలకు కామెంట్లు డిసేబుల్ చేసిన హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్-sonakshi sinha and zaheer iqbal disable comments for wedding photos on instagram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sonakshi Sinha Wedding: ట్రోలింగ్.. పెళ్లి ఫొటోలకు కామెంట్లు డిసేబుల్ చేసిన హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్

Sonakshi Sinha Wedding: ట్రోలింగ్.. పెళ్లి ఫొటోలకు కామెంట్లు డిసేబుల్ చేసిన హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్

Chatakonda Krishna Prakash HT Telugu
Published Jun 24, 2024 04:36 PM IST

Sonakshi Sinha Wedding: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహం చేసుకున్నారు. జహీర్ ఇక్బాల్‍ను ఆమె పెళ్లాడారు. అయితే, వీరి పెళ్లిపై కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Sonakshi Sinha Wedding: పెళ్లి ఫొటోలకు కామెంట్లు డిసేబుల్ చేసిన హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్
Sonakshi Sinha Wedding: పెళ్లి ఫొటోలకు కామెంట్లు డిసేబుల్ చేసిన హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్

Sonakshi Sinha Wedding: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, రైటర్ జహీర్ ఇక్బాల్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సుమారు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న ఇద్దరూ ఆదివారం (జూన్ 24) ముంబైలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫొటోలను సోనాక్షి, జహీర్ ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేసినా.. ఎవరూ కామెంట్ చేయకుండా డిసేబుల్ చేశారు.

సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ మతాలు వేరుకావటంతో తొలుత కుటుంబ పెద్దలు కూడా పెళ్లికి విముఖత వ్యక్తం చేశారని సమాచారం బయటికి వచ్చింది. సోనాక్షి తండ్రి, ఎంపీ శత్రుఘ్న సిన్హా ముందుగా పెళ్లికి నిరాకరించినా.. ఆ తర్వాత అంగీకరించారని తెలుస్తోంది. అయితే, పెళ్లి వేడుకల్లోనూ ఆయన సంతోషంగా కనిపించలేదని సమాచారం.

ట్రోలింగ్ నుంచి తప్పించుకునేందుకు..

సోనాక్షి, జహీర్ వివాహంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వారి మతాలు వేరుకావడంతో ఈ విషయంపై కొందరు కామెంట్లు చేశారు. దీంతో ఈ సంతోషకర సమయంలో ట్రోలింగ్ ఎక్కువ కాకుండా తమ పెళ్లి ఫొటోలకు ఇన్‍స్టాగ్రామ్‍లో కామెంట్లు డిసేబుల్ చేశారు సోనాక్షి, జహీర్. అలాగే, క్యాప్షన్‍తో ట్రోలర్లకు సమాధానం చెప్పారు.

తమ పెళ్లి ఇరు కుటుంబాలు.. మా ఇద్దరి దేవుళ్ల ఆశీర్వాదాలతో జరిగిందని సోనాక్షి సిన్హా తన ఇన్‍స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. దీంతో ట్రోల్ చేస్తున్న వారికి గట్టి సమాధానం చెప్పారు. అయితే, శుభవార్త చెప్పేందుకు పోస్ట్ చేసిన ఫొటోలకు నెగెటివ్ కామెంట్లు రాకూడదనే ఉద్దేశ్యంతో డిసేబుల్ చేశారు. అయితే, కొందరు నెటిజన్లు అంతకు ముందు వేరే ఫొటోలకు ఈ పెళ్లికి సంబంధించిన కామెంట్లు చేస్తున్నారు.

ఏడేళ్ల క్రితం కలిశాం

పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ తమ బంధం గురించి సోనాక్షి, జహీర్ రాసుకొచ్చారు. “ఏడేళ్ల క్రితం (23.06.2017) ఇదే రోజు ఒకరి కళ్లలోకి ఒకరం చూసుకున్నాం. స్వచ్ఛమైన ప్రేమను చూశాం. దానితోనూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. అన్ని సవాళ్లను, అడ్డంకులను ఆ ప్రేమ ఇప్పుడు అధిగమించేలా చేసింది. మా ఇద్దరి కుటుంబాలు, ఇద్దరి దేవుళ్ల ఆశీర్వాదాలతో మేం ఇప్పుడు భార్య, భర్తలం అయ్యాం. మా ఇద్దరి మధ్య అన్నీ అందంగా ఉంటాయని మేం ఆశిస్తున్నాం” అని సోనాక్షి సిన్హా పోస్ట్ చేశారు. లవ్ సింబల్‍తో పాటు పెళ్లి అయిన 23.06.2024ని కూడా పేర్కొన్నారు.

హాజరైన సెలెబ్రెటీలు

ముంబైలోని బాంద్రాలోని ఇంట్లోనే సోనాక్షి, జహీర్ వివాహం జరిగింది. సోనాక్షి తల్లిదండ్రులు శత్రుజ్ఞ, పూనమ్ సిన్హాకు ఈ పెళ్లి పూర్తిగా ఇష్టం లేకపోయినా హాజరై వారిని ఆశీర్వదించారు. పెళ్లికి సోనాక్షి తెల్ల చీరను ధరించగా.. జహీర్ వైట్ ఇవోరీ షేర్వాణీ వేసుకున్నారు.

పెళ్లి తర్వాత ముంబైలోని ఓ బడా రెస్టారెంట్‍లో బాలీవుడ్ సెలెబ్రిటీలు, సన్నిహితులకు సోనాక్షి పార్టీ రిసెప్షన్ పార్టీ ఇచ్చారు. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, రేఖ, విద్యాబాలన్, అదితి రావ్ హైదరీ, యోయో హనీ సింగ్, కాజోల్‍, రవీనా టాండన్‍తో పాటు మరికొందరు బాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. ఫుల్ జోష్‍గా ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Whats_app_banner