Director Atlee: అల్లు అర్జున్‍తో క్యాన్సిల్ అయిన సినిమాను ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో చేయనున్న అట్లీ!-salmaan khan reportedly gives green signal to director atlee for next movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Director Atlee: అల్లు అర్జున్‍తో క్యాన్సిల్ అయిన సినిమాను ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో చేయనున్న అట్లీ!

Director Atlee: అల్లు అర్జున్‍తో క్యాన్సిల్ అయిన సినిమాను ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో చేయనున్న అట్లీ!

Director Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍తో అట్లీ చేయాలనుకున్న సినిమా రద్దయిందని సమాచారం బయటికి వచ్చింది. అయితే, ఇప్పుడు అదే కథకు ఓ బాలీవుడ్ స్టార్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

Director Atlee: అల్లు అర్జున్‍తో క్యాన్సిల్ అయిన సినిమాను ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో చేయనున్న అట్లీ?

Director Atlee: జవాన్ సినిమాతో బాలీవుడ్‍లో తమిళ డైరెక్టర్ అట్లీకి సూపర్ క్రేజ్ వచ్చింది. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కించిన జవాన్ చిత్రం సుమారు రూ.1100 కోట్లను కలెక్ట్ చేసి బంపర్ బ్లాక్‍బస్టర్ అయింది. దీంతో బాలీవుడ్‍లో ఎంట్రీతోనే అట్లీ పాపులర్ అయ్యారు. దీంతో అతడితో పని చేసేందుకు బాలీవుడ్ బడా స్టార్లు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍తో అట్లీ చేయాల్సిన సినిమా రద్దయిందని సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీని బాలీవుడ్‍ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‍తో అట్లీ చేయనున్నాడనే సమాచారం బయటికి వచ్చింది. ఆ డీటైల్స్ ఇవే.

సల్మాన్ ఓకే చెప్పేశారట!

అల్లు అర్జున్‍తో సినిమా రద్దవటంతో ఆ కథను సల్మాన్ ఖాన్‍కు అట్లీ చెప్పారని తెలుస్తోంది. ఈ స్టోరీ నచ్చడంతో సల్లూ భాయ్ కూడా ఓకే చెప్పేశారట. దీంతో త్వరలోనే సల్మాన్ - అట్లీ సినిమాపై ప్రకటన రానుందని సినీ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది.

సల్మాన్ ఖాన్ - అట్లీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంపై చర్చలు సాగుతున్నాయని సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చు. దీని కోసం సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అల్లు - అట్లీ మూవీ రద్దు ఇందుకేనా?

అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో సినిమా కోసం చర్చలు జోరుగా సాగాయి. త్వరలో ప్రకటన కూడా చేయాలనే ఆలోచన చేశారు. అయితే, అట్లీ భారీ స్థాయిలో సుమారు రూ.100కోట్ల వరకు రెమ్యూనరేషన్ అడిగారట. దీంతో రిస్క్ అనుకొని గీతా ఆర్ట్స్ ఈ సినిమాను వద్దనుకుందని టాక్ నడుస్తోంది. అట్లీ చెప్పిన కథ అల్లు అర్జున్‍కు పూర్తి స్థాయిలో కూడా నచ్చలేదని ఇన్‍సైడ్ టాక్.

అల్లు అర్జున్‍తో రద్దయిన సినిమాను సల్మాన్‍కు నరేట్ చేసి అట్లీ ఓకే చెప్పించుకున్నారట. దీనిపై ప్రకటన ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

మురుగదాస్‍తో సల్మాన్

తమిళ స్టార్ దర్శకుడు మురుగదాస్‍తో ప్రస్తుతం సికిందర్ సినిమా చేస్తున్నారు సల్మాన్ ఖాన్. ఈ సినిమాపై ఇటీవలే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. యానిమల్ చిత్రంతో గతేడాది బాలీవుడ్‍లో భారీ బ్లాక్‍బస్టర్ అందుకున్న రష్మిక.. సల్మాన్‍తో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. అయితే, సల్మాన్ (58), రష్మిక (28) మధ్య 30 ఏళ్ల గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో చర్చ జోరుగానే సాగింది.

సికిందర్ చిత్రాన్ని సాజిద్ నడివద్‍వాలా నిర్మిస్తున్నారు. ఈ మూవీని 2025 ఈద్‍కు రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ఇప్పటికే ఖరారు చేసింది. అయితే, ఇప్పుడు అట్లీ మూవీకి కూడా సల్మాన్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో వరుసగా రెండు చిత్రాలను తమిళ డైరెక్టర్లతోనే సల్లూ భాయ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే సికిందర్ షూటింగ్ ఫినిష్ అయిన వెంటనే.. అట్లీతో మూవీని సల్మాన్ చేసే అవకాశాలు ఉన్నాయి.