Salman Khan: కొత్త సినిమాను ప్రకటించిన సల్మాన్ ఖాన్.. దక్షిణాది స్టార్ దర్శకుడితో.. రిలీజ్ ఎప్పుడంటే..!
Salman Khan - AR Murugadoss: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‍తో చిత్రం చేయనున్నట్టు వెల్లడించారు. ఎప్పుడు రిలీజ్ ప్లానింగ్‍ను కూడా చెప్పేశారు.
Salman Khan: బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 చిత్రం గతేడాది నవంబర్‌లో విడుదలై మోస్తరు హిట్ అయింది. కత్రీనా కైఫ్ హీరోయిన్‍గా నటించిన ఆ చిత్రానికి మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు. అలాగే, టైగర్ వర్సెస్ పఠాన్ చిత్రంలో షారూఖ్ ఖాన్‍తో కలిసి సల్మాన్ నటించనున్నారు. అయితే, ఈ తరుణంలో తన తదుపరి మూవీని సల్మాన్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. తమిళ స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‍తో ఆయన సినిమా చేయనున్నారు.
ట్వీట్ చేసిన సల్మాన్
సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‍లో రానున్న ఈ చిత్రానికి సాజిద్ నడియడ్‍వాలా నిర్మాతగా వ్యహరించనున్నారు. సాజిద్ నిర్మాణంలో కిక్, జుడ్వా సహా మరిన్ని మూవీస్ చేశారు సల్లూ భాయ్. ఆయన దర్శకత్వంలో కిక్ మూవీలోనూ నటించారు. ఇప్పుడు మరోసారి ఆయన బ్యానర్‌లో సినిమా చేయనున్నారు సల్లూ భాయ్. ఈ కొత్త సినిమా గురించి సల్మాన్ ఖాన్ నేడు (మార్చి 12) ట్వీట్ చేశారు.
“అద్భుత టాలెంట్ ఉన్న ఏఆర్ మురుగదాస్, నా స్నేహితుడు సాజిద్ నడియడ్‍వాలాతో ఓ ఎగ్జైటింగ్ సినిమా కోసం కలిసి పని చేయనున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యం చాలా ప్రత్యేకమైనది. మీ ప్రేమ, ఆశీర్వాదంతో ఈ జర్నీ కోసం నేను వేచిచూస్తున్నా” అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు.
రిలీజ్ ప్లాన్
2025 ఈద్‍కు ఈ చిత్రం రిలీజ్ అవుతుందని సల్మాన్ ఖాన్ తెలిపారు. అంటే వచ్చే ఏడాది రంజాన్ సమయంలో ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు.
తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన ఏఆర్ మురుగదాస్.. ఆమిర్ ఖాన్‍తో గజినీ హిందీ రీమేక్ తర్వాత బాలీవుడ్‍లోనూ ఫేమస్ అయ్యారు. గజినీ మూవీ బాలీవుడ్‍లోనూ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మరో రెండు హిందీ చిత్రాలు కూడా చేశారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‍తో భారీ మూవీ చేయనున్నారు.
భారీ బడ్జెట్‍తో..
సల్మాన్ ఖాన్ - ఏఆర్ మురుగదాస్ కాంబోలో ఈ చిత్రం భారీ బడ్జెట్‍తో రూపొందనుందని తెలుస్తోంది. ఇండియాలోని కొన్ని లొకేషన్లతో పాటు పోర్చుగల్, యూరోపియన్ దేశాల్లో ఈ మూవీ షూటింగ్ జరగనుందని పింక్‍విల్లా రిపోర్ట్ వెల్లడించింది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‍తో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది తెరకెక్కుతుందని తెలుస్తోంది.
ఇది తనన కలల ప్రాజెక్ట్ అంటూ నిర్మాత సాజిద్ కూడా ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్‍తో సుదీర్ఘ కొనగిస్తూ.. ఎగ్జైటింగ్ సినిమాటిక్ జర్నీ కోసం ఏఆర్ మురుగదాస్‍తో జత కట్టామని ఆయన పేర్కొన్నారు. అయితే, సల్మాన్ - మురుగదాస్ చిత్రానికి కిక్-2 టైటిల్‍ను పరిశీలిస్తున్నట్టు రూమర్లు వస్తున్నాయి.
తమిళ దర్శకుడు అట్లీతో షారుఖ్ ఖాన్ గతేడాది జవాన్ చిత్రం చేశారు. అది బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు, సల్మాన్ ఖాన్.. ఏఆర్ మురుగదాస్‍తో సినిమా చేయనున్నారు. మరో తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‍కు కూడా సల్మాన్ ఓకే చెప్పినట్చు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తంగా బాలీవుడ్‍లో తమిళ డైరెక్టర్ల హవా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.
టాపిక్