Bold Movie OTT: ఓటీటీలో అద‌ర‌గొడుతోన్న తెలుగు బోల్డ్ మూవీ - 40 మిలియ‌న్ల వ్యూస్‌!-hebah patel telugu bold movie honeymoon express gets 40 million streaming minutes views on amazon prime ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bold Movie Ott: ఓటీటీలో అద‌ర‌గొడుతోన్న తెలుగు బోల్డ్ మూవీ - 40 మిలియ‌న్ల వ్యూస్‌!

Bold Movie OTT: ఓటీటీలో అద‌ర‌గొడుతోన్న తెలుగు బోల్డ్ మూవీ - 40 మిలియ‌న్ల వ్యూస్‌!

Nelki Naresh Kumar HT Telugu
Sep 15, 2024 07:35 PM IST

Bold Movie OTT: ఓటీటీలో తెలుగు బోల్డ్ మూవీ హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ అద‌ర‌గొడుతోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైన ఈ మూవీ న‌ల‌భై మిలియ‌న్ల స్ట్రీమింగ్ మిన‌ట్స్ వ్యూస్‌ను ద‌క్కించుకున్న‌ది. హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్‌లో చైత‌న్య‌రావు, హెబ్బాప‌టేల్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

బోల్డ్ మూవీ ఓటీటీ
బోల్డ్ మూవీ ఓటీటీ

Bold Movie OTT: ఓటీటీలో బోల్డ్‌, క్రైమ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్స్‌కు ఎక్కువ‌గా ఆద‌ర‌ణ ఉంటుంది. ఈ జాన‌ర్‌లో వ‌చ్చే సినిమాలే ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పిస్తూ హ‌య్యెస్ట్ వ్యూస్‌ను ద‌క్కించుకుంటుంటాయి. తెలుగు రీసెంట్‌ బోల్డ్ మూవీ హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ ఓటీటీలో దూసుకుపోతుంది.

నలభై మిలియన్ల వ్యూస్…

అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు 40 మిలియ‌న్ల స్ట్రీమింగ్ మిన‌ట్స్ వ్యూస్‌ను ద‌క్కించుకున్న‌ది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ట్రెండింగ్ మూవీస్‌లో ఒక‌టిగా హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ నిలిచింది. ఆగ‌స్ట్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ తెలుగు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రేమ‌, పెళ్లి...విడాకులు...

హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీలో చైత‌న్య‌రావు, హెబ్బా ప‌టేల్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి బాల రాజ‌శేఖ‌రుని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్రేమ, పెళ్లి, విడాకులు అనే అంశాల విష‌యంలో నేటియువ‌త‌రం ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి? శృంగార ప‌ర‌మైన అంశాల విష‌యంలో ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌ను బోల్డ్‌గా ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో చ‌ర్చించాడు. చిన్న చిన్న విష‌యాల‌కు గొడ‌వ‌లు ప‌డి విడిపోవ‌డం క‌రెక్ట్ కాద‌నే సందేశాన్ని ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో చూపించాడు.

హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీలో సుహాసిని మ‌ణిర‌త్నం త‌నికెళ్ల‌భ‌ర‌ణి, అర‌వింద్ కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు క‌ళ్యాణి మాలిక్, ఆర్‌పీ ప‌ట్నాయ‌క్ మ్యూజిక్ అందించారు.

హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ క‌థ ఏమిటంటే?

ఇషాన్ (చైత‌న్య‌రావు), సోనాలి (హెబ్బాప‌టేల్‌) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. భిన్న మ‌న‌స్త‌త్వాల కార‌ణంగా ఫ‌స్ట్ నైట్ రోజు నుంచే వీరిమ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. శృంగార జీవితాన్ని ఆనందించ‌లేక ఇబ్బందులు ప‌డుతుంటారు. హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే రిసార్ట్‌లోకి వెళితే త‌మ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని ఇషాన్‌, సోనాలిల‌కు తెలుస్తుంది.

ఆ రిసార్ట్‌లోకి అడుగుపెట్టిన వారికి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఇషాన్‌, సోనాలి మ‌ధ్య ఉన్నస‌మ‌స్య‌లు నెల‌కొన‌డానికి కార‌ణం ఏమిటి? అక్క‌డ వారికి ప‌రిచ‌య‌మైన వృద్ధ జంట (సుహాసిని, త‌నికెళ్ల‌భ‌ర‌ణి) ఎవ‌రు? అన్న‌దే హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ క‌థ‌. ఈ సినిమాలో త‌మ కెమిస్ట్రీతో చైత‌న్య‌రావు, హెబ్బాప‌టేల్ ఆక‌ట్టుకున్నారు.రొమాంటిక్ అంశాల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త‌నిస్తూ ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు.

ఓదెల 2 మూవీ..

స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా గ‌త కొన్నేళ్లుగా తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది హెబ్బా ప‌టేల్‌. ఈ ఏడాది హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు వేయ్ ద‌రువేయ్ సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం ఓదెల 2తో పాటు ధూమ్‌ధామ్ సినిమాలు చేస్తోంది. ఓదెల 2 మూవీలో త‌మ‌న్నా మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. త‌మిళంలో వ‌ల్ల‌న్‌, ఆద్య సినిమాలు చేస్తోంది.