Kalki vs Raayan OTT: ఓటీటీలో ప్రభాస్‌ను దాటేసిన ధనుష్ - అమెజాన్ ప్రైమ్‌లో రాయన్ నంబర్‌వన్
Kalki vs Raayan OTT: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రభాస్ కల్కిని ధనుష్ రాయన్ దాటేసింది. నేషనల్ వైడ్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో రాయన్ ఫస్ట్ ప్లేస్‌లోనిలవగా ప్రభాస్ కల్కి రెండో స్థానంలో కొనసాగుతోంది.
Kalki vs Raayan OTT: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రభాస్ కల్కిని ధనుష్ రాయన్ మూవీ దాటేసింది. అమెజాన్ ప్రైమ్‌లో నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉన్న సినిమాల్లో ధనుష్ రాయన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ప్రభాస్ కల్కి సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
రెండు ఓటీటీల్లో కల్కి...
కల్కి 2898 ఏడీ ఆగస్ట్ 22న అమెజాన్ ప్రైమ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కల్కి స్ట్రీమింగ్ అవుతోండగా...హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో కల్కి సెకండ్ ప్లేస్‌లో నిలవగా... నెట్‌ఫ్లిక్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది.
రాయన్ అమెజాన్ ప్రైమ్‌లో...
మరోవైపు రాయన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అగస్ట్ 23న (శుక్రవారం) విడుదలైంది. ఈ సినిమా ఓటీటీ రిలీజై 24 గంటలు దాటినా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే నిలవడం గమనార్హం. కల్కిని దాటేయడం ఆసక్తికరంగా మారింది.
ధనుష్ హీరో కమ్ డైరెక్టర్...
రాయన్ సినిమాలో హీరోగా నటిస్తూనే ఈ మూవీకి ధనుష్ దర్శకత్వం వహించాడు. రివేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్, దుషారా విజయన్, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన రాయన్ మూవీ 150 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
రాయన్ కథ ఇదే...
రాయన్ చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అవుతాడు. ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుకుంటూ ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలితో ఆనందంగా జీవిస్తుంటాడు. ఊళ్లో దురై, సేతు అనే గ్యాంగ్‌స్టర్స్ మధ్య ఉన్న గొడవలు రాయన్ జీవితాన్ని ఎలా మార్చేశాయి? శత్రువులతో చేతులు కలిపిన రాయన్ తమ్ముడు ముత్తువేల్ సొంత అన్నను చంపాలని ఎందుకు అనుకున్నాడు అన్నదే రాయన్ మూవీ కథ. ధనుష్ యాక్టింగ్, అతడి హీరోయిజం, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ రాయన్ మూవీలో అభిమానులను ఆకట్టుకున్నాయి.
కల్కి హయ్యెస్ట్ కలెక్షన్స్...
మరోవైపు కల్కి మూవీ ఈ ఏడాది తెలుగుతో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ నెలకొల్పింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి సినిమాను తెరకెక్కించాడు. కల్కి సినిమాలో దీపికా పదుకోన్, అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రలు పోషించారు.
కమల్‌హాసన్ విలన్‌గా నటించాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. కల్కి మూవీకి కల్కి 2 పేరుతో సీక్వెల్ రాబోతోంది. వచ్చే ఏడాది సీక్వెల్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఓటీటీ ద్వారానే 375 కోట్లు...
కల్కి మూవీ ఓటీటీ హక్కులు ద్వారా నిర్మాతలు భారీగానే లాభాలు గడించినట్లు సమాచారం. ఈ సినిమా దక్షిణాది ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ 200 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. హిందీ ఓటీటీ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్...కల్కి నిర్మాతలకు 175 కోట్ల వరకు ఇచ్చినట్లు చెబుతోన్నారు. రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా నిర్మాతలకు 375 కోట్లు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.