Guppedantha Manasu Serial: శైలేంద్రకు చావుభయం చూపించిన రాజీవ్ - చక్రం తిప్పనున్న దేవయాని - వసునే టార్గెట్
Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో రాజీవ్ జైలు నుంచి తప్పించుకొని వసుధార ఇంటికివస్తాడు. తనను జైలుకు పంపించింది శైలేంద్ర అని మహేంద్ర మాటల ద్వారా తెలుసుకుంటాడు. శైలేంద్రను చంపాలని ఫిక్సవుతాడు.
Guppedantha Manasu Serial: వసుధార, మను మధ్య అక్రమ సంబంధం అంటగట్టి ఇద్దరిని కాలేజీ నుంచి పంపింంచాలని శైలేంద్ర ప్లాన్ చేస్తాడు. అతడి ప్లాన్‌ను ఏంజెల్ సహాయంతో మను తిప్పిగొడతాడు. ఇంకోసారి ఇలాంటి చెత్త ప్లాన్స్ వేస్తే తోలుతీస్తానని శైలేంద్రకు మను వార్నింగ్ ఇస్తాడు. వసుధార కూడా శైలేంద్రను నిలదీయాలని అనుకుంటుంది.
శైలేంద్రనే ఈ పని చేశాడని చెప్పడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో అతడిని ఏం చేయలేమని మహేంద్ర అంటాడు. ఏండీ సీట్ విషయంలో మోసం చేసినప్పటి నుంచి మనపై ప్రతీకారం తీర్చుకునేందుకు శైలేంద్ర ఎదురుచూస్తున్నాడని, మనమే జాగ్రత్తగా ఉండాలని అంటాడు.
ఏంజెల్‌కు మను థాంక్స్...
తమను పెద్ద ప్రాబ్లెమ్ నుంచి సేవ్ చేసిన ఏంజెల్‌కు థాంక్స్ చెబుతుంది వసుధార. అందరూ నీలా మంచిగా ఆలోచించేవారు ఉండరు. అని మను కూడా ఏంజెల్‌కు థాంక్స్ చెబుతాడు. మను థాంక్స్ చెప్పడంతో ఏంజెల్ పొంగిపోతుంది. మనలో మనకు థాంక్స్ ఎందుకు బావ అని అంటుంది.
ఏదో ఒక మేలు, సాయం చేస్తేనే గానీ నాతో మాట్లాడవా...అలా అయితే రోజుకో అడ్వెంచర్ చేసి నీ ఇంప్రెషన్ కొట్టేస్తానని ఏంజెల్ అంటుంది. ఆమె మాటలతో మను నవ్వుతాడు. అతడి నవ్వును చూసి ఏంజెల్ సంబరపడుతుంది.
జైలు నుంచి తప్పించుకున్న రాజీవ్...
వసుధారకు పోలీసులు ఫోన్ చేసి రాజీవ్ జైలు నుంచి తప్పించుకున్నాడని చెబుతారు. వారి మాటలు విని వసుధార షాకవుతుంది. రాజీవ్‌కు భయపడాల్సిన అవసరం లేదని, అతడు మనల్ని ఏం చేయలేడని మహేంద్ర అంటాడు. శైలేంద్ర, రాజీవ్ ఇద్దరు కామెడీ పీస్‌లని తేలిగ్గా తీసేస్తాడు మహేంద్ర.
పెళ్లి ధ్యాస తప్ప తన వెనుక ఏం జరుగుతుంది అన్నది కూడా రాజీవ్ తెలుసుకోలేక జైలుకు వెళ్లాడని, తనను పోలీసులకు పట్టించిందని శైలేంద్రనే అనే విషయం కూడా వాడికి తెలియదని వసుధారతో చెబుతాడు మహేంద్ర. వసుధార మాత్రం భయపడుతూనే ఉంటుంది. మహేంద్ర మాటలను చాటు నుంచి రాజీవ్ వింటాడు.
శైలేంద్రపై ఎటాక్...
తనను జైలుకు పంపించింది శైలేంద్ర అని తెలిసి కోపంతో రగిలిపోతాడు రాజీవ్. తనను మోసం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని రాజీవ్ అనుకుంటాడు. శైలేంద్ర ఇంటికివస్తాడు. నిద్రలో తనను రాజీవ్ చంపినట్లుగా కల కంటాడు శైలేంద్ర. నన్ను చంపొద్దని వేడుకుంటుంటాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన రాజీవ్...శైలేంద్ర కలను నిజం చేయాలని అనుకుంటాడు. శైలేంద్రను చంపబోతాడు. నిద్రలో నుంచి మేల్కోన్న శైలేంద్ర..రాజీవ్ ప్రయత్నాల్ని అడ్డుకుంటాడు. నేను నిన్ను పోలీసులకు పట్టించలేదని, నీకు నేనేందుకు ద్రోహం చేస్తానని రాజీవ్‌ను కూల్ చేసేందుకు శైలేంద్ర ప్రయత్నిస్తాడు.
ఎండీ సీట్ కోసం ద్రోహం...
కానీ శైలేంద్ర మాటలను రాజీవ్ నమ్మడు. ఎండీ సీట్ కోసం నాకు ద్రోహం చేశావని తెలిసిపోయిందని అంటాడు. వసుధారను నాకు అప్పగిస్తానని నమ్మించి తనను పోలీసులకు పట్టించావని, మన స్నేహాన్ని నువ్వు అర్థం చేసుకున్నది ఇదేనా అని శైలేంద్రను నిలదీస్తాడు రాజీవ్.
శైలేంద్రకు గన్ గురిపెట్టిన రాజీవ్...
ఇప్పటి నుంచి కలిసికట్టుగా ఉందామని, వసుధార, మనును దెబ్బకొడదామని రాజీవ్‌ను కన్వీన్స్ చేయాలని చూస్తాడు శైలేంద్ర. నీలాంటివాడు ఈ భూమిపై ఉండకూడదని గన్ తీసి శైలేంద్రకు గురిపెడతాడు రాజీవ్. తనను చంపొద్దని రాజీవ్‌ను బతిమిలాడుతాడు శైలేంద్ర. జరిగిందేదో జరిగిపోయిందని, తనను వదిలేయమని అంటాడు.
దేవయాని ఎంట్రీ...
శైలేంద్ర ఎంత బతిమిలాడిన రాజీవ్ కరగడు. నిన్ను చంపకుండా వదిలిపెట్టనని అంటాడు. నిన్ను ఒక్క బుల్లెట్‌తోనే చంపబోతున్నట్లు చెబుతాడు. ఇదే నేను నీకు ఇచ్చే బంపర్ ఆఫర్ అని చెబుతాడు.
అప్పుడే అక్కడికి దేవయాని ఎంట్రీ ఇస్తోంది. ఆమెను చూడగానే మీ కొడుకుశత్రువుల పంచన చేరి నాకు నమ్మకద్రోహం చేశాడని రాజీవ్ ఫైర్ అవుతాడు. శైలేంద్ర తప్పు చేశాడు నిజమే. కానీ వాడిని చంపడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉంటుందని రాజీవ్‌ను డైవర్ట్ చేస్తుంది దేవయాని. వాడిని నువ్వు చంపడం...నువ్వు వాడిని చంపడం పరిష్కారం కాదని దేవయాని అంటుంది.
మనుపై రివేంజ్...
శైలేంద్రను వెర్రితనాన్ని ఉపయోగించుకొని మను మిమ్మల్ని దెబ్బకొట్టాడు. ఇప్పుడు వారిని మీరు దెబ్బకొట్టాలి. వారిపై ఎలా రివేంజ్ తీర్చుకోవాలని ఆలోచించాలి కానీ మీకు మీరే కొట్టుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదని రాజీవ్ కోపాన్ని తగ్గిస్తుంది దేవయాని. మీరు కలిసి కట్టుగా వసుధార, మనులను దెబ్బకొట్టడానికి ప్రయత్నించమని, అందుకు నా అనుభవంతో మీకు అండగా నేను అండగా ఉంటానని దేవయాని చెబుతుంది.
రాజీవ్ వీక్‌నెస్...
శత్రువులు వీక్‌నెస్‌ను మనం తెలుసుకోవాలి గానీ..మనవీక్‌నెస్‌లు శత్రువులకు తెలియకూడదని శైలేంద్ర, రాజీవ్‌లతో చెబుతుంది దేవయాని. వసుధార మాయలో నువ్వు, ఎండీ సీట్ మత్తులో శైలేంద్ర పడ్డారు. వాటిని అడ్డం పెట్టుకొని మను, వసుధార మిమ్మల్ని దెబ్బకొట్టరని చెబుతుంది. ఈ సారి అలా జరగకుండా వసుధార, మనులను మెంటల్‌గా తాను దెబ్బకొడతానని దేవయాని చెబుతుంది.
దేవయాని ప్లాన్...
దేవయాని తన ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెడుతుంది. ధరణితో కలిసి మహేంద్ర ఇంటికి వస్తుంది. శైలేంద్ర, ధరణిలకు సంతానం కలిగేలా చిన్న వ్రతం చేయబోతున్నట్లు చెబుతుంది. ఆ వ్రతానికి అనుపమతో సహ అందరూ రావాలని అంటుంది. వ్రతానికి రావాలని వసుధారను పదే పదే కోరుతుంది దేవయాని.