Guppedantha Manasu Serial: శైలేంద్రకు దిమ్మతిరిగే షాకిచ్చిన మను - బిల్డప్‌లు తుస్ - ఎండీ సీట్‌ను కాపాడుకున్న వసు
Guppedantha Manasu Serial:నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో తాను ఎండీ కాబోతున్నానన్న ఆనందంలో కాలేజీలో అడుగుపెడతాడు శైలేంద్ర. తెగ బిల్డప్‌లు ఇస్తాడు. కానీ అతడికి మను, వసుధార కలిసి షాకిస్తారు.
Guppedantha Manasu Serial: తనను రాజీవ్ మర్డర్ కేసు నుంచి బయటపడేస్తే ఎండీ ఇస్తానని మను చెప్పిన మాటలను గుర్తుచేసుకొని సంబరపడిపోతాడు శైలేంద్ర. డీల్ ప్రకారం మను కాలేజీని తనకు అప్పగించడం ఒక్కటే మిగిలుందని, డీబీఎస్‌టీ కాలేజీ తనదేనని ఆనందంలో మునిగిపోతాడు.
శైలేంద్ర భ్రమలు...
డీబీఎస్‌టీ కాలేజీ తన సొంతమైపోతుందన్న భ్రమలో శైలేంద్ర ముఖం వెలిగిపోతుంటుందని వసుధార, మహేంద్ర అనుకుంటారు.తన కల నిజమవుతుందన్న ఆనందంలో గాలిలో తేలియాడుతున్నాడు కావచ్చునని మహేంద్ర అంటాడు. కథలోని ట్విస్ట్ తెలిస్తే శైలేంద్ర గుండె ఆగిపోతుందని వసుధార అంటుంది.
ఈ రోజు మనం కొట్టే దెబ్బకు శైలేంద్ర దిమ్మ తిరిగిపోవాలని మహేంద్ర అంటాడు. శైలేంద్ర చేసిన తప్పులకు ఇంకా మూల్యం చెల్లించుకోవాలి. తాను చేసిన నేరాలకు ఇంకా శిక్ష పడాలి అని చెబుతాడు. . శైలేంద్ర అంతు తేల్చేవరకు అతడిని టార్గెట్ చేస్తూనే ఉండాలని ఇద్దరు అనుకుంటారు.
ఎండీ సీట్‌కే కాకుండా కాలేజీకి శైలేంద్రను దూరం పెట్టాలని నిర్ణయించుకుంటారు. అతడు చేసిన తప్పులు పూర్తిగా నిరూపించిన తర్వాతే ఆ పని చేయాలని నిర్ణయించుకుంటారు.
నిర్ణయానికి కట్టుబడ్డ మను...
ఆనందంగా కాలేజీకి వస్తాడు శైలేంద్ర. నేరుగా వచ్చి మనును కలుస్తాడు. తనను ఎండీని చేస్తాననే విషయంలో ఏమైనా మనసు మార్చుకున్నావా అని కంగారుగా అతడిని అడుగుతాడు. మను ఓ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటాడు. మనసుకు మర్చుకోవడం ఉండదని శైలేంద్రకు బదులిస్తాడు మను.
వసుధారతో పాటు బాబాయ్ మహేంద్ర నిన్ను ఎన్నో మాటలు అన్నారని, నువ్వు చేసిన సాయాన్ని మార్చిపోయాని అంటాడు. నేను నీకు మంచి చేశానని, నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి కాపాడి బయటకు తీసుకొచ్చానని మనుకు చెబుతాడు శైలేంద్ర.
వసుధారపై ఫైర్...
శైలేంద్ర, మను మాట్లాడుకుంటోండగా వసుధార లోపలికి వస్తుంది. ఆమెపై శైలేంద్ర ఫైర్ అవుతాడు. కాబోయే ఎండీ ఉన్నాడనే తెలిసి కూడా పర్మిషన్ తీసుకోకుండా ఎలా లోపలికి వస్తావని కోప్పడతాడు. నువ్వు ఇంకా ఎండీ కాలేదనీ, ప్రస్తుతానికి తానే ఏండీనని వసుధార అంటుంది.
ఎండీ సీట్‌కు మీరు ఎవరు తీసుకురాలేని దర్జాను నేను తీసుకొస్తానని, ఆ సీట్‌లో నేను కూర్చుంటే వచ్చే ఠీవీనే వేరు...ఈ డీబీఎస్‌టీ కాలేజీకి నేనే రాజునని శైలేంద్ర బిల్డప్‌లు ఇస్తారు. నన్ను ఎండీగా ఎప్పుడు అనౌన్స్ చేస్తారని అడుగుతాడు.
వసుధార రిజైన్...
తనకు అచ్చొచ్చిన పెన్‌ను వసుధారకు ఇచ్చి...ఈ పెన్‌తోనే నీ రిజైన్ లెటర్ నువ్వు సంతకం చేయాలని అంటాడు శైలేంద్ర. అప్పుడే లోపలికి వచ్చిన అటెండర్ బోర్డ్ మీటింగ్‌కు రమ్మని అంటాడు. ఎండీగారు వస్తున్నారని చెప్పమని అటెండర్‌తో శైలేంద్ర చెబుతాడు. అంటే మీరు రావడం లేదా అని అటెండర్ రిప్లై ఇస్తాడు. అతడి మాటలతో శైలేంద్ర కోపం పట్టలేకపోతాడు.
దేవయాని అనుమానం…
తల్లికి ఫోన్ చేసి థ్రిల్లింగ్ సన్నివేశంలో నువ్వు పక్కన ఉండాలని, పదిన్నరకు కాలేజీకి రమ్మని దేవయానికి ఫోన్ చేసి చెబుతాడు శైలేంద్ర. ఈ రోజు నా జీవితంలో మంచిరోజుగా మిగిలిపోతుందని శైలేంద్ర అంటాడు. కొంపదీసి నువ్వు డీబీఎస్‌టీ కాలేజీకి ఎండీవి అవుతున్నావా అని కొడుకును అనుమానంగా అడుగుతుంది దేవయాని. కానీ సమాధానం చెప్పకుండా శైలేంద్ర ఫోన్ కట్‌చేస్తాడు.
అప్పు మాఫీ...
బోర్డ్ మీటింగ్ హాల్‌లోకి వెళతాడు శైలేంద్ర. వసుధార ఎండీ సీట్‌లో కూర్చోవడం చూసి శైలేంద్ర లోలోన కోప్పడతాడు. కాలేజీకి మను పంపించిన నోటీసులపై బోర్డ్ మెంబర్స్ అతడిని నిలదస్తారు. అయితే ఆ యాభై కోట్ల అప్పు మాఫీ చేస్తున్నట్లు మను నిర్ణయం తీసుకున్నారని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవేనని అందరికి చూపిస్తుంది వసుధార. మను తీసుకున్న నిర్ణయంపై ఫణీంద్ర ప్రశంసలు కురిపిస్తాడు.
శైలేంద్రకు షాక్...
తనను ఎండీని చేయకుండా వసుధార ఆడుతోన్న డ్రామాపై శైలేంద్ర సీరియస్ అవుతాడు. మహేంద్రతో తన గోడును వెల్లబోసుకుంటాడు. కానీ తాను బోర్డ్ మెంబర్‌ను కానని, ఈ విషయంలో ఏం చేయలేనని మహేంద్ర బదులిస్తాడు. మను కూడా ఎండీ సీట్ గురించి కాకుండా కాలేజీ కోసం పాటుపడతానని మాటిస్తాడు. మీటింగ్ పూర్తయిందని వసుధార ప్రకటించడంతో శైలేంద్ర షాకవుతాడు.
అగ్రిమెంట్ పేపర్స్ చించేసిన మను...
తనను ఎండీ చేస్తానని అన్నావని, అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేశావని తన దగ్గర ఉన్న పేపర్స్‌ను మనుకు చూపిస్తాడు శైలేంద్ర. ఆ పేపర్స్‌ను మను చింపేస్తాడు. దాంతో శైలేంద్ర నోట మాటరాదు.
తనను మోసం చేస్తారా మీ అంతు చూస్తానని మనుకు వార్నింగ్ ఇస్తాడు. నువ్వు, రాజీవ్ కలిసి నన్ను మర్డర్ కేసులో ఇరికించాలని అనుకున్నారు. మీ ప్లాన్‌ను మీతోనే బయటపెట్టించానని మను అంటాడు. రాజీవ్‌ను నువ్వు తీసుకొస్తానని నాతో అన్న మాటలను నే రికార్డ్ చేశానని మను అంటాడు. తోకజాడిస్తే వాటిని బయటపెడతానని అంటాడు.
సీక్రెట్ మైక్...
వసుధార క్యాబిన్‌లో శైలేంద్ర పెట్టిన సీక్రెట్ మైక్‌ను మహేంద్ర బయటకు తీస్తాడు. నా క్యాబిన్‌లో ఈ మైక్‌ను ఏ వెధవ పెట్టాడంటూ తిడతాడు. తనను మహేంద్ర తిట్టడం శైలేంద్ర భరించలేకపోతాడు. ఆ మైక్ తాను పెట్టలేదని బుకాయించబోతాడు. కానీ ఆధారాలతో మహేంద్ర అతడి కుట్రను బయటపెట్టడంతో శైలేంద్ర ఏం మాట్లాడలేకపోతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.