Guppedantha Manasu Serial: మ‌ర‌ద‌లితో మ‌ను ప్రేమాయ‌ణం - శైలేంద్ర‌ను దులిపేసిన దేవ‌యాని - అబ‌ద్ధం చెప్పిన వ‌సు-guppedantha manasu may 23rd episode vasudhara requests anupama to reveal truth about manu father ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Serial: మ‌ర‌ద‌లితో మ‌ను ప్రేమాయ‌ణం - శైలేంద్ర‌ను దులిపేసిన దేవ‌యాని - అబ‌ద్ధం చెప్పిన వ‌సు

Guppedantha Manasu Serial: మ‌ర‌ద‌లితో మ‌ను ప్రేమాయ‌ణం - శైలేంద్ర‌ను దులిపేసిన దేవ‌యాని - అబ‌ద్ధం చెప్పిన వ‌సు

Nelki Naresh Kumar HT Telugu
May 23, 2024 07:17 AM IST

Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఎపిసోడ్‌లో మ‌ను, వ‌సుధార చేతిలో శైలేంద్ర మోస‌పోవ‌డం దేవ‌యాని స‌హించ‌లేక‌పోతుంది. కొడుకు చెంప‌లు వాయిస్తుంది. శైలేంద్ర అస‌మ‌ర్థ‌త వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌ని కొడుకుపై దేవ‌యాని ఫైర్ అవుతుంది.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్

Guppedantha Manasu Serial: వ‌సుధార‌, మ‌ను, మ‌హేంద్ర ముగ్గురు క‌లిసి త‌న‌కు న‌మ్మ‌క‌ద్రోహం చేశార‌ని, ఎండీ సీట్‌ను ఎర‌గా వేసి త‌న‌తోనే అండ‌ర్‌గ్రౌండ్‌లో ఉన్న రాజీవ్‌ను పోలీసుల‌కు ప‌ట్టించేలా చేశార‌ని త‌ల్లి దేవ‌యానితో త‌న మ‌న‌సులో ఉన్న బాధ‌ను మొత్తం చెప్పుకుంటాడు శైలేంద్ర‌. మ‌ను, వ‌సుధార త‌న‌ను ఎలా మోసం చేసింది వివ‌రిస్తాడు.

శైలేంద్ర అసమర్థత….

వ‌సుధార‌, మ‌ను చేతిలో కొడుకు మోసం పోవ‌డం దేవ‌యాని స‌హించ‌లేక‌పోతుంది. శైలేంద్ర‌పై ఫైర్ అవుతుంది. చెత్త‌నా నా స‌న్‌...నా క‌డుపున చెడ‌బుట్టావ్ అంటూ దుమ్ము దులిపేస్తుంది. మ‌ను తండ్రి ఎవ‌రో తెలియ‌క పిచ్చోడైపోతున్నాడు. రిషి గురించి తెలియ‌క వ‌సుధార‌, మ‌హేంద్ర క్రుంగిపోయిఉన్నారు.

అలాంటివాళ్ల‌ను దెబ్బ‌కొట్టాల్సిందిపోయి...నువ్వే వాళ్ల చేతిలో ఎలా మోస‌పోయావు. నీ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌ని కొడుకుకు క్లాస్ పీకుతుంది. ఇంత జ‌రుగుతుంటే నాకు ఎందుకు చెప్ప‌లేద‌ని నిల‌దీస్తుంది. ప్లాన్ స‌క్సెస్ అయిన త‌ర్వాత ఎండీగా మారి నీకు స‌ర్‌ప్రైజ్ ఇద్దామ‌ని అనుకుంటే ఇలా జ‌రిగింద‌ని శైలేంద్ర బాధ‌ప‌డ‌తాడు.

ధ‌ర‌ణి ఎంట్రీ...

శైలేంద్ర, దేవ‌యాని మాట్లాడుకుంటోండ‌గా వారి రూమ్‌లోకి ధ‌ర‌ణి ఎంట్రీ ఇస్తుంది. ఏం జ‌రిగింద‌ని ఆరాలు తీస్తుంది. ఆమె రాగానే శైలేంద్ర‌, దేవ‌యాని మాట మార్చేస్తారు. విసిగించ‌కుండా ఇక్క‌డి నుంచి వెళ్ల‌మ‌ని ధ‌ర‌ణిపై శైలేంద్ర ఫైర్ అవుతాడు. మీకు కాఫీ, టీ ఏమైనా కావాలా అని భ‌ర్త‌ను అడుగుతుంది. నాకు కాఫీ, మ‌మ్మీకి టీ తీసుకురా అని ధ‌ర‌ణికి ఆర్డ‌ర్ వేస్తాడు శైలేంద్ర‌. అలా కుద‌ర‌దు. ఏదైనా ఒక‌టే తెస్తాన‌ని శైలేంద్ర చిరాకును మ‌రింత పెంచేస్తుంది ధ‌ర‌ణి.

దేవ‌యానిస‌ల‌హా...

రాజీవ్‌కు నువ్వే పోలీసుల‌కు ప‌ట్టించావ‌నే విష‌యం తెలుసా అని కొడుకును అడుగుతుంది దేవ‌యాని. తెలియద‌ని అనుకుంటా అంటూ డౌట్‌గా స‌మాధానం చెబుతాడు శైలేంద్ర‌. రాజీవ్ మామూలోడు కాదు. పోలీసుల‌కు త‌న‌ను ప‌ట్టించింది నువ్వే అని తెలిస్తే రాజీవ్ నిన్ను వ‌దిలిపెట్ట‌డ‌ని కొడుకుతో అంటుంది. జైలులో ఉన్న రాజీవ్‌ను వెళ్లి క‌లిసి ముందుగా అత‌డి మ‌న‌సులో ఏముందో క‌నుక్కోమ‌ని కొడుకుకు స‌ల‌హా ఇస్తుంది దేవ‌యాని.

మ‌నును ఆట‌ప‌ట్టించిన ఏంజెల్‌...

మ‌నుకు ఫోన్ చేసి ఆట‌ప‌ట్టిస్తుంది ఏంజెల్‌. ఆమెను గుర్తుప‌ట్ట‌ని మ‌ను కాల్ క‌ట్ చేస్తాడు. మ‌ళ్లీ ఫోన్ చేస్తుంది ఏంజెల్‌. మీకు ఏం కావాల‌ని కోపంగా ఆమెను అడుగుతాడు మ‌ను. నువ్వే కావాలి అని రొమాంటిక్‌గా బ‌దులిస్తుంది ఏంజెల్‌. మీతో మాట్లాడాలి అంటూ మాట మార్చేస్తుంది.

త‌న‌ను మ‌ను గుర్తుప‌ట్ట‌క‌పోవ‌డంతో ఏంజెల్ అలిగిన‌ట్లుగా నాట‌కం ఆడుతుంది. తాను ఎవ‌ర‌న్న‌ది చెప్ప‌కుండా చాలా సేపు మ‌నును ఏడిపిస్తుంది. ఒక అమ్మాయి ఫోన్ చేసి స్వీట్‌గా ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే...ఆమెతో మ‌రికొంత సేపు మాట్లాడాల‌ని మీకు అనిపించ‌డం లేదా అని మ‌నును అడుగుతుంది ఏంజెల్‌. లేదు అంటూ ఫోన్ క‌ట్ చేయ‌బోతాడు మ‌ను.

మ‌ను ప్ర‌శ్న‌లు...

చివ‌ర‌కు త‌న పేరు చెప్పేస్తుంది ఏంజెల్‌. ఎందుకు ఫోన్ చేశావ‌ని ఏంజెల్‌ను అడుగుతాడు మ‌ను. అత‌డి ప్ర‌శ్న‌తో ఏంజెల్ కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది. ఓ అంద‌మైన అమ్మాయి ఫోన్ చేస్తే ఎందుకు చేశావ‌ని ఎవ‌రైనా అడుగుతారా అంటూ బావ మ‌నును కోప్ప‌డుతుంది. నిన్ను క‌ల‌వాల‌ని మ‌నుతో అంటుంది ఏంజెల్‌. మిమ్మ‌ల్ని క‌ల‌వ‌డం నాకు ఇష్టం లేద‌ని ఫోన్ క‌ట్ చేస్తాడు మ‌ను. నువ్వేం చేస్తావో నాకు తెలియ‌దు. నేను నీతో మాట్లాడాలి వెయిట్ చేస్తుంటా అని మ‌నుకు కోపంగా మెసేజ్ పెడుతుంది ఏంజెల్‌.

అనుప‌మ భ‌యాలు...

మ‌నుపై తండ్రికి ఉన్న ద్వేషం చూసి మ‌హేంద్ర పేరును భ‌య‌పెట్ట‌లేక‌పోతుంది అనుప‌మ‌. మ‌హేంద్ర‌కు ఎలాంటి ఆప‌ద క‌ల‌గ‌కూడ‌ద‌ని ఆమె నిజాన్ని దాచిపెడుతుంద‌ని వ‌సుధార గ్ర‌హిస్తుంది. త‌న తండ్రి ఎవ‌ర‌న్న‌ది మ‌ను త‌నంత‌ట తానే తెలుసుకుంటే ప్ర‌మాద‌మ‌ని, అలా తెలుసుకోవ‌డానికి ముందే మ‌హేంద్రనే మ‌ను తండ్రి అన్న‌ది మ‌నుకు అర్థ‌మ‌య్యేలా చెబితే ఎలాంటి అనర్థాలు త‌లెత్త‌కుండా ఉండే అవ‌కాశం ఉంద‌ని అనుప‌మ‌కు స‌ల‌హా ఇస్తుంది వ‌సుధార‌.

ఏ కార‌ణం వ‌ల్ల త‌న తండ్రికి మ‌ను దూర‌మ‌య్యాడో, ఏ ప‌రిస్థితుల వ‌ల్ల మ‌హేంద్ర గురించి మ‌నుకు తెలియ‌కుండా పోయిందో అర్థ‌మ‌య్యేలా కొడుకుతో మీరే చెప్పాల‌ని అనుప‌మ‌కు స‌ర్ధిచెబుతుంది వ‌సుధార‌. కానీ మ‌హేంద్ర‌నే మ‌ను తండ్రి అనే నిజాన్ని చెప్ప‌డానికి అనుప‌మ భ‌య‌ప‌డుతుంది. ఆ నిజం ఎప్ప‌టికైనా బ‌య‌ట‌ప‌డి తీరుతుంద‌ని వ‌సుధార అంటుంది.

మ‌హేంద్ర డౌట్‌...

అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన మ‌హేంద్ర ఏ నిజం అని వ‌సుధార‌ను అడుగుతాడు. అత‌డి ప్ర‌శ్న‌కు వ‌సుధార త‌బ‌డిపోతుంది. మావ‌య్య అంటూ నా గురించి కూడా ఏదో అన్నారు ఏమిట‌ని వ‌సుధార‌ను అడుగుతాడు మ‌హేంద్ర‌. మీ గురించి మేము ఏం మాట్లాడ‌టం లేద‌ని, మ‌ను తండ్రి గురించి మాట్లాడుకుంటున్నామ‌ని టాపిక్ డైవ‌ర్ట్ చేసి అబ‌ద్ధం ఆడుతుంది వ‌సుధార‌.

డిస్క‌స్ చేయ‌డం వేస్ట్‌...

మ‌ను తండ్రి గురించి అనుప‌మ‌తో డిస్క‌స్ చేయ‌డం వేస్ట్‌, ఎంత అడిగిన ఆమె నిజం బ‌య‌ట‌పెట్ట‌ద‌ని మ‌హేంద్ర అంటాడు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడునిజం చెబుతుంద‌ని ఎందుకు అనుకుంటున్నావ‌ని వ‌సుధార‌తో అంటాడు మ‌హేంద్ర‌. క‌న్నీళ్ల‌కు క‌ష్టాల‌కు అనుప‌మ మ‌న‌సు క‌ర‌గ‌ద‌ని అంటాడు. మ‌ను తండ్రి ఎవ‌ర‌నే నిజం అనుప‌మ నోటి నుంచి రావ‌డం అసాధ్య‌మ‌ని మ‌హేంద్ర అంటాడు.

మ‌నులో అగ్నిప‌ర్వ‌తం…

మ‌నునే త‌న తండ్రి ఎవ‌ర‌న్న‌ది తెలుసుకుంటాడు. మ‌నులో ఓ అగ్నిప‌ర్వ‌తం ఉంది. నిజం తెలిసిన రోజు ఆ ఆగ్నిప‌ర్వ‌తంలో మ‌ను తండ్రి మాడిమ‌సైపోతాడ‌ని మ‌హేంద్ర అంటాడు. మ‌ను కోప‌మే ఆ తండ్రిని భ‌స్మం చేస్తుంద‌ని చెబుతాడు. మ‌హేంద్ర మాట‌ల‌ను విని అనుప‌మ‌, వ‌సుధార త‌ట్టుకోలేక‌పోతారు. అలా మాట్లాడ‌వ‌ద్ద‌ని అంటారు.

మూడీగా మ‌ను...

మ‌నును క‌లుస్తుంది ఏంజెల్‌. చాటు నుంచి వ‌చ్చి అత‌డిని భ‌య‌పెట్టాల‌ని చూస్తుంది. కానీ మ‌ను మాత్రం భ‌య‌ప‌డ‌కుండా సీరియ‌స్‌గా ఏంజెల్‌వైపు లుక్కిస్తాడు. మ‌ను మూడీగా ఉండ‌టం చూసి అత‌డిపై కోప్ప‌డుతుంది ఏంజెల్‌. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావా అని క్లాస్ ఇస్తుంది. అక్క‌డితో గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024