Guppedantha Manasu Serial: వసుధార దెబ్బకు ఏడ్చేసిన శైలేంద్ర - కొడుకు పరిస్థితికి దేవయాని విలవిల - మహేంద్ర హ్యాపీ
Guppedantha Manasu Serial:నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఎండీ సీట్ ఎరగా చూపించి వసుధార, మను కలిసి తనకు చేసిన నమ్మకద్రోహాన్ని శైలేంద్ర జీర్ణించుకోలేకపోతాడు. ఆ బాధను భరించలేక ఫుల్‌గా తాగేసి ఇంటికొస్తాడు. కొడుకును చూసి దేవయాని కంగారు పడుతుంది.
Guppedantha Manasu Serial: రాజీవ్‌ను బయటకు రప్పించడానికి ఎండీ సీట్ పేరుతో మేము ఆడిన నాటకం ఇదంతా అని శైలేంద్రతో అసలు నిజం చెబుతాడు మను. వసుధార క్యాబిన్‌లో శైలేంద్ర సీక్రెట్ మైక్ పెట్టిన సంగతి బయటపెడతాడు మహేంద్ర. మను కాలేజీకి ఇచ్చిన యాభై కోట్ల అప్పును రద్దు చేస్తున్నట్లు వసుధార ప్రకటిస్తుంది.
దాంతో మనుపై బోర్డ్ మెంబర్స్ ప్రశంసలు కురిపిస్తారు. మను కాలేజీకి అప్పు ఇవ్వలేదని శైలేంద్ర అంటాడు. ఆ విషయం తమకు తెలుసునని, కాలేజీకి లేని అప్పును నువ్వే క్రియేట్ చేశావనే నిజం కూడా తమకు తెలుసునని మహేంద్ర అంటారు.
శైలేంద్ర విలవిల...
మను, వసుధార కొట్టిన దెబ్బకు శైలేంద్ర విలవిలలాడిపోతాడు. నా కంటే మీరు పెద్ద విలన్స్‌లా ఉన్నారని వారితో అంటాడు. మీ మాటలు నమ్మి నేను రాజీవ్‌ను ప్లాన్ చేసి పోలీసులకు పట్టించానని శైలేంద్ర అంటాడు. ఒకవేళ ఈ నిజం రాజీవ్‌కు తెలిస్తే నా పరిస్థితి ఏమిటని భయపడిపోతాడు.
నువ్వు సెలైంట్‌గా ఉండకపోతే ఈ నిజం తప్పకుండా రాజీవ్‌కు చెబుతానని శైలేంద్రను బ్లాక్‌మెయిల్ చేస్తుంది వసుధార. నీకు కాలేజీలో ఏ పోస్ట్ లేదు. ఉద్యోగం లేదు. మాకు టైమ్‌పాస్ కావాలంటే నువ్వు కాలేజీకి రావొచ్చు.అప్పుడే మాకు స్ట్రెస్ నుంచి రిలీఫ్ దొరుకుతుందని శైలేంద్రను దారుణంగా అవమానిస్తాడు మను. ఆ అవమానం శైలేంద్ర తట్టుకోలేకపోతాడు. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టనని ముగ్గురికి వార్నింగ్ ఇస్తాడు.
తాగిన మత్తులో…
మను, వసుధార కలిసి చేసిన మోసాన్ని భరించలేక ఫుల్ తాగేసి ఇంటికొస్తాడు శైలేంద్ర. మెట్లపై కూర్చొని మోసపోయానని , నాకు అన్యాయం జరిగిందని ఏడుస్తుంటాడు. తాగిన మత్తులో ఒళ్లు తెలియకుండా ఇంట్లోనే పడిపోతాడు. భర్తను చూసి కంగారు పడుతుంది ధరణి.వసుధార, మను తనను మోసం చేశారని కలవరిస్తుంటాడు శైలేంద్ర. ధరణి, దేవయాని కలిసి అతడిపై నీళ్లు కుమ్మరించి మత్తు దిగేలా చేస్తారు.
నిజం చెప్పని శైలేంద్ర...
నిన్ను ఎవరు మోసం చేశారో చెప్పమని కొడుకును అడుగుతుంది దేవయాని. కానీ అసలు నిజం చెబితే తల్లి మరింత క్లాస్ ఇస్తుందని భయపడిపోతాడు శైలేంద్ర. ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు.
తాము కొట్టిన దెబ్బకు శైలేంద్రకు బుద్ది వచ్చిందని మహేంద్ర అంటాడు. ఇక నుంచి శైలేంద్ర దుర్మార్గాలను సహించేది లేదని, వాడు చేసిన దారుణాలు, దుర్మార్గాలు అన్నింటికి మూల్యం చెల్లించుకోవాలని అంటాడు. శైలేంద్ర ఎదురుదెబ్బ తినడం చాలా తక్కువ జరుగుతుందని, దెబ్బతిన్నవాడు ఇంకా బలంగా తయారుఅవుతాడని మహేంద్రతో అంటుంది వసుధార. శైలేంద్ర విషయంలో ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తుంది.
మను థాంక్స్..
తనను కష్టపడి బయటకు తీసుకొచ్చిన మహేంద్ర, వసుధారలకు థాంక్స్ చెబుతాడు మను. ఒకవేళ మీరు నేరాన్ని నిరూపించకపోతే నేను జీవితాంతం జైలులోనే ఉండేవాడినని, అదే జరిగితే తన తండ్రి గురించి తెలుసుకునే అవకాశమే లేకుండా పోయేది అని మను అంటాడు.
మనుపై అనుపమ ఫైర్...
మనుపై అనుపమ ఫైర్ అవుతుంది. ఇప్పుడే ఓ సమస్య నుంచి బయటపెడ్డావు. మళ్లీ వెంటనే సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు. తండ్రి గురించి తెలుసుకోవాలన్న ఆరాటం నీకు ఎందుకు అని కొడుకును నిలదీస్తుంది. మధ్యలో మహేంద్ర మాట్లాడబోతాడు. అతడి మాటలను అనుపమ ఆపేస్తుంది.
నేను ఇన్ని బాధలు భరిస్తూ ఇంకా బతికుతున్నది రెండు కారణాల కోసమేనని మను అంటాడు. నన్ను కన్న తల్లిని అమ్మ అని పిలిచి ఆమె ప్రేమను మనసారా పొందాలి. మరొకటి నా తండ్రి ఎవరో తెలుసుకొని నాకు ఎందుకిలా అన్యాయం చేశావని నిలదీయాలి. ఇవి రెండే నా ముందు లక్ష్యాలు అని మను అంటాడు.
తండ్రి గురించి ఆలోచించొద్దు...
తండ్రి గురించి ఆలోచించొద్దు అని ఎ న్నిసార్లు చెప్పిన వినవా...ఇకనైనా నీ ఆలోచనలు మార్చుకోమని మనుతో అంటుంది అనుపమ. నువ్వు ఎంచుకున్న దారి సరైందని కాదని అంటుంది. ఓ బిడ్డ తన తండ్రిని తెలుసుకోవద్దా అని అనుపమను ప్రశ్నిస్తాడు. నా తండ్రి ఎవరు అని అడిగితే మీరు చెప్పరు. నేను తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అడ్డుపడటం న్యాయమేనా అని అనుపమను నిలదీస్తాడు. నువ్వు ఎప్పటికీ నా మాట వినవు. ఇక నీ జీవితం ఇంతేనని మనుతో అంటుంది అనుపమ.
శైలేంద్రను కొట్టిన దేవయాని...
ఎండీ సీట్ అనే బలహీనతను అడ్డం పెట్టుకొని తన ఎమోషన్స్‌తో మను, వసుధార ఆడుకోవడం శైలేంద్ర జీర్ణించుకోలేకపోతాడు. అదే ఆలోచిస్తాడు. కొడుకు దగ్గరకు వచ్చి అతడి చెంపపై గట్టిగా ఒక్కటి కొడుతుంది దేవయాని. అసలు ఏం జరిగిందో చెప్పమని గట్టిగా అడుగుతుంది.
మనును బయటకు రప్పించడానికి వసుధార, మను కలిసి తనకు నమ్మకద్రోహం చేశారని, ఎండీ సీట్‌ను ఎరగా చూపించి తనను పిచ్చొడిని చేసి ఆడుకున్నారని అంటాడు. నాతోనే అండర్‌గ్రౌండ్‌లో ఉన్న రాజీవ్‌ను బయటకు రప్పించి పోలీసులకు పట్టించేలా చేశారని దేవయానితో జరిగిన కథ మొత్తం చెబుతాడు శైలేంద్ర.
వసుధార గురించే ఆలోచనలు...
మరోవైపు జైలులో కూడా వసుధార గురించే ఆలోచిస్తూ ఉంటాడు రాజీవ్.గోడపై వసుధార బొమ్మ గీస్తాడు రాజీవ్. నేను ఎక్కడున్న నీ కోసమే ఆలోచిస్తా. నిన్ను సొంతం చేసుకోవడానికి ప్రతిక్షణం ప్రయత్నిస్తానని అంటాడు. ఎప్పటికైనా నీ మెడలో తాళికట్టితీరుతానని అంటాడు.
జైలులో ఉన్న మనును కలవడానికి ప్రతిరోజు వసుధార జైలుకు వెళ్లిన సంగతిని గుర్తుచేసుకొని బాధపడతాడు రాజీవ్. తనను కలవడానికి వసుధార రాదనే ఊహను భరించలేకపోతాడు. వసుధారను కలవడానికి తానే జైలు నుంచి తప్పించుకోవాలని అనుకుంటాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.