Guppedantha Manasu Today Episode: మ‌నును మోసం చేసిన వ‌సుధార - బావపై మ‌న‌సు ప‌డ్డ ఏంజెల్ - విశ్వ‌నాథం షాక్‌-guppedantha manasu april 6th episode vasudhara helps angel guppedantha manasu serial today highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Today Episode: మ‌నును మోసం చేసిన వ‌సుధార - బావపై మ‌న‌సు ప‌డ్డ ఏంజెల్ - విశ్వ‌నాథం షాక్‌

Guppedantha Manasu Today Episode: మ‌నును మోసం చేసిన వ‌సుధార - బావపై మ‌న‌సు ప‌డ్డ ఏంజెల్ - విశ్వ‌నాథం షాక్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 06, 2024 07:07 AM IST

Guppedantha Manasu Today Episode: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో మ‌న‌వ‌డు మ‌నును చూసి విశ్వ‌నాథం ఎమోష‌న‌ల్ అవుతాడు. త‌న‌ను తాత‌య్య అని పిల‌వ‌మ‌ని మ‌నును కోరుతాడు. . కానీ మ‌ను అందుకు ఒప్పుకోడు. త‌న‌కు కొత్త బంధాలు అక్క‌ర‌లేద‌ని విశ్వ‌నాథంతో అంటాడు.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu Today Episode: ఇంట్లో నుంచి చెప్ప‌కుండా వెళ్లిపోయిన అనుప‌మ అడ్రెస్‌ను క‌ష్ట‌ప‌డి ప‌ట్టుకుంటారు వ‌సుధార‌, మ‌హేంద్ర‌. ఆమెను బ‌తిమిలాడి తిరిగి ఇంటికి తీసుకొస్తారు. మ‌రోవైపు అనుప‌మ‌కు కొడుకు ఉన్నాడ‌ని తెలిసి విశ్వ‌నాథం కూడా షాక‌వుతాడు. అస‌లు అనుప‌మ‌కు పెళ్లే కాలేద‌ని అంటాడు. చాలా ఏళ్లు మ‌న‌కు అత్త‌య్య దూరంగా ఉంది కాబ‌ట్టి ఆమెకు పెళ్లి జ‌రిగి ఉంటుంద‌ని ఏంజెల్ అనుమానం వ్య‌క్తంచేస్తుంది.

మ‌ను ఉన్నాడ‌నే నిజం...

మ‌న‌కు తెలియ‌కుండా పెళ్లి చేసుకుంటే ఆ త‌ర్వాత అయినా చెబితే బాగుండేది. క‌నీసం కొడుకు పుట్టాడ‌నే విష‌యం కూడా చెప్ప‌లేద‌ని విశ్వ‌నాథం బాధ‌ప‌డ‌తాడు. అత్త‌య్య ఎప్పుడు ప్రైవ‌సీ కోరుకుంటుంద‌ని, త‌న లైఫ్ త‌న‌దిగానే బ‌తుకుతుంటుంద‌ని విశ్వ‌నాథానికి స‌ర్ధిచెబుతుంది ఏంజెల్‌.

ఏది ఏమైనా మ‌ను అత్త‌య్య కొడుకే నీకు మ‌న‌వ‌డేన‌ని అంటుంది. మ‌ను ఎలా ఉంటాడ‌ని ఏంజెల్‌ను అడుగుతాడు విశ్వ‌నాథం. మ‌ను తెలుగు సినిమా హీరోలా ఉంటాడ‌ని తాత‌య్య‌తో అంటుంది ఏంజెల్‌. మ‌నుపై రూపురేఖ‌లు, స్టైల్ గురించి పొగ‌డ్త‌లు కురిపిస్తుంది.

మ‌నును చూడాల‌న్న విశ్వ‌నాథం...

మ‌నును చూడాల‌ని ఉంద‌ని విశ్వ‌నాథం అంటాడు. మ‌న‌వ‌డు వ‌చ్చాడ‌ని తెలియ‌గానే ఈ మ‌న‌వ‌రాలిని మ‌ర్చిపోయావ‌ని ఏంజెల్ సెటైర్ వేస్తుంది. నువ్వు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోతే చూసుకోవ‌డానికైనా మ‌న‌వ‌డు నాకు తోడుగా ఉంటాడు క‌దా అని అంటాడు.

నీతో ఆస్తి గొడ‌వ‌లు వ‌చ్చిన‌ప్పుడు నావైపు నిల‌బ‌డ‌టానికి మ‌ను అండ‌గా ఉంటాడ‌ని విశ్వ‌నాథం జోక్ చేస్తాడు. ఇద్ద‌రిని మ‌డ‌త‌పెట్టేస్తాన‌ని స‌ర‌దాగా తాత‌య్య‌కు వార్నింగ్ ఇస్తుంది ఏంజెల్‌. త‌ప్ప‌కుండా మ‌నును త‌మ ఇంటికి తీసుకొస్తాన‌ని విశ్వ‌నాథానికి మాటిస్తుంది ఏంజెల్‌.

ఏంజెల్ ప్లాన్ ఫెయిల్‌...

మ‌నును త‌మ ఇంటికి ర‌ప్పించేందుకు ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఏంజెల్‌. మ‌నుకు ఫోన్ చేసి మ‌నం ఓసారి క‌ల‌వాల‌ని అంటుంది. ఎందుకు, ఏ విష‌యంలో క‌ల‌వాల‌న్న‌ది మాత్రం చెప్ప‌దు. నాకు మీతో ఓ ప‌ని ప‌డింద‌ని అంటుంది. ఫోన్‌లో కాకుండా మిమ్మ‌ల్ని క‌లిసి డైరెక్ట్‌గా ఓ ర‌హ‌స్యం చెప్పాల‌ని అంటుంది.

ఏంజెల్ చెప్పిన చోటుకు తాను రాన‌ని మ‌ను అంటాడు. ఆడ‌పిల్ల పిలిచిన‌ప్పుడు ఎక్క‌డికి, ఎప్పుడు అని అడ‌క్కుండా వ‌స్తే మంచిద‌ని అంటుంది. ఎంత చెప్పిన మ‌ను మాత్రం ఏంజెల్ మాట విన‌కుండా ఫోన్ క‌ట్ చేస్తాడు. త‌న ప్లాన్ ఫెయిల‌వ్వ‌డంతో ఏంజెల్ డిస‌పాయింట్ అవుతుంది.

వ‌సుధార సాయం...

విశ్వ‌నాథం ద‌గ్గ‌ర‌కు మ‌నును ర‌ప్పించ‌డంలో వ‌సుధార సాయం తీసుకోవాల‌ని ఏంజెల్ ఫిక్స‌వుతుంది. వ‌సుధార‌కు ఫోన్ చేసి తాత‌య్య ద‌గ్గ‌ర‌కు ఏదో ఒక‌టి చెప్పి మ‌నును తీసుకురావాల‌ని కోరుతుంది ఏంజెల్‌. విష‌యం దాచిపెట్టి మ‌నును విశ్వ‌నాథం ద‌గ్గ‌ర‌కు తీసుకురావ‌డం మోసం అవుతుందేమోన‌ని వ‌సుధార కంగారు ప‌డుతుంది. కానీ ఏంజెల్ బ‌ల‌వంత‌పెట్ట‌డంతో కాద‌న‌లేక‌పోతుంది.

వ‌సుధార రిక్వెస్ట్‌...

విశ్వ‌నాథం ద‌గ్గ‌రికి అని చెప్ప‌కుండా స‌ర్‌ప్రైజ్ అంటూ మ‌నును బ‌య‌ట‌కు తీసుకెళుతుంది వ‌సుధార‌. ఏంజెల్ ర‌మ్మ‌న్న రాని మ‌ను...వ‌సుధార అడ‌గ్గానే వెంట‌నే ఒప్పేసుకుంటాడు. ఎక్క‌డికి వెళుతున్నామ‌ని వ‌సుధార‌ను అడుగుతాడు మ‌ను. కానీ వ‌సుధార స‌మాధానం ఇవ్వ‌కుండా నేరుగా విశ్వ‌నాథం ద‌గ్గ‌ర‌కు మ‌నును తీసుకెళుతుంది.

మ‌నును చూడ‌గానే విశ్వ‌నాథం ఎమోష‌న‌ల్ అవుతాడు. మ‌నును కౌగిలించుకొని క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. నేను మీ తాత‌య్య‌ను, నువ్వు నా మ‌న‌వ‌డివి అని మ‌నుతో అంటాడు విశ్వ‌నాథం. ఇన్నాళ్లు నా ఆస్తికి, పేరుకు వార‌సులు లేర‌ని వెలితిగా ఉండేది అది ఇప్పుడు తొలిగిపోయింద‌ని విశ్వ‌నాథం ఎమోష‌న‌ల్ అవుతాడు.

విశ్వ‌నాథం షాక్‌...

త‌న‌ను ఒక్క‌సారి తాత‌య్య అని పిల‌వ‌మ‌ని మ‌నును కోరుతాడు విశ్వ‌నాథం. కానీ పిల‌వ‌ను. పిల‌వ‌లేన‌ని మ‌ను స‌మాధాన‌మిస్తాడు. అత‌డి స‌మాధానంతో విశ్వ‌నాథంతో పాటు వ‌సుధార‌, ఏంజెల్ షాక‌వుతారు. నేను ప‌రాయివాడిని కాద‌ని, మీ అమ్మ‌కు తండ్రిని అని విశ్వ‌నాథం అంటాడు. తాను కొత్త‌గా ఏ బంధాలు, ప్రేమ‌లు కోరుకోవ‌డం లేద‌ని మ‌ను స‌మాధాన‌మిస్తాడు.

కొత్త‌గా వ‌చ్చింది కాద‌ని, ర‌క్త సంబంధం అని విశ్వ‌నాథం అంటాడు. ఇన్నాళ్లు ఈ బంధం ఏమైపోయింద‌ని విశ్వ‌నాథాన్ని నిల‌దీస్తాడు మ‌ను. కాలంతో కొన్ని బంధాలు మ‌రుగున ప‌డ‌తాయి. టైమ్ వ‌చ్చిన‌ప్పుడు మ‌ళ్లీ ఉనికిలోకి వ‌స్తాయ‌ని మ‌నుకు స‌ర్ధిచెబుతాడు విశ్వ‌నాథం.

క‌న్న‌బిడ్డ‌గా చూడ‌టం లేదు...

అనుప‌మ‌కు పెళ్లైంద‌ని, ఓ బిడ్డ ఉన్నాడ‌ని త‌న‌కు తెలియ‌ద‌ని విశ్వ‌నాథం అంటాడు. ఇప్పుడు కూడా అలాగే ఉండ‌మ‌ని విశ్వ‌నాథంపై ఫైర్ అవుతాడు మ‌ను. మ‌ను తీరును ఏంజెల్‌, వ‌సుధార త‌ప్పు ప‌డ‌తారు. మీరు అనుప‌మ‌కు క‌న్న‌తండ్రి అంటున్నారు. ఆవిడ మాత్రం న‌న్ను క‌న్న‌బిడ్డ‌గా చూడ‌టం లేదు. న‌న్ను అమ్మ అని పిల‌వ‌ద్దొని అన్న‌ది.

అలాంట‌ప్పుడు మిమ్మ‌ల్ని తాత‌య్య అని ఎలా పిలుస్తాను. మీ బంధాన్ని ఎలా అంగీక‌రిస్తాన‌ని విశ్వ‌నాథంతో అంటాడు మ‌ను. ఆవిడే నాకు లేన‌ప్పుడు మీరు ఎలా ద‌గ్గ‌ర‌వుతార‌ని ప్ర‌శ్నిస్తాడు. మ‌ను ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా విశ్వ‌నాథం మౌనంగా ఉండిపోతాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point