Erra Cheera: రాజేంద్ర ప్రసాద్ మనవరాలితో హారర్ మూవీ.. 23 పాత్రలు, 45 నిమిషాల గ్రాఫిక్స్.. ఎర్రచీర హైలెట్స్-erra cheera the beginning glimpse release actor rajendra prasad granddaughter baby tejaswini erra cheera highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Erra Cheera: రాజేంద్ర ప్రసాద్ మనవరాలితో హారర్ మూవీ.. 23 పాత్రలు, 45 నిమిషాల గ్రాఫిక్స్.. ఎర్రచీర హైలెట్స్

Erra Cheera: రాజేంద్ర ప్రసాద్ మనవరాలితో హారర్ మూవీ.. 23 పాత్రలు, 45 నిమిషాల గ్రాఫిక్స్.. ఎర్రచీర హైలెట్స్

Sanjiv Kumar HT Telugu
Nov 06, 2024 12:55 PM IST

Erracheera The Beginning Glimpse Release Event: తెలుగులో హారర్ అండ్ డివోషనల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ఎర్రచీర. ఇందులో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్ర పోషించింది. సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహించిన ఎర్రచీర గ్లింప్స్ రిలీజ్ చేశారు.

రాజేంద్ర ప్రసాద్ మనవరాలితో హారర్ మూవీ.. 23 పాత్రలు, 45 నిమిషాల గ్రాఫిక్స్.. ఎర్రచీర హైలెట్స్
రాజేంద్ర ప్రసాద్ మనవరాలితో హారర్ మూవీ.. 23 పాత్రలు, 45 నిమిషాల గ్రాఫిక్స్.. ఎర్రచీర హైలెట్స్

Erra Cheera Glimpse Release: బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది.

ఎర్రచీర గ్లింప్స్ రిలీజ్

"ఎర్రచీర - ది బిగినింగ్" మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 20న "ఎర్రచీర - ది బిగినింగ్" తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఎర్రచీర సినిమా గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు.

ఆ ట్రెండ్‌లోనే

ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. "ఎర్రచీర ది బిగినింగ్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌కు రావడం హ్యాపీగా ఉంది. హారర్, దేవుడు కాన్సెప్ట్‌లతో సినిమాలు చేయడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. ఈ సినిమా కూడా ఆ ట్రెండ్‌లోనే వస్తుందని అనుకోవచ్చు. అయితే ఇంకా డిఫరెంట్‌గా ఈ మూవీని రూపొందించారు. బేబి సాయి తేజస్విని ముఖ్యపాత్రలో నటించింది. ఇండస్ట్రీకి కొత్త వాళ్లు రావాలి. అప్పుడే కొత్త టాలెంట్ మనకు దొరుకుతుంది. ఎర్రచీర సినిమా విజయం సాధించి ఈ టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా" అని తెలిపారు.

పాత్రలు-గ్రాఫిక్స్

చిత్ర దర్శక నిర్మాత, నటుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. "ఎర్రచీర - ది బిగినింగ్ సినిమా గ్లింప్స్‌ను కార్తీకమాసం పర్వదినం సందర్భంగా ఈ పెద్దల చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. యాక్షన్, మదర్ సెంటిమెంట్‌తో ఈ సినిమాను రూపొందించాను. సినిమాలోని 22 పాత్రలతో పాటు ఎర్రచీర కూడా 23వ పాత్ర పోషిస్తుంది. మొత్తం 45 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటాయి" అని అన్నారు.

మరిన్ని హైలెట్స్

"ఈ ఎర్రచీరకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బేబి సాయితేజస్విని నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ కథలో డివోషనల్ టచ్ కూడా ఉంటుంది. డిసెంబర్ 20వ తేదీన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఎర్రచీర సినిమాను విడుదల చేయనున్నాం. మరిన్ని ప్రెస్ మీట్స్‌లో ఇంకా డీటెయిల్డ్‌గా మూవీ హైలైట్స్ తెలియజేస్తాను" అని డైరెక్టర్ సుమన్ బాబు పేర్కొన్నారు.

మంచి బాండింగ్ ఉంది

"ఎర్రచీర ది బిగినింగ్ సినిమా గ్లింప్స్‌లో హర హర మహాదేవా అని వచ్చినప్పుడు అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. ఈ గ్లింప్స్ మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాం. మా టీమ్ క్వాలిటీ మూవీ చేసేందుకు ఎంత కష్టపడ్డారో మీకు ఈ గ్లింప్స్‌లోనే తెలుస్తుంది. బేబి సాయి తేజస్విని చక్కగా నటించింది. మూవీలో ఆమెకు నాకు మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. కథలో మదర్ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమా చూసిన వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. మా ఎర్రచీర సినిమాను మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా" అని హీరోయిన్ కారుణ్య చౌదరి తెలిపింది.

Whats_app_banner