Double Ismart Theatrical Rights: దుమ్మురేపిన డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ హక్కులు.. భారీ మొత్తానికి కొన్న హనుమాన్ నిర్మాత-double ismart theatrical rights hanuman producers prime show entertainment bought the rights for a huge sum ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Double Ismart Theatrical Rights: దుమ్మురేపిన డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ హక్కులు.. భారీ మొత్తానికి కొన్న హనుమాన్ నిర్మాత

Double Ismart Theatrical Rights: దుమ్మురేపిన డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ హక్కులు.. భారీ మొత్తానికి కొన్న హనుమాన్ నిర్మాత

Hari Prasad S HT Telugu

Double Ismart Theatrical Rights: రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ కు ముందే భారీ బిజినెస్ చేస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను హనుమాన్ నిర్మాతలు భారీ మొత్తానికి కొనుగోలు చేయడం విశేషం.

దుమ్మురేపిన డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ హక్కులు.. భారీ మొత్తానికి కొన్న హనుమాన్ నిర్మాత

Double Ismart Theatrical Rights: రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో గతంలో ఇస్మార్ట్ శంకర్ మూవీ వచ్చిన సంగతి తెలుసు కదా. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ మూవీ డబుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వెల్ వస్తోంది. మొదటి సినిమా సక్సెస్ ఇచ్చిన నమ్మకంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను హనుమాన్ నిర్మాతలు భారీ మొత్తానికి దక్కించుకున్నారు.

డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ హక్కులు

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు కొన్నాళ్లుగా అసలు హిట్ దక్కలేదు. పైగా లైగర్ రూపంలో పెద్ద దెబ్బే పడింది. అయినా అతని నెక్ట్స్ మూవీ డబుల్ ఇస్మార్ట్ కు మాత్రం క్రేజ్ తగ్గలేదు. రామ్ పోతినేనితో కలిసి గతంలో అతడు తీసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ సంచలన విజయం సాధించడంతో ఈ సీక్వెల్ హక్కులను హనుమాన్ నిర్మాత ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఏకంగా రూ.54 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. హిందీ వెర్షన్ హక్కులు కాకుండా మిగతా భాషల హక్కుల కోసం ఇంత మొత్తం చెల్లిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. ఆగస్ట్ 15న మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఆ హాలిడే వీకెండ్ ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ ఖాయమన్న అంచనా నేపథ్యంలో పెద్ద మొత్తం ఇవ్వడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మొత్తం రూ.60 కోట్లు కాగా.. ఇందులో రూ.6 కోట్లు రికవరబుల్ అడ్వాన్స్, రూ.54 కోట్లు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ గా ఉంది.

డబుల్ ఇస్మార్ట్.. డబుల్ ఫన్

డబుల్ ఇస్మార్ట్ మూవీలో రామ్ పోతినేని సరసన కావ్యా థాపర్ నటిస్తోంది. మణిశర్మ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ నుంచి వచ్చిన మాస్ ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రెండో పాట మార్ ముంత చోడ్ చింత రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ కు మరో నెల రోజులు కూడా లేకపోవడంతో మేకర్స్ ఇక పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర పోషించడంతో హిందీ బెల్ట్ లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. లైగర్ మూవీతో ఆర్థిక నష్టాలతోపాటు డైరెక్టర్ గానూ ఎదురు దెబ్బ తిన్న పూరి జగన్నాథ్ మరోసారి ఈ డబుల్ ఇస్మార్ట్ తన మునుపటి మార్క్ చూపించాలని తహతహలాడుతున్నాడు.

మొదట పుష్ప 2 ఆ తేదీలో రిలీజ్ అవుతుందని భావించినా.. ఆ సినిమా వాయిదా పడటంతో ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో ఆ సమయంలో పెద్ద సినిమాలు లేకపోవడం ఈ మూవీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అటు రామ్ పోతినేని కూడా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత అతడు తీసిన రెడ్, ది వారియర్, స్కంధ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడ్డాయి. దీంతో అతడు కూడా ఈ డబుల్ ఇస్మార్ట్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.