Double iSmart Steppamaar Song: డబుల్ ఇస్మార్ట్ ఫుల్ మాస్ సాంగ్ వచ్చేసింది.. స్టెప్పులే కాదు గొంతు కూడా విప్పిన రామ్-double ismart steppamaar song released ram pothineni puri jagannadh mani sharma mass beat song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Double Ismart Steppamaar Song: డబుల్ ఇస్మార్ట్ ఫుల్ మాస్ సాంగ్ వచ్చేసింది.. స్టెప్పులే కాదు గొంతు కూడా విప్పిన రామ్

Double iSmart Steppamaar Song: డబుల్ ఇస్మార్ట్ ఫుల్ మాస్ సాంగ్ వచ్చేసింది.. స్టెప్పులే కాదు గొంతు కూడా విప్పిన రామ్

Hari Prasad S HT Telugu
Jul 01, 2024 07:06 PM IST

Double iSmart Steppamaar Song: ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి స్టెప్పామార్ అంటూ అదిరిపోయే సాంగ్ వచ్చేసింది. ఈ పాటకు స్టెప్పులేయడమే కాదు.. గొంత కూడా విప్పాడు రామ్.

డబుల్ ఇస్మార్ట్ ఫుల్ మాస్ సాంగ్ వచ్చేసింది.. స్టెప్పులే కాదు గొంతు కూడా విప్పిన రామ్
డబుల్ ఇస్మార్ట్ ఫుల్ మాస్ సాంగ్ వచ్చేసింది.. స్టెప్పులే కాదు గొంతు కూడా విప్పిన రామ్

Double iSmart Steppamaar Song: రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్ లో హిట్ అయిందో మనకు తెలుసు. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానుండగా.. తాజాగా సోమవారం (జులై 1) స్టెప్పామార్ అంటూ ఓ మాస్ సాంగ్ రిలీజ్ చేశారు.

మాస్ బీట్స్‌తో స్టెప్పామార్ సాంగ్

ఐదేళ్ల కిందట వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో టైటిల్ సాంగ్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ సాంగ్ ఓ ఊపు ఊపింది. ఈ మాస్ట్ బీట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ నుంచి కూడా అలాంటిదే మరో పాట వచ్చింది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి స్టాప్పామార్ అంటూ మాస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇందులోనూ రామ్ పోతినేని తన మాస్ స్టెప్స్ తో అదరగొట్టేశాడు. అంతేకాదు పాటలో గొంతు కూడా విప్పాడు. భాస్కరభట్ల లిరిక్స్ అందించిన ఈ పాట పక్కా హైదరాబాద్ గల్లీల మాస్ బీట్స్ కు అద్దం పడుతోంది. అనురాగ్ కులకర్ణి, సాహితి, రామ్ ఈ పాట పాడారు. ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ ఎలా ఊపేసిందో ఇప్పుడీ పాట కూడా అలాగే మాస్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

మామూలుగానే డ్యాన్స్ లతో ఇరగదీసే రామ్.. ఈ పాటలోనూ మాస్ స్టెప్పులేశాడు. ఈ మూవీలో రామ్ సరసన కావ్యా థాపర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండటం విశేషం. కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నారు రామ్ పోతినేని, పూరి జగన్నాథ్. మరి ఈ ఇద్దరూ కలిసి ఐదేళ్ల కిందట చేసిన మ్యాజిక్ ను ఈ సీక్వెల్ తోనూ రిపీట్ చేస్తారేమో చూడాలి.

డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్

డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. ఇండిపెండెన్స్ డేను ఈ మూవీ లాక్ చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ గత నెల 15న అధికారికంగా ప్రకటించింది. రామ్ పోతినేని కొత్త పోస్టర్‌తో విడుదల తేదీని వెల్లడించింది. ఇక ఆ రోజు రిలీజ్ అవుతుందని భావించిన పుష్ప 2 డిసెంబర్ కు వాయిదా పడిన విషయం తెలిసిందే.

“డబుల్ ఇంపాక్ట్‌తో లాక్, లోడ్ అయింది. ఉస్తాద్ రామ్ పోతినేని, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ఎంతో ఎదురుచూస్తున్న యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది” అని మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ అవుతుందని మూవీ టీమ్ ఇప్పటికే ఖరారు చేసింది.

WhatsApp channel