Ismart Shankar Sequel: ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ సిద్ధం.. రామ్-పూరి కాంబో రిపీట్..!-ram pothineni and puri jagannadh combination repeat ismart shankar sequel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ismart Shankar Sequel: ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ సిద్ధం.. రామ్-పూరి కాంబో రిపీట్..!

Ismart Shankar Sequel: ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ సిద్ధం.. రామ్-పూరి కాంబో రిపీట్..!

Ismart Shankar Sequel: ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ రాబోతుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. పూరి జగన్నాథ్ చెప్పిన స్టోరీ లైన్ రామ్ పోతినేనికి నచ్చడంతో ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. రామ్ పుట్టినరోజున ఈ మూవీ గురించి ప్రకటన వచ్చే అవకాశముంది.

ఇస్మార్ట్ కాంబో రిపీట్

Ismart Shankar Sequel: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటి నుంచో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్న రామ్‌కు ఈ మూవీతో మాస్ మసాలా సక్సెస్ దక్కింది. అంతేకాకుండా దర్శకుడు పూరి జగన్నాథ్‌ కూడా చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్నారు. అయితే లైగర్ సినిమాతో మరోసారి పరాజయాన్ని చవిచూసిన పూరీ.. ఇప్పుడు రామ్‌తో కలిసి మరోసారి పనిచేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరి కాంబినేషన్‌ మరోసారి రిపీట్ కానున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రామ్‌కు పూరీ ఇప్పటికే కథను కూడా వినిపించారట. ఇందుకు ఈ యంగ్ హీరో కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే రామ్ పుట్టిన రోజు నాడు(May 15) ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. ఈ విషయంపై సదరు దర్శకుడు, హీరో నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

ఇది కాకుండా హీరో రామ్‌కు మరో దర్శకుడు కూడా కథను వినిపించారట. దీంతో పాటు పూరీ చెప్పిన స్టోరీ లైన్ కూడా నచ్చడంతో ఈ రెండు మూవీస్‌ను పట్టాలెక్కించేపనిలో పడ్డాడు రామ్. ఇస్మార్ట్ శంకర్‌లో ఈ హీరో పూర్తి విభిన్నంగా కనిపించాడు. ఈ చిత్రంతో పూరి జగన్నాథ్ సత్తా ఏంటో కూడా ప్రేక్షకులకు మరోసారి రుజువైంది. దీంతో అదే మ్యాజిక ఇంకోసారి రిపీట్ చేయాలని ఇరువురు భావిస్తున్నట్లు తెలుస్తోంది. లైగర్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకుని మంచి కథతో కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం రామ్.. బోయపాటి సినిమాలో ఓ సినిమా చేస్తున్నాడు. మే 15న ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్‌గా చేస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సంతోష్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అక్టోబరు 20న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.