Devara Movie: దేవర క్లైమాక్స్ ‘బహుబలి 1’లాగే..: సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. జాన్వీ కోసం వెయిట్ చేయాల్సిందేనట
Devara Movie: దేవర చిత్రం గురించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కీలక విషయాలు చెప్పారు. క్లైమాక్స్ గురించి హైప్ పెంచేశారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ పాత్ర ఎప్పుడు వస్తుందో కూడా వెల్లడించారు.
ప్రస్తుతం అంతటా హైవోల్టేజ్ యాక్షన్ మూవీ దేవర ఫీవర్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్‍లో జరుగుతున్నాయి. భారీ స్థాయిలో బుకింగ్స్ సాగుతుండటంతో బంపర్ ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం ఈ శుక్రవారం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ చిత్రం గురించి ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
‘బాహుబలి 1’ రేంజ్‍లో క్లైమాక్స్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 1లో క్లైమాక్స్ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న బాహుబలి 2 రిలీజ్ అయ్యే వరకు కొనసాగింది. దేశం మొత్తం ఇదే అంశంపై చర్చలు సాగాయి. అంతలా బాహుబలి 1 క్లైమాక్స్ ప్రభావం చూపించింది. ఇప్పుడు, దేవర క్లైమాక్స్ కూడా అదే రేంజ్‍లో బలమైన ప్రభావం చూపిస్తుందని రత్నవేలు తెలిపారు.
దేవర క్లైమాక్స్ ప్రేక్షకులు మరిచిపోలేని విధంగా ఉంటుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రత్నవేలు వెల్లడించారు. “బాహుబలి 1 లాగానే దేవర క్లైమాక్స్ ప్రేక్షకులపై బలమైన, మరిచిపోలేని ప్రభావాన్ని చూపిస్తుంది” అని రత్నవేలు చెప్పారు. దీంతో దేవర క్లైమాక్స్ ఏమై ఉంటుందనే హైప్ మరింత పెరిగిపోయింది.
జాన్వీ సెకండాఫ్‍లోనే..
దేవర సినిమాలో జాన్వీ కపూర్‌ను చూసేందుకు వేచిచూడాల్సిందేనని రత్నవేలు హింట్ ఇచ్చారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ఎంట్రీ సెకండాఫ్‍లో ఉంటుందని వెల్లడించారు.
ఈ మూవీలో దేవర క్యారెక్టర్ పవర్‌ఫుల్‍గా ఉంటుందని, అయితే థియేటర్ల నుంచి బయటికి వచ్చేటప్పుడు వర పాత్రే ఎక్కువగా గుర్తుంటుందని కూడా రత్నవేలు తెలిపారు. దీంతో భారీ ట్విస్ట్ ఉండనుందనే అంచనాలు వస్తున్నాయి. ఈ మూవీలో దేవర, వర అనే తండ్రీకొడుకులుగా డ్యుయల్ రోల్ చేశారు ఎన్టీఆర్.
క్లైమాక్స్‌పై ఎన్టీఆర్ కూడా..
దేవర క్లైమాక్స్ గురించి కరణ్ జోహార్‌తో ఇంటర్వ్యూలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. చివరి 40 నిమిషాలు అదిరిపోతుందని అన్నారు. అయితే, చివరి 10 నిమిషాలు ఎమోషనల్ రైడ్‍లా ఉంటుందని అన్నారు. ప్రేక్షకులు దాన్ని చూసేందుకు వేచిచూస్తున్నానని తెలిపారు. కరణ్ జోహార్ కూడా ఆశ్చర్యపోయానని అన్నారు. మొత్తంగా దేవర క్లైమాక్స్‌పై అంచనాలు మాత్రం భారీగా పెరిగిపోయాయి.
దేవర మూవీకి పార్ట్-2 కూడా ఉండనుంది. ముందు రెండు భాగాలు అనుకోలేదని, అయితే చెప్పాల్సిన కథ పెద్దగా ఉండటంతో తప్పలేదని ఎన్టీఆర్ కూడా అన్నారు. ఒకవేళ దేవర క్లైమాక్స్ అంతలా ఇంపాక్ట్ చూపిస్తే పార్ట్-2పై హైప్ మరింత పెరుగుతుంది.
దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ డ్రామా మూవీగా రూపొందించారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్‍గా చేసిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంతోనే టాలీవుడ్‍లోకి అడుపెడుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్‍గా నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‍పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
టాపిక్