Prasanna Vadanam OTT: ఓటీటీలోకి నెలలోపే సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Prasanna Vadanam OTT Streaming: ఓటీటీలోకి నెల కాకముందే సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రసన్నవదనం సినిమా రానుందని ప్రచారం జరుగుతోంది. సుహాస్ నటించిన ప్రసన్నవదనం మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Prasanna Vadanam OTT Release: ప్రస్తుతం కాలంలో ఎలాంటి సినిమా అయినా థియేటర్‌లో కంటే ఓటీటీలోనే వీక్షించేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి పెద్ద హీరోలు నటించిన సినిమాలు లేదా అదిరిపోయే విజువల్ వండర్స్ మూవీస్‌ను మాత్రమే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు.
చిన్న సినిమాలు, లేదా ఆద్యంతం ఉత్కంఠత కలిగించే క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ చిత్రాలను ఓటీటీలోనే చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మూవీ లవర్స్. వారి అభిరుచికి అనుగుణంగానే ప్రతివారం ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ఓటీటీ సంస్థలు.
ఇక హిట్ ఫ్లాప్ అని తేడా లేకుండా థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అలా లేటెస్ట్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని నెల కాకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆ సినిమానే టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన ప్రసన్నవదనం మూవీ.
మే 3న ఎంతో గ్రాండ్‌గా విడుదలైన ప్రసన్నవదనం సినిమాకు మంచి టాక్ వచ్చింది. సినిమాలో ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయని ఆడియెన్స్ పబ్లిక్ టాక్‌లో చెప్పారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయిందని అన్నారు. ఫేస్ బ్లైండ్‌నెస్ (మొహాలు గుర్తు పట్టకపోవడం) అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ సైతం వచ్చాయి.
ఇలా ప్రసన్నవదనం సినిమా వారం రోజుల్లోనే రూ. 5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుని ప్రాఫిట్ కూడా తీసుకొచ్చిందని నిర్మాతలు తెలిపారు. ఇక ఈ వెరైటీ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ప్రమోషన్స్ జోరుగా చేశారు. మొదటి నుంచి సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది.
అయితే, ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ తెలిసినప్పటికీ స్ట్రీమింగ్ డేట్ తెలియలేదు. ఇప్పుడు ఈ తేదిపైనే జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రసన్నవదనం సినిమాను మొదట థియేట్రికల్ రిలీజ్ తర్వాత 30 రోజులకు ఓటీటీలో విడుదల చేస్తారని టాక్ వచ్చింది. కానీ, ఇప్పుడు దానికంటే ముందుగానే నెల కాకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారట.
అంటే, మరికొన్ని రోజుల్లోనే మే నెలాఖరులోనే ప్రసన్నవదనం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ఓటీటీ లవర్స్ ఎంచక్కా ఈ క్రేమ్ థ్రిల్లర్ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇదిలా ఉంటే, ప్రసన్నవదనం సినిమాను డైరెక్టర్ అరుణ్ వైకే తెరకెక్కించారు. ఆయన ఇదివరకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర వర్క్ చేశారు.
ప్రసన్నవదనం చిత్రాన్ని లిటిల్ థాట్స్ సినిమాస్ పతాకంపై మణికంఠ జేఎస్, ప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించి నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ నటించారు. వీరితోపాటు హర్ష చెముడు, యాక్టర్ నందు, నితిన్ ప్రసన్న, కుశాలిని, సాయి శ్వేత, సత్య ఇతరులు కీలక పాత్రలు చేశారు.