Brahmamudi October 28th Episode: రాజ్ ఈగో హర్ట్ - సైలెంట్‌గా జారుకున్న రుద్రాణి - కష్టాల్లో పడ్డ కావ్య కంపెనీ
Brahmamudi October 28th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 28 ఎపిసోడ్‌లో రాజ్ ఆఫీస్‌కు వెళ్లేలా చేయడం కోసం ఇంటి పనులు చెబుతుంటారు అపర్ణ, ఇందిరాదేవి. వాటికి భయపడి ఆఫీస్‌కు వెళతాడని అనుకుంటారు. కానీ ఈ ప్లాన్ ఫెయిలవ్వడంతో రాజ్ ఈగోపై దెబ్బకొడతారు.
కూరగాయలు తీసుకొని నడుచుకుంటూ మార్కెట్ నుంచి రాజ్ ఇంటికొస్తాడు. రాజ్‌ను గుర్తుపట్టని రుద్రాణి భయంతో కేకలు వేస్తుంది. ఆమె అరుపులకు భయపడి ఇంట్లో అందరూ కిందికివస్తారు. మంచి కూరగాయలు తేవడంలో తన టాలెంట్ గురించి ఇంట్లో అందరికి గొప్పలు చెబుతాడు రాజ్. కంపెనీకి సీఈవో అయ్యుండి...ఇంటి నౌకరులా ఇలాంటి పనులు చేయడం ఏంటి? చూడటానికి నాకే అదోలా ఉంది. నీకు ఏం ఇబ్బందిగా అనిపించడం లేదా అని రాజ్‌ను అడుగుతుంది రుద్రాణి.
తల్లితో రాజ్ వాదన...
అమ్మనాన్నలతో పాటు నానమ్మ, తాతయ్యలకు లేని ఇబ్బంది నాకు మాత్రం ఎందుకు అని రాజ్ అంటాడు. ఎందుకు నువ్వు ఈ పనులు చేస్తున్నావో నాకు తెలుసు అని అపర్ణ అంటుంది. మీరు నాతో ఈ పనులు ఎందుకుచేస్తున్నారో నాకు తెలుసునని రాజ్ సమాధానమిస్తాడు.
కావ్యను ఆఫీస్ నుంచి పంపిస్తేనే...
కావ్యను ఆఫీస్ నుంచి బయటకు పంపించి..నిన్ను సీఈవో చేస్తేగానే ఆఫీస్‌కు వెళ్లావా అని కొడుకుతో అంటుంది అపర్ణ. కావ్యను సీఈవో చేసి...నన్ను మేనేజర్‌ను చేస్తేనంటే ఒప్పుకొనేది లేదని రాజ్ బదులిస్తాడు. కంపెనీ అప్పుల్లో కూరుకుపోతే తనది బాధ్యత కాదని రాజ్ ప్రకటిస్తాడు. కళావతి కారణమవుతుందని గుర్తుపెట్టుకోవాలని అంటాడు. ఓ అనామకురాలి కింద నువ్వు పనిచేయడం ఏంటి రుద్రాణి కూడా రాజ్‌కు సోపర్ట్ చేస్తుంది.
ఇంట్లో నౌకరుగా...
నువ్వు మేనేజర్ జాబ్ వదిలిపెట్టి ఇంట్లో నౌకరుగానే మిగులిపోతానంటావు అంతేనా అని రాజ్‌తో అంటాడు ప్రకాశం. అయితే నా కారు క్లీన్ చేయమని రాజ్‌కు కీస్ ఇస్తాడు. నువ్వు ఇలాంటి పనులు చేయలేవని, ఆఫీస్‌కు వెళ్లమని రాజ్‌కు స్వప్న సలహా ఇస్తుంది. ఆఫీస్‌లో ఉండేది కావ్యనే కదా...మేనేజర్ అయితే ఏంటి, సీఈవో అయితే ఏంటి అని చెబుతుంది. ఆమె సలహాను రాజ్ పట్టించుకోడు.
బస్‌లో చార్మినార్‌కు...
కార్ వాష్ చేయించుకొస్తానని అంటాడు. రాజ్‌కు తలో పని చెబుతారు. చార్మినార్‌కు వెళ్లి తాతయ్య మోకాళ్ల నొప్పుల కోసం తైలం తెమ్మని ఇందిరాదేవి అంటుంది. కారులేదని బస్‌లోనే వెళ్లమని అంటారు. ఈ పనులు చెబితేనైనా రాజ్ భయపడి ఆఫీస్‌కు వెళాతడాని అనుకుంటారు. కానీ రాజ్ మాత్రం పంతం వీడడు.
కళ్యాణ్ ఇబ్బంది...
అమ్మ గురించి పాట రాయడానికి కళ్యాణ్ ఇబ్బంది పడతాడు. మన ప్రేమ విషయంలో అమ్మ ప్రవర్తించిన తీరు గుర్తురావడంతో ప్రేమగా ఈ పాటను రాయలేకపోతున్నానని అంటాడు.
ఎదిగిన కొడుకు ఎక్కడ తనకు దూరమవుతాడో అనే భయంతో తన ప్రేమను కోపంగా మీ అమ్మ చూపిస్తుందని, తన నుంచి నిన్ను నేను ఎక్కడ వేరుచేస్తానోనని భయపడుతుందని కళ్యాణ్ మనసులో ఉన్న అపోహల్ని తొలగిస్తుంది అప్పు. అవమానించిన మనిషిని ఇంత గొప్పగా ప్రేమించవచ్చని నిన్ను చూస్తేనే తెలుస్తుందని అప్పుతో అంటాడు కళ్యాణ్.
రుద్రాణికి పంచ్...
రుద్రాణి దీర్ఘంగా ఆలోచించడంలో మళ్లీ ఏదో ఫిట్టింగ్ పెట్టబోతుందని ఇందిరాదేవి అనుకుంటుంది. రాజ్ ఇంటి పనులు చేయడం ఏంటి అని ఫైర్ అవుతుంది రుద్రాణి. రాజ్‌పై ప్రేమ ఉంటే వాడి బదులు నువ్వు ఈ ఇంటి పనులు చేయమని రుద్రాణికి సలహా ఇస్తుంది ఇందిరాదేవి. ఆమె మాటలతో రుద్రాణి కంగారుపడి నేను చేయలేనని జారుకుంటుంది. ఇంటి పనులన్నీ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌చేస్తాడు రాజ్.
రిలాక్స్ కావాలని అనుకుంటాడు. కానీ ఓ ఫ్యాన్ రాజ్ ముందు తెచ్చిపెడతాడు ప్రకాషం. ఫ్యాన్ రిపేర్‌చేయమని అంటాడు. నువ్వు కంపెనీ సీఈవోవని మరోసారి రుద్రాణి గుర్తుచేస్తుంది. అయినా వినకుండా ఫ్యాన్‌ను క్షణాల్లోనే రిపేర్ చేసి ఇందిరాదేవి, ప్రకాశం ప్లాన్‌ను తిప్పికొడతాడు.
అనామిక ట్రాప్…
అనామిక ట్రాప్ కారణంగా కంపెనీ పాత క్లయింట్స్ ఎవరూ కావ్య అరెంజ్ చేసిన మీటింగ్‌కు రానని అంటారు. వారితో కావ్య మాట్లాడి మీటింగ్‌కు వచ్చేలా ఒప్పిస్తుంది. క్లయింట్స్ అందరూ మిటింగ్‌కు ఎలా వచ్చారనే ప్లాన్‌ను శృతితో చెబుతుంది కావ్య. అగ్రిమెంట్ డీల్‌లోని నష్టపరిహారం అనే పాయింట్‌ను చూపించి అందరికి మీటింగ్‌కు వచ్చేలా చేశానని అంటుంది. వారందరితో తిరిగి బిజినెస్ చేసేలా ఎలాగైనా చేస్తేనే కంపెనీకి పూర్వ వైభవం వస్తుందని కావ్య అనుకుంటుంది.
భార్యను ఓదార్చిన సుభాష్...
రాజ్‌కు ఎన్ని పనులు చెప్పిన చేయననే మాట అనకుండా అన్ని చకచకా పూర్తిచేయడం చూసి అపర్ణ కంగారు పడుతుంది. నీ ప్రయత్నంలో నిజాయితీఉంది, కావ్య కోసం పడుతున్న తపన, కొడుకు జీవితం బాగుండాలన్న ఆశ కనిపిస్తుందని భార్యకు ధైర్యం చెబుతాడు సుభాష్.
క్షమించేది లేదు...
ఈ వంకతో నాకు నాలుగు మంచి మాటలు చెప్పి నాకు దగ్గరవ్వాలని చూస్తున్నారా అంటూ సుభాష్‌ను ఛీ కొడుకుతుంది అపర్ణ. ఒకప్పుడు ఇలాంటి మాటాలే మాట్లాడి నన్ను నమ్మించి మోసం చేశారు. నాపై ప్రేమ ఉన్నట్లు నటించారు. మిమ్మల్ని జీవితంలో క్షమించేది లేదని భర్తతో అంటుంది అపర్ణ. కోడలి మాటల్ని చాటు నుంచి ఇందిరాదేవి వింటుంది. ఏదో ఒకరోజు అపర్ణ నిన్ను తప్పకుండా క్షమిస్తుందని సుభాష్‌తో అంటుంది ఇందిరాదేవి. నేను చేసిన తప్పుకు అపర్ణకు శిక్ష పడటం ఎక్కువ బాధను కలిగిస్తోందని సుభాష్ అంటాడు.
రాజ్ ఈగోపై దెబ్బ...
ఇంటి పనుల ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో రాజ్ ఈగోపై దెబ్బకొట్టి అతడిని ఆఫీస్‌కు పంపేలా చేసేందుకు మరో ప్లాన్ వేస్తారు ఇందిరాదేవి, అపర్ణ. ఇంటి పనులన్నీ డ్రైవర్, పనిమనిషి శాంతకన్న నువ్వే బాగా చేశావని మనవడిని సీతారామయ్య మెచ్చుకుంటాడు. పనివాళ్లను ఉద్యోగం నుంచి తీసేస్తానని, ఇక నుంచి అవన్నీ నువ్వే చూసుకోవాలని రాజ్‌తో అంటాడు సీతారామయ్య.తాతయ్య మాటలు విని రాజ్ టెన్షన్ పడతాడు.
దుష్టులకు దూరంగా...
కంపెనీకి సీఈవోను చేసిన మీరే నా కొడుకును పనిమనిషిని చేస్తారా అంటూ సీతారామయ్యతో అంటుంది అపర్ణ. కావ్యకు భయపడి రాజ్ ఆఫీస్‌కు వెళ్లనని అంటున్నాడుగా...మరి ఏం చేయాలి సీతారామయ్య అంటాడు. కావ్యకు భయపడి కాదని, దుష్టులకు దూరంగా ఉండాలనే ఆఫీస్‌కు వెళ్లడం లేదని రాజ్ అంటాడు.
ఎంతైనా మా కావ్య చాలా గ్రేట్...నీలాంటివాడిని గడగడ లాడించి ఇంట్లో ఉండేలా చేసిందని స్వప్న అంటుంది. బాస్ అంటే అలా ఉండాలని అంటుంది. నేను భయపడలేదని రాజ్ బదులిస్తాడు.
కావ్యతో తాను పనిచేసేది లేదని రాజ్ అంటాడు. కానీ మా కావ్య మాత్రం నీతో పనిచేయాలని అనుకుంటుంది స్వప్న ఆన్సర్ ఇస్తుంది. నువ్వు ఇలా ఉంటి పట్టునే ఉంటే రాహుల్‌లా ఎందుకు పనికిరాకుండా పోతావని గాలితీసేస్తుంది. కావ్య చాలా మంచిదని, నీకు చాలా వాల్యూ ఇస్తుందని, మా అత్తలా ముంచే మనిషి కాదని రాజ్‌ను కన్వీన్స్ చేస్తుంది స్వప్న.
కావ్య ప్లాన్ ఫెయిల్...
మీరు కంపెనీ సీఈవోగా ఎంతకాలం పనిచేస్తారో తెలియదని, మిమ్మల్ని నమ్మి కంపెనీలోపెట్టుబడులు పెట్టి బిజినెస్ చేయలేమని కావ్యతో మీటింగ్‌కు అటెండ్ అయిన క్లయింట్స్ అంటారు. కావ్య ఏం చెబుతుందో వినకుండా వెళ్లిపోతారు. ఇప్పుడు అర్థమైందా..నువ్వేంటో..నీస్థానమేంటో కంపెనీని నడపటం అంటే బొమ్మలకు రంగులు వేసినంత ఈజీ కాదని కావ్యను అవమానిస్తాడు రాజ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్