Tejaswi Madivada: మేనేజర్ల మాటలు విని షాకయ్యా - సినీ పరిశ్రమపై తేజస్వి మదివాడ ఆసక్తికర వ్యాఖ్యలు
సినీ పరిశ్రమలో మంచితో చాలా చాలా చెడు కూడా ఉందని అన్నది తేజస్వి మదివాడ(Tejaswi Madivada). ఆమె హీరోయిన్ గా నటించిన కమిట్ మెంట్ (commitment movie) సినిమా ఆగస్ట్ 19న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇండస్ట్రీ గురించి తేజస్వి ఏమన్నదంటే...
సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా ఏళ్లయినా ఇప్పటికీ తాను అప్‌కమింగ్ హీరోయిన్‌గానే మిగిలిపోయానని చెప్పింది తేజస్వి మదివాడ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అనుక్షణం, కేరింతతో పాటు సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. బిగ్‌బాస్ 2, బిగ్‌బాస్ నాన్‌స్టాప్ లో కంటెస్టెంట్స్ ఒకరిగా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలో నటిస్తున్న కమిట్మెంట్ సినిమా ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో తేజస్వి మదివాడ సినీ పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో అవకాశాల కోసం మేనేజర్లను కలిసినప్పుడు వారి మాటలు షాక్‌కు గురిచేశాయని చెప్పింది. వాటికి ఎలా రియాక్ట్ కావాలో అర్థమయ్యేది కాదని తెలిపింది.
వయసు, అనుభవం వచ్చిన తర్వాత ఇండస్ట్రీలోని రియాలిటీ ఏమిటో అర్థమైందని అన్నది. అలాంటి సంఘటనలను కమిట్మెంట్ సినిమాలో చూపించబోతున్నట్లు తేజస్వి పేర్కొన్నది. సినిమా ఇండస్ట్రీయే తనకు పేరుప్రఖ్యాతులు ఇచ్చిందని, అలాంటి ఇండస్ట్రీపై ఆరోపణలు చేయడం తనకు ఇష్టం ఉండదని అన్నది. కానీ సినీ పరిశ్రమలో గుడ్తో పాటు చాలా బ్యాడ్ ఉందని పేర్కొన్నది. అవకాశాలు తగ్గడంతోనే అడల్ట్ సినిమాలు చేస్తున్నాననే ప్రచారంలో నిజం లేదని తెలిపింది.
కంటెంట్ నచ్చితే ఎలాంటి సినిమానైనా చేయడానికి తాను సిద్ధమేనని చెప్పింది. తనకు అలాంటి పరిమితులు లేవని తేజస్వి చెప్పింది. రియల్ లైఫ్ లో సినిమా ఇండస్ట్రీలో ఎదురైన సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయని చెప్పింది. తొలి సినిమా ఐస్‌క్రీమ్‌లో నవదీప్‌తో కిస్సింగ్ సీన్లో నటించడంతో ప్రతి సినిమాలో దర్శకనిర్మాతలు అలాంటి సీన్స్ లో నటించమని కోరుతున్నారని తెలిపింది.
ఈ సినిమాలో కిస్సింగ్ సీన్లో కంఫర్ట్‌గా నటించాలనే తన ఫ్రెండ్ శ్రీనాథ్ ను హీరోగా రికమండ్ చేశానని చెప్పింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లయినాఇప్పటికీ తాను కోరుకున్న సక్సెస్ రాలేదని చెప్పింది. దర్శకుడు లక్ష్మీకాంత్ ఎలాంటి కమిట్ మెంట్స్ అడగకుండా సినిమాలో పూర్తి స్వేచ్ఛనిస్తూ నటించడానికి సహకరించాడని పేర్కొన్నది.